పాక్ తో తెంచుకుంటున్న పీఓకే ...భారత్ ఏం చేయనుంది ?
ఇదిలాఉంటే పీఓకేలో స్థానిక అసెంబ్లీ ఎన్నికల విషయం ఇపుడు పీఓకే జనాల ఆగ్రహానికి కారణం అయింది. ఈ నెల 37న అక్కడ ఎన్నికలు జరగనున్నాయి.
By: Tupaki Desk | 10 July 2026 4:00 AM ISTపాక్ ఆక్రమిత కాశ్మీర్ ఇపుడు పాకిస్థాన్ తో అమీతుమీకి రెడీ అయిపోయింది. తెంచుకోవడానికే నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తుంది. దాని కోసం ఉద్యమాన్ని ఉధృతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. పాక్ కే అల్టిమేటం ఇస్తోంది పీఓకే. దాంతో పాటు 48 గంటల డెడ్ లైన్ పెట్టేసింది. ఇక చావో రేవో అన్నట్లుగా పీఓకేలో పరిస్థితి కనిపిస్తోంది. పాక్ దాష్టికాలకు ఇక ముగింపు పలుకుతామని పీఓకే జనాలు గర్జిస్తున్నారు. తాము బంధాలను తెంచుకుంటామని అంటున్నారు. తమ డిమాండ్లు కనుక రెండు రోజుల వ్యవధిలో నెరవేర్చకపోతే మాత్రం పీఓకేలో ఎన్నడూ చూడనంత అతి పెద్ద ఉద్యమానికి తెర తీస్తామని కూడా హెచ్చరిస్తున్నారు.
గత నెల రోజులుగా :
ఇదిలా ఉంటే పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ ఏకంగా నెల రోజుల నుంచి అట్టుడికిపోతోంది. అక్కడ పరిస్థితి అంతా ఉద్రిక్తంగా మారుతోంది. పాక్ సైన్యాన్ని సైతం ధిక్కరించి పేఓకే ప్రజలు ఎదురొడ్డుతున్నారు ఎక్కడా వారు వెనక్కి తగ్గడం లేదు పాక్ పాలకులకు తాము ఏ మాత్రం తలొగ్గేది లేదని స్పష్టం చేస్తున్నారు. తమ 38 డిమాండ్లను రెండు రోజుల వ్యవధిలో పరిష్కరించకపోతే కనీ వినీ ఎరుగని పోరాటం చూస్తారు అని పాక్ పాలకులకు హెచ్చరికలు పంపించారు.
స్థానిక ఎన్నికలతోనే :
ఇదిలాఉంటే పీఓకేలో స్థానిక అసెంబ్లీ ఎన్నికల విషయం ఇపుడు పీఓకే జనాల ఆగ్రహానికి కారణం అయింది. ఈ నెల 37న అక్కడ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో 12 సీట్లను శరణార్ధులకు పాక్ ప్రభుత్వం కేటాయించింది. దాంతో ఆ రిజర్వేషన్ల మీదనే పీఓకే మండుతోంది. ఈ పన్నెండు సీట్లు పాకిస్థాన్‌లో దాదాపుగా నాలుగు లక్షల 36 వేల ఓటర్లకు ప్రాతినిధ్యం వహిస్తుండగా మిగిలిన మరో 33 సీట్లు అయితే నేరుగా ఎన్నికల్లో పాల్గొనే పీఓకేలో నివసిస్తున్న దాదాపు 33 లక్షల ఓటర్లకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. దాంతో తాము ఓటు వేసి గెలిపించుకునే 33 సీట్ల కంటే పీఓకేలోని వారి కంటే కూడా శరణార్ధులకు ఎక్కువ సీట్లు ఎక్కువ ప్రాధాన్యత దక్కుతోంది అని పీఓకే ఉద్యమకారులు మండిపడుతున్నారు. దాంతో ఆ పన్నెడు సీట్ల రిజర్వేషన్లు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఫుల్ యాక్షన్ మోడ్ లో :
ఇక చూస్తే పీఓకేలో ఉద్యమానికి లీడ్ చేస్తున్నది జమ్మూ కాశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ అంటే షార్ట్ కట్ లో జాక్ అన్న మాట. ఈ జాక్ తమవైన 38 డిమాండ్లను పాక్ ముందు పెట్టింది. శరణార్ధుల సీట్లను రద్దు చేయడమే కాదు ఇంకా తమకు సంబంధించిన ఎన్నో డిమాండ్లు అందులో ఉన్నాయి. దాంతోనే 48 గంటల డెడ్ లైన్ ని జాక్ పెట్టేసింది. ఇతర డిమాండ్లు ఏంటి అంటే జల విద్యుత్ ప్రాజెక్టుల మీద పూర్తిగా సమీక్ష చేయాలని అలాగే నిత్యావసర వస్తువుల మీద అధిక సబ్సిడీలు ఇవ్వాలని విద్యుత్ చార్జీలను తగ్గించాలని కోరుతోంది. పీఓకేలో ఉన్న వనరులను వాడుకుంటున్న పాక్ అక్కడ రాజకీయ వివక్ష చూపిస్తోంది. అంతే కాదు ఆర్ధికంగా వారిని నష్టపరుస్తొంది. దాంతొనే ప్రజలలో పెద్ద ఎత్తున అసంతృప్తి పెల్లుబుకుతోంది.
మూడేళ్ళుగా పోరాటం :
ఇక జాక్ అన్నది 2023లో ఏర్పాటు అయింది. గడచిన మూడేళ్ళుగా పీఓకే సమస్యల మీద అలుపెరగని పోరాటం చేస్తోంది. తమకు రాయితీలు కావాలని సమాన హక్కులు ఉండాలని జాక్ వాదిస్తోంది. ఈ క్రమంలో లెక్కలేనన్ని ధర్నాలు చేశరు. నిరసనలు చేపట్టారు. పాక్ సైన్యంతోనే నేరుగా ఢీ కొట్టారు. ఈ క్రమంలో ఎంతో మంది మరణించా ఎక్కడా తగ్గడం లేదు. పీఓకే పాక్ లో భాగంగా లేదు, అయినా అక్కడ పెత్తనం అంతా పాక్ దే. ఇక పీఓకే పాక్ లో విలీనం కావడాన్ని ఎవరూ వ్యతిరేకించకూడదని అంతే కాదు ఎన్నికల్లో పోటీ చేయాలంటే విలీనానికి మద్దతుగా ప్రకటన చేయాలని నిబంధనలను పాక్ చేర్చింది. దాంతోనే పీఓకే మండుతోంది.
వనరుల దోపిడీ :
పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో వనరులు పుష్కలంగా ఉన్నాయి. అంతే కాదు అటవీ ప్రాంతం ఉంది. గ్రాఫైట్, పాలరాయి, రత్నాలతో సహా అరుదైన ఖనిజాలు ఇక్కడ సమృద్ధిగా దొరుకుతాయి. సాగు తాగు నీరుకు కొరత లేకుండా ఇక్కడ సింధూ నది ప్రవహిస్తోంది. ఈ నదీ జలాలనే పాక్ తన పంజాబ్ సింధ్ వంటి ప్రాంతాలకు పూర్తిగా వాడేసుకుంటోంది. ఇక్కడ జల విద్యుత్ ప్రాజెక్టుల నుంచి వచ్చే విద్యుత్ ని కూడా పాక్ వాడుకుంటోంది. దీంతో దండీగా వచ్చే ఆదాయం అంతా పాక్ కి పోతూంటే పీఓకే ప్రజలు మాత్రం పేదరికం దరిద్రంతో సతమతమవుతున్నారు. వీరికి తెలిసింది వ్యవసాయం. అయినా వీరికి ఆకలి బాధలు తప్పడం లేదు. ఈ నేపధ్యంలో తమ బతుకు బతకాలని పీఓకే చూస్తోంది. వీలుంటే భారత్ లో కలిసిపోవాలని అనుకుంటోంది. ఇక గతంలోనూ ప్రస్తుతం కూడా తరచూ భారత పాలకులు ఆక్రమిత కాశ్మీర్ ని స్వాధీనం చేసుకుంటామని అంటూంటారు. మరి అది జరుగుతుందా అన్నదే ప్రశ్న. పీఓకే భారత్ లో విలీనం అయితే లాభాలతో పాటు ఇబ్బందులు కూడా అనేకం ఉన్నాయి. ఏది ఏమైనా పీఓకే పోరాటానికి ముగింపు తెగింపు వస్తోంది. దాంతో ఏమి జరుగుతుందో చూడాల్సి ఉంది.
