Begin typing your search above and press return to search.

పవన్ "వారాహి సభ"కు అనుమతి నిరాకరణ... కారణం క్లియర్!

ఈ క్రమంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ విషయంలో పోలీసులు షాక్ ఇచ్చారు.

By:  Tupaki Desk   |   30 March 2024 1:24 PM GMT
పవన్ వారాహి సభకు  అనుమతి నిరాకరణ... కారణం క్లియర్!
X

తాను పోటీ చేయబోయే స్థానం పిఠాపురం అని ప్రకటించిన పవన్ కల్యాణ్... తాజాగా ఆ నియోజకవర్గంలో మూడు రోజుల పర్యటనకు ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఈ రోజు (మార్చి 30) నుంచి ఆయన ఎన్నికల ప్రచార బరిలోకి దిగారు. ఈ ప్రచార కార్యక్రమానికి "వారాహి విజయభేరి" అని నామకరణం చేశారు. ఈ క్రమంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ విషయంలో పోలీసులు షాక్ ఇచ్చారు.

అవును... ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇప్పటికే జగన్ "మేమంతా సిద్ధం" అని.. చంద్రబాబు "ప్రజాగళం" అని ప్రచార కార్యక్రమాలు మొదలుపెట్టేసిన నేపథ్యంలో... తాజాగా పవన్ కల్యాణ్ "వారాహి విజయభేరి" అని ప్రచార కార్యక్రమాలకు తెరలేపారు. ఇందులో భాగంగా... తొలిసభను శనివారం సాయంత్రం 30న చేబ్రోలు రామాయం సెంటర్ లో ప్రారంభించాలని ఫిక్స్ అయ్యారు. అయితే ఈ సందర్భంగా స్పందించిన పోలీసులు... వారాహి వాహనానికి అనుమతి లేదని స్పష్టం చేశారు.

ఇందులో భాగంగా... చేబ్రోలులో పవన్ కల్యాణ్ వారాహి వాహనానికి అనుమతి లేదని నిరాకరించిన పోలీసులు... నిర్ణీత గడువులోగా వారాహి ఆహనానికి అనుమతి కోసం దరఖాస్తు చేసుకోలేదని చెప్పడమే కారణం అని తెలిపారు. ఈ సందర్భంలో వారాహి వాహనంపై నిల్చుని మాట్లాడొద్దని సూచించారు. అయితే... చిన్నపాటి వాహనానికి మాత్రం అనుమతి ఇచ్చారు. దీంతో... పోలీసుల తీరుపై జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు!

కాగా... ఏపీలో రానున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా జనసేన తరుపున పిఠాపురం నుంచి బరిలోకి దిగుతున్న పవన్ కల్యాణ్ ఈ రోజు ఉదయమే ప్రత్యక విమానంలో పిఠాపురం చేరుకున్నారు! ఈ సందర్భంగా స్థానిక టీడీపీ ఇన్ ఛార్జ్ ఎస్.వి.ఎస్.ఎన్. వర్మ ఇంటికి వెళ్లిన పవన్.. ఆ కుటుంబం ఆశీర్వాదం తీసుకున్నారు.

అనంతరం మధాహ్నం ఒంటిగంటకు స్థానిక దత్తపీఠంలోని అమ్మవారి దర్శనం, వారాహి వాహనానికి ప్రత్యేక పూజలు చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే.. మధ్యాహ్నం అమ్మవారి ఆలయం మూసి ఉండటంతో... ఈ పూజా కార్యక్రమాన్ని సాయంత్రానికి వాయిదా వేసుకున్నారు. ఈ క్రమంలో సాయంత్రం 4 తర్వాత వారాహి వాహనంతో అమంవారి ఆలయానికి వెళ్లేందుకు సిద్ధం కాగా... పోలీసులు ఈ రకంగా షాక్ ఇచ్చారు.