Begin typing your search above and press return to search.

ఢిల్లీ ఫ్లైట్ ఎక్కనున్న పవన్...మ్యాటర్ వెరీ సీరియస్...!?

ఈసారి పవన్ ఢిల్లీ టూర్ చాలా విషయాల మీద ఫుల్ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని తెలుసోంది.

By:  Tupaki Desk   |   16 Sep 2023 5:08 PM GMT
ఢిల్లీ ఫ్లైట్ ఎక్కనున్న పవన్...మ్యాటర్ వెరీ సీరియస్...!?
X

జనసేన అధినేత పవన్ ఇపుడు ఏపీలో రియల్ అపోజిషన్ రోల్ ప్లే చేస్తున్నారు. చంద్రబాబు జైలు పాలు కావడంతో టీడీపీ యువనేత లోకేష్ తండ్రిని బయటకు తెచ్చేందుకు పోరాడే పనిలో నిమగ్నమైన క్రమంలో పవన్ ఫుల్ యాక్టివ్ అయ్యారు. నిజానికి పవన్ కళ్యాణ్ సెప్టెంబర్ లో సినిమా షూటింగులతో బిజీగా ఉంటారు అని టాక్ నడచింది.

అయితే చంద్రబాబు అరెస్ట్ తో అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. దీంతో ఒక్కసారిగా పవన్ మంగళగిరికి మకాం మార్చేశారు. జనసేన విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించి మరీ టీడీపీతో పొత్తు ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చిందో వారికి వివరించే ప్రయత్నం చేశారు.

ఇదే మీటింగులో మాట్లాడుతూ త్వరలో తాను ఢిల్లీకి వెళ్ళనున్నట్లుగా చెప్పారు. తాను ఎండీయేలో ఉన్నాను కాబట్టి పొత్తు అంశాన్ని వారికి తెలియచేయాల్సిన బాధ్యత ఉందని పవన్ పార్టీ నేతలకు చెప్పారు. అసలు ఏపీలో ఏమి జరుగుతోంది అన్నది ఢిల్లీ పెద్దలకు పూర్తిగా తెలియచేస్తూనే అక్రమ అరెస్టుల మీద కూడా కేంద్ర బీజేపీ నాయకత్వం దృష్టికి తీసుకుని రావాలని పవన్ చూస్తున్నారు అంటున్నారు.

ఏపీలో చంద్రబాబుని అరెస్ట్ చేయడంతో తలెత్తిన సమస్యల కారణంగానే తాను టీడీపీకి మద్దతు ఇవ్వాల్సి వచ్చిందని పవన్ చెబుతారని అంటున్నారు. ఏపీలో వైసీపీ అరాచక పాలన నుంచి గద్దె దించేందుకు బీజేపీ కూడా కలసిరావాలని పవన్ కోరతారు అని అంటున్నారు.

ఈసారి పవన్ ఢిల్లీ టూర్ చాలా విషయాల మీద ఫుల్ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని తెలుసోంది. బీజేపీ టీడీపీ జనసేనలతో కలసి పొత్తుకు వస్తుందా రాదా అన్నది పవన్ ఢిల్లీ టూర్ తేల్చబోతోంది. అదే టైం లో ఏపీలో చంద్రబాబుని మళ్లీ సీఎం చేయడానికి పాత వైరాన్ని మరచి బీజేపీ రెడీ అవుతుందా లేదా అన్నది కూడా ఈ టూర్ తో తెలుస్తుంది అని అంటున్నారు.

ఇక వైసీపీకి లోపాయికారి మద్దతు ఇస్తూ ఎన్నికల వేళకు న్యూట్రల్ గా బీజేపీ ఉంటుందా లేక పూర్తి అండదండలు అధికారంలో ఉన్న పార్టీగా వైసీపీకి ఇస్తుందా అన్నది కూడా తెలియనుంది అంటున్నారు. పవన్ సైతం వ్యూహాత్మకంగానే అడుగులు వేస్తున్నారు. ముందు తన పార్టీ వారితో మీటింగ్ పెట్టి పొత్తుల గురించి వారికి చెప్పిన పవన్ ఇపుడు ఢిల్లీ పెద్దలను కలిసే క్రమంలో వారి మదిలో ఏముందో కూడా తెలుసుకోగోరుతున్నారని అంటున్నారు.

బీజేపీ ఇంకా నాంచుడు వైఖరితో ఉంటే మాత్రం పవన్ ఇక మీదట దూకుడుగా ఉంటారని, టీడీపీతోనే పొత్తు ఫిక్స్ చేసుకుని ముందుకు సాగుతారని అంటున్నారు. అపుడు కమలానికి తలాఖ్ ఇచ్చి కామ్రేడ్స్ తో టీడీపీ సేన అడుగులు వేస్తాయని అంటున్నారు. మొత్తం మీద చూసుకుంటే పవన్ ఆలోచనలు, ఆయన అడుగులు రేపటి ఎన్నికల్లో ఏపీ జాతకాన్ని మార్చాలన్న పట్టుదలతోనే ఉన్నాయని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.