Begin typing your search above and press return to search.

"మా తాత ఇంత స్కిల్డా"... అసెంబ్లీలో పేర్ని నాని సెటైర్లు!

ఈ వివరాలన్నీ చూస్తే ఆ ఎనిమిదేళ్ల పిల్లాడికి కూడా... "మా తాత ఇంత ముదురా" అని అర్ధమైపోతుందన్ని పేర్ని నాని సెటైర్స్ వేశారు.

By:  Tupaki Desk   |   22 Sep 2023 10:05 AM GMT
మా తాత ఇంత స్కిల్డా... అసెంబ్లీలో పేర్ని నాని సెటైర్లు!
X

స్కిల్ స్కాంపై ఈ రోజు అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా మాజీమంత్రి కన్నబాబు... స్కాం జరిగిన తీరు, బాబు అనుసరించిన నేర్పరితనంపై పూర్తి వివరాలు అందించే ప్రయత్నం చేశారని అంటున్నారు. అనంతరం ఆయన ఏమైనా ఒకటి రెండు పాయింట్లు మరిచిపోతే అవి చెప్పడానికి తాను లేచానంటూ మాజీమంత్రి పేర్ని నాని మైకందుకున్నారు.

అవును స్కిల్ డెవలప్ మెంట్ స్కాంపై జరిగిన చర్చ సందర్భంగా మైకందుకున్న పేర్ని నాని... సహచర ఎమ్మెల్యే, ప్రస్తుత రిమాండ్ ఖైదీ చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ స్కాం గురించి స్నేహితులు చాలా మంది అడుగుతున్నారని అన్నారు. ఒక ఐఏఎస్ అధికారి టీవీల్లో మాట్లాడుతూ... తాను ఇచ్చిన స్టేట్ మెంట్ వల్లే చంద్రబాబు arrest అవ్వడం బాధాకరమని అంటారని గుర్తుచేశారు పేర్ని నాని.

అంతకంటే ముందు అదే ఐఏఎస్ అధికారి జడ్జి ముందు మాత్రం.. ముఖ్యమంత్రి ఒత్తిడి మేరకే డబ్బు రిలీజ్ చేశామని చెప్పారని అన్నారు. అయితే ఇలా చంద్రబాబును వెనకేసుకొస్తున్న ఐఏఎస్ లతోపాటు ప్రజలంతా ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలంటూ... ఈ స్కాం కోసం చంద్రబాబు వేసిన పక్కా ప్లాన్స్ ని వివరించే ప్రయత్నం చేశారు పేర్ని నాని.

2014లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన అనంతరం ఆగస్టు నెలలో సీమన్స్ ఇండియాకు సంబంధించిన ప్రతినిధి ఒకరు, డిజైన్ టెక్ కి సంబంధించిన ప్రతినిధి ఒకరు కలిశారని చెప్పిన పేర్ని నాని... అలా కలిసిన 19 రోజులకు ఏపీ రాష్ట్రంలో స్కిల్ డెవలప్ మెంట్ అనే ఒక కార్పొరేషన్ ని స్టార్ట్ చేయడం జరిగిందని అన్నారు. అనంతరం స్కాం జరిగిన విధానాన్ని వివరైంచే ప్రయత్నం చేశారు.

ఈ సందర్భంగా పరోక్షంగా బ్రాహ్మణి పై సెటైర్స్ వేసిన పేర్ని నాని... "రాజమండ్రి సెంట్రల్ జైల్ బయట ఒకామె అంటారు.. తన ఎనిమిదేళ్ల కుమారుడికి ఈ రిమాండ్ నోటీసు చూస్తే ఇందులో ఏమీ లేదని అంటాడని.. అది ఎవరికైనా అర్ధమవుతుందని" అన్నారని పేర్ని నాని గుర్తు చేశారు. అయితే... ఆ ఎనిమిదేళ్ల అబ్బాయికి ఈ తారీకులు చూపిస్తూ "మీ తాతగారు ఇలా చేశారు" అని చెబితే అతడికి కూడా అర్దమైపోతుందని వివరించారు.

ఇదే సమయంలో "మా తాత ఎంత ఆత్రపడ్డాడు.. 22వ తారీఖున డిజైన్ టెక్ కంపెనీవారు రావడం ఏమిటి.. దానికోసం డిపార్ట్ మెంట్లు పెట్టడం ఏమిటి.. అనంతరం మా చుట్టం గంటా సుబ్బారావుని తేవడం ఏమిటి.. మా పార్టీలో లెక్కలు చూసేవాడిని తెచ్చి డిపార్ట్ మెంట్ లో పెట్టడం ఏమిటి.. వంటి విషయాలన్నీ చూస్తే అర్ధమైపోద్దని" పేర్ని నాని తనదైన శైలిలో చెప్పారు.

ఈ వివరాలన్నీ చూస్తే ఆ ఎనిమిదేళ్ల పిల్లాడికి కూడా... "మా తాత ఇంత ముదురా" అని అర్ధమైపోతుందన్ని పేర్ని నాని సెటైర్స్ వేశారు. అనంతరం ఎంత వేగంగా ఈ కార్పొరేషన్ విషయంలో బాబు పావులు కదిపారో సవివరంగా వివరించే ప్రయత్నం చేశారు చంద్రబాబు.

ఇందులో భాగంగా ఫిబ్రవరి 6వ తేదీన కేబినెట్ అప్రూవల్ ఇచ్చారని, ఆ కేబినేట్ మీటింగ్ లో సీమర్న్స్ 3000 కోట్ల రూపాయలు, ఏపీ సర్కార్ 331 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాలని, అది తనను చూసే సీమన్స్ పెడుతుందని బాబు చెప్పారని పేర్ని చెప్పుకొచ్చారు. ఆ విధంగా కేబినెట్ అప్రూవ్ చేసిందని తెలిపారు.

ఇందులో ఒక్కో క్లస్టర్ కూ 546 కోట్ల రూపాయలు అవుతుందని.. వాటితో సుమారు 6 క్లస్టర్లు పెట్టాల్సి వస్తుందని.. అందులో ప్రతీ క్లస్టర్ లో 90 శాతం సీమన్స్ పెడుతుంది, మిగిలిన 10శాతం ప్రభుత్వం పెట్టాలని సీఎం సూచించారు. అనంతరం జూన్ 30న జీవో ఇచ్చారని పేర్ని తెలిపారు. ఇందులో పైన చెప్పినట్లుగా సీమన్స్, డిజైన్ టెక్ లతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుందన్న విషయాలు మాత్రమే ప్రస్థావించారని తెలిపారు.

అయితే జీవో లో ఉన్న 90 + 10 డిటైల్స్ , 3000 కోట్లు + 331 కోట్ల వివరాలేవీ ఒప్పందంలో లేవని, అవి చూడకుండా సంతకం ఎందుకు పెట్టారంటే కరెంట్ పోయిందని చెప్పారని పేర్ని ఎద్దేవా చేశారు. అంటే... జీవోలో ఉన్న 3000 కోట్లు అనే అంశం అగ్రిమెంట్ (ఒప్పందం)లో మాయమైపోయిన పరిస్థితి అని పేర్ని స్పష్టంగా తెలిపారు.

పైగా... అనంతరం సీమన్స్ నుంచి రావాల్సిన 3000 కోట్లు రాలేదు కానీ... ముందుగా 331 కోట్లు డిజైన్ టెక్ కంపెనీకి విడుదల చేయాలని బాబు ప్లాన్ చేశారని.. అక్కడ నుంచి డొల్లకంపెనీల ద్వారా ఎక్కడికి చేరిందనేది తెలిసిన విషయమే అన్నట్లుగా పేర్ని స్పష్టం చేశారు.

కాగా... స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసుకు సంబంధించిన రిమాండ్ నోటీసుపై నారా బ్రాహ్మణి స్పందించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... తనకుమారుడి వయసు 8ఏళ్లు అని... ఈ నోటీసు అతడికి చూపించిన రిమాండ్ నోటీసులులో ఏమీ లేదనే విషయం అర్ధమైపోద్దని చెప్పిన సంగతి తెలిసిందే!