Begin typing your search above and press return to search.

చింతమనేనితో గొడవపై పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు... వీడియోలు వైరల్!

ఇందులో భాగంగా... దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ ముందుకు రాగానే... "నాకు బాగా ఇష్టమైన నాయకులు, నేను గొడవపెట్టుకున్న నాయకులు ఈయన.

By:  Tupaki Desk   |   8 May 2024 3:34 PM GMT
చింతమనేనితో గొడవపై పవన్  ఆసక్తికర వ్యాఖ్యలు... వీడియోలు వైరల్!
X

ఏపీలో ఎన్నికల ప్రచారాల గడువు మరికొన్ని రోజులో ముగియనున్న నేపథ్యంలో... ప్రధాన పార్టీల అధినేతలంతా అవిరామంగా పలు నియోజకవర్గాలో పర్యటిస్తూ.. కీలక ప్రసంగాలు చేస్తూ.. అభ్యర్థులను ఓటర్లకు పరిచయం చేస్తూ.. ఆసక్తికరమైన హామీలు ఇస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ సందర్భంగా ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

అవును... ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కు సమయం దగ్గరపడుతున్న వేళ ప్రచార కార్యక్రమాలు హోరెత్తిపోతున్నాయి. "సిద్ధం" అంటూ జగన్ రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల్లో పర్యటిస్తుంటే.. మరోపక్క కూటమి నేతల్లో చంద్రబాబు ఒకపక్క, పవన్ కల్యాణ్ మరో పక్క ప్రచారాలు చేస్తున్నారు! ఇందులో భాగంగా.. తాజాగా హనుమాన్ జంక్షన్ లో వారాహి సభను నిర్వహించారు పవన్.

ఈ సందర్భంగా అభ్యర్థులను పరిచయం చేస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చెశారు. ఇందులో భాగంగా... దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ ముందుకు రాగానే... "నాకు బాగా ఇష్టమైన నాయకులు, నేను గొడవపెట్టుకున్న నాయకులు ఈయన. ఎవరు స్నేహితులు అవుతారు? గొడవపెట్టుకున్నవారే స్నేహితులు అవుతారు!" అని తెలిపారు పవన్ కల్యాణ్.

ఇదే క్రమంలో... "ఈయన పవన్ కల్యాణ్ పోటీ చేస్తానంటే దెందులూరు నుంచి నేను గెలిపిస్తాను అని చెప్పిన చింతమనేని ప్రభాకర్ కి మనస్పూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు. ఆయనతో గొడవపెట్టుకోవడం కూడా అందంగా ఉంటుంది నాకు. ప్రేమ ఉన్న చోటే గొడవ ఉంటుంది. గొడవతో స్టార్ట్ అయిన మైత్రి చాలా బలంగా ఉంటుందని చెప్తాను" అంటూ ముగించారు.

కాగా... గతంలో ముగ్గురు వ్యక్తులు తనను ఎన్నికలలోపు చంపేస్తే బెటరని మాట్లాడుకున్నారనే సమాచారం తనకు ఉందని.. ఫలితంగా, అధికార పార్టీని ప్రతిపక్షం, ప్రతిపక్ష పార్టీని అధికార పక్షం తిట్టుకుని ఎవరో ఒకరు లాభపడతారని.. అలాంటి వాటికి తాను భయపడనని.. వారు ఎవరో తెలుసని.. వారి పేర్లు తెలుసు, వారి ముఖాలు తెలుసని చెప్పారు పవన్ కల్యాణ్!

ఈ సందర్భంగా నాడు స్పందించిన చింతమనేని... ఆకు రౌడీ అంటున్నాడు, వీధి రౌడీ అంటున్నాడు. ఆయన గనుక ఆ పేర్లు రిజిస్టర్ చేయించుకుంటే, భవిష్యత్తులో రాబోయే సినిమాలకు ఆయన ఈ పేరుపెట్టుకుంటే బాగుంటుందని.. రౌడీ ఇజం, గూండా ఇజం అని ఎవరైనా అంటే మక్కెలిరగదీయిస్తా అంటూ స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు.

అనంతరం స్పందించిన పవన్... నేరుగా దెందులూరు ఎమ్మెల్యే అని సంభోదిస్తూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇందులో భాగంగా... దెందులూరు రౌడీ ఎమ్మెల్యేకు కూడా చెబుతున్నాను.. ఇంకోసారి ఏలూరు పరిశరాలకు వచ్చి మీరు రౌడీఇజం చెలాయిస్తే కాళ్లు ఇరగగొట్టి కింద కూర్చో బెడతాను జాగ్రత్త అంటూ స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు వైరల్ గా మారాయి!