Begin typing your search above and press return to search.

పీకే పేరు ఫుల్ గా వాడేస్తున్న టీడీపీ... అసలు వాస్తవం ఇదే!

ఈ సమయంలో ప్రముఖ రాజకీయ వ్యూహకర్త పీకే గురించి గతకొన్ని రోజులుగా ఇటువంటి ప్రచారానికే ఆ వర్గం మీడియా పూనుకుందని చెప్పొచ్చు!.

By:  Tupaki Desk   |   16 Dec 2023 11:15 AM GMT
పీకే పేరు ఫుల్  గా వాడేస్తున్న టీడీపీ... అసలు వాస్తవం ఇదే!
X

ప్రధానంగా తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు చూపిస్తూ గ్లోబల్స్ ప్రచారం చేయడంలో ఒక వర్గం మీడియా ప్రముఖ పాత్ర పోషిస్తుంటుందని చెబుతుంటారు. ఫలితంగా తమ అనుకూల రాజకీయ పార్టీకి లాభం చేకూర్చే విధంగా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నానికి పూనుకుంటారని చెబుతుంటారు. ఈ సమయంలో ప్రముఖ రాజకీయ వ్యూహకర్త పీకే గురించి గతకొన్ని రోజులుగా ఇటువంటి ప్రచారానికే ఆ వర్గం మీడియా పూనుకుందని చెప్పొచ్చు!.

అవును... ప్రశాంత్ కిషోర్ (పీకే).. రాజకీయాలపై కాస్త అవగాహన ఉన్న వారికి ఈ పేరు పెద్దగా పరిచయం అవసరం లేదని చెప్పినా అతిశయోక్తి కాదు. "ఐప్యాక్" పేరుతో పొలిటికల్ కన్సల్టెన్సీని ఏర్పాటు చేసి, రాజకీయ వ్యూహకర్తగా అనేక పార్టీలకు సేవలు అందించారు. ఇందులో భాగంగా.. ప్రధాని మోడీతో సహా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, మమతాబెనర్జీ, స్టాలిన్ సహా ఏపీలో వైఎస్ జగన్‌ పార్టీకి రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరించారు.

అయితే గత ఏడాదికాలంగా ఆయన "ఐప్యాక్" మేనేజ్మెంట్ బాధ్యతల నుంచి పూర్తిగా వైదొలగి.. తన సొంత రాష్ట్రం బీహార్‌ లో "జనసురాజ్" పేరుతో రాజకీయ వేదికను ఏర్పాటు చేశారు. ఈ సమయంలో కొంతమంది టీంతో కలిసి, రాజకీయాలపై ఆసక్తి గలిగిన యువతతో కలిసి.. ఆ రాష్ట్రంలో పాదయాత్ర పేరుతో ప్రజలతో మమేకం అవుతున్నారు. ఇలా... బీహార్‌ రాజకీయ యవనికపై తనదైన ముద్రను లిఖించాలన్నదే తన లక్ష్యం అంటూ ముందుకు సాగుతున్నారు.

ఇలా ప్రస్తుతం బీహార్ రాజకీయాల్లో ప్రశాంత్ కిషోర్ పూర్తిగా తలమునకలై ఉన్నారు. అందుకోసమే తాను నెలకొల్పిన "ఐప్యాక్" సంస్థ నుంచి వైదొలిగారు. ఈ సమయంలో ఏపీ రాజకీయాలపై మరోసారి పీకే దృష్టి పెట్టబోతున్నార‌ని గతకొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుంది. అయితే... ఇది కేవలం ఒక వర్గం చేసుకుంటున్న ప్రచారం మాత్రమే తప్ప.. అందులో వాస్తవం పాళ్లు శూన్యం అని తెలుస్తుంది.

ఈ పరిస్థితుల్లో ఏపీ రాజకీయాల్లో తలదూర్చే ఆలోచన పీకేకు లేదన్నది అతని సహచరుల మాటగా ఉంది. ఇదే క్రమంలో... గతంలో తాను పనిచేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి, ప్రస్తుత ఏపీ సీఎం వైఎస్ జగన్‌ కు వ్యతిరేకంగా సలహాలు, సూచనలు ఇచ్చే అవకాశమే లేదని అంటున్నారు. వాస్తవాలు ఇలా ఉంటే.. జగన్ ప్రభుత్వాన్ని ఎన్నికల్లో ఎదుర్కొనేందుకు మరో కారణం దొరక్కో ఏమో కానీ... టీడీపీ అండ్ ఎల్లో మీడియా పీకే పేరును తమ స్వార్థం కోసం వినియోగించుకుంటున్నారనే చర్చ ఏపీ రాజకీయాల్లో బలంగా వినిపిస్తుంది.

వచ్చే ఎన్నికల్లో సీఎం వైఎస్ జగన్ సారథ్యంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 175 స్థానాల్లోనూ గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోంది. రాబోయే ఎన్నికల్లో "వైనాట్ 175" అనేది నినాదమని జగన్ ఇప్పటికే పిలుపునిచ్చారు. ఈ దశలో టీడీపీకి అనేక జిల్లాల్లో కనీసం పోటీలో నిలిచేందుకు అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి నేలకొందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికారపార్టీని ఇరుకున పెట్టేందుకు ఎలాంటి అంశం లేకపోవడంతో చంద్రబాబు అండ్ కో.. ప్రశాంత్ కిషోర్ పేరును తెరపైకి తెచ్చిందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.

రాబోయే ఎన్నికల కోసం ప్రశాంత్ కిశోర్.. టీడీపీకి పనిచేయబోతున్నారని, చంద్రబాబు అరెస్ట్ అనంతరం చినబాబు హస్తినలో ఉన్న సమయంలో పీకేతో మంతనాలు జరిపారని రకరకాల కథనాలు ఒకవర్గం మీడియా జనాల్లోకి వదులుతుంది. అయితే ఇదంతా ఫేక్ న్యూస్ అని.. పీకే బీహార్ రాజకీయాల్లో తనమునకలై ఉన్నారని.. టీడీపీ కోసం రంగంలోకి పీకే అనే వార్త హంబక్కే అని తాజాగా తెలుస్తుంది!