Begin typing your search above and press return to search.

బిగ్ బ్రేకింగ్... చంద్రబాబుతో పవన్ ములాకత్!

అవును... రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీ గా ఉన్న చంద్రబాబుని ములాకత్ లో కలవడానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ నెల 14న కలవబోతున్నారని తెలుస్తుంది

By:  Tupaki Desk   |   13 Sept 2023 4:20 PM IST
బిగ్ బ్రేకింగ్... చంద్రబాబుతో పవన్ ములాకత్!
X

స్కిల్ డెవలప మెంట్ స్కాం కేసులో అరెస్టయ్యి, 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ నిమిత్తం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ని ములాకత్ లో భాగంగా భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేష్, కోడలు బ్రాహ్మణి కలిసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పవన్ కూడా చంద్రబాబుని కలవడానికి వెళ్తున్నారని తెలుస్తుంది.

అవును... రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీ గా ఉన్న చంద్రబాబుని ములాకత్ లో కలవడానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ నెల 14న కలవబోతున్నారని తెలుస్తుంది. ఈ సమయంలో ఇప్పటికే అధికారులతో ములాకత్ టైమింగ్స్ పై అనుమతులు తీసుకున్నారని అంటున్నారు. దీంతో ఈ భేటీ ఏపీలో రాజకీయంగా చర్చనీయాంశం కాబోతుంది.

ఇలా జైల్లో ఉన్న చంద్రబాబును పవన్ కల్యాణ్ కలిస్తే అది రాజకీయంగా హాట్ టాపిక్ కావడమే కాకుండా... ఏపీలో భవిష్యత్ రాజకీయాలకు సంబంధించి మరింత క్లారిటీలు కూడా ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇక రాబోయే ఎన్నికల్లో జనసేనతోనే కలిసి పోటీ చేయబోతున్నట్లు టీడీపీ నేతలు ఇప్పటికే కన్ ఫాం చేస్తున్న సంగతి తెలిసిందే!

మరోపక్క... ఈ రోజు సాయంత్రం నందమూరి బాలకృష్ణ... తన బావ చంద్రబాబుని రాజమండ్రి జైల్లో కలవబోతున్నారు. ఇదే సమయంలో ఈ రోజు లాయర్ లూథ్రా కూడా చంద్రబాబును జైల్లో కలవనున్నారు.