Begin typing your search above and press return to search.

ఏం సాంబడు.. తమాషాలు చేస్తున్నావా? ఆర్డోవోపై పేర్ని నాని ఫైర్

ఇష్యూ ఏదైనా సరే.. తనదైన మార్క్ తో తరచూ వార్తల్లో నిలిచే మాజీ మంత్రి పేర్ని నాని మరోసారి వార్తల్లోకి వచ్చారు.

By:  Tupaki Political Desk   |   31 March 2026 12:20 PM IST
ఏం సాంబడు.. తమాషాలు చేస్తున్నావా? ఆర్డోవోపై పేర్ని నాని ఫైర్
X

ఇష్యూ ఏదైనా సరే.. తనదైన మార్క్ తో తరచూ వార్తల్లో నిలిచే మాజీ మంత్రి పేర్ని నాని మరోసారి వార్తల్లోకి వచ్చారు. మచిలీపట్నం ఆర్డీవో సాంబశివరావుపై ఆయన ఒంటికాలిపై లేచారు. ఇష్టారాజ్యంగా తిట్టారు. అభ్యంతర వ్యాఖ్యలు చేశారు. కొల్లు రవీంద్రకు లంచం ఇచ్చి పోస్టింగ్ వేయించుకున్నావా? అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ.. రాయలేని భాషలో తిడుతూ నిప్పులు చెరిగారు. ఒకదశలో.. ‘సాంబడూ తమాషాలు చేస్తున్నావా? మంత్రి దగ్గర చెంచాగిరి చేసి.. బాగా మూలటలు పట్టుకెళ్లొచ్చని అనుకుంటున్నావా? మీ ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నారు. ఆడి దగ్గర వీడి దగ్గర లంచాలు తింటున్నారు. భోజనం మానేసి మరీ లంచాలు తింటున్నారు’ అంటూ మండిపడ్డారు.

మచిలీపట్నం డివిజన్ పరిధిలోని అక్రమంగా పెద్ద చెరువులు తవ్వేసిన వారిని వదిలేస్తున్నారని.. చిన్నరైతుల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఆర్డీవో సాంబశివరావు తీరును తప్పు పడుతూ..ఆయనపై జాయింట్ కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ ప్రాంగణంలో మాట్లాడిన పేర్ని నాని ఫైర్ అయ్యారు. ఆర్డీవో సాంబశివరావు. బందరు తహసీల్దార్ల భాగోతాన్ని జేసీకి చెప్పానన్నారు. ‘‘జేసీ శంషేర్ లా ఉంటే.. సాంబడు మరోలా ఉన్నాడు. కోనపల్లెతుమ్మలపల్లి ఓ రైతు తన 80 సెంట్లలో చెరువు రిపేర్లు చేసుకుంటే మీ తాతకు పట్టాలున్నాయా? ఆ పట్టా తీసుకురా అని ఆర్డీవో అన్నాడు. లేదంటే.. చెరువు పూడ్చేస్తానంటూ బెదిరింపులకు దిగాడు సాంబశివరావ్. నీకేం పోయే కాలం. మీకు ఖలేజా ఉంటే.. నిజంగా రెవెన్యూ అధికారివైతే.. కానూరు.. పెదపట్నం రెవెన్యూ గ్రామాల్లో మడ అడవి తవ్వుతుంటే ఏం చేస్తున్నావ్. మీకు సిగ్గు లేదా?’’ అంటూ విరుచుకుపడ్డారు.

మంత్రి కొల్లు రవీంద్ర అనుచరులు మాజీ ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు.. మాజీ సర్పంచి కొడుకు మంత్రాల శ్రీనుకు ఎకరానికి రూ.50వేలు ఇవ్వకుంటే చెరువుల్లో పనులు చేసుకోనివ్వట్లేదు. వీరికి డబ్బులు కట్టి టోకెన్ తెచ్చుకోకుంటే.. తహసీల్దార్.. ఆర్డీవో.. సిబ్బంది వెళ్లి చెరువులు పూడుస్తామంటారు. ఆర్డీవో సాంబడు టీడీపీ నేతలకు దళారీగా మారాడు. చదువుకొని ఉద్యోగాలు చేసేది ఇందుకా? ఏసీబీ అధికారితో మాట్లాడి మీరు ఎక్కడెక్కడ ఎంతెంత లంచాలు తీసుకున్నారో తేలుస్తా’’ అంటూ పేర్ని సీరియస్ అయ్యారు.