Begin typing your search above and press return to search.

వారిపై వేటు వేసేందుకు పవన్ రెడీ ?

జనసేనలో ఉంటూ సొంత పార్టీ వారి మీదనే కత్తులు దూస్తూ మీడియాకి లీకులు ఇస్తున్న లీకు వీరులు పార్టీ లైన్ దాటిన వారి జాబితా అయితే జనసేన రెడీ చేసి పెట్టింది అని అంటున్నారు.

By:  Satya P   |   30 May 2026 8:00 AM IST
వారిపై వేటు వేసేందుకు పవన్ రెడీ ?
X

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాజమండ్రిలో జరిగిన పార్టీ సమావేశంలో యాధాలాపంగానే అనేక విషయాల గురించి చెప్పుకొచ్చారు. దాంతో ఆయన చెప్పిన ప్రతీ మాట మీద కూడా విశ్లేషిస్తున్నారు. ఆయన జనసేన ఎదుగుదల గురించి మాట్లాడుతూనే సొంత పార్టీలో ఉన్న వారి మీద కూడా పరోక్ష విమర్శలు చేశారు. పార్టీలో ఉంటూనే సొంత వారి మీద సోషల్ మీడియాకు మెయిన్ స్ట్రీమ్ మీడియాకూ లీకులు ఇస్తున్నారు అని మండిపడ్డారు. అలాంటి వారు ఎవరో తనకు తెలుసు అని కూడా చెప్పారు. పార్టీ పెద్దలకు ఏమీ తెలియదని వీరంతా ఈ తరహా రాజకీయం చేస్తున్నారు అని కానీ పార్టీ అన్నీ గమనిస్తోంది అని పవన్ బాంబు పేల్చారు.

నిక్కచ్చిగానే అంతా :

పవన్ ట్రెడిషనల్ పొలిటీషియన్ అయితే కారు. ఆయన ప్రజా సేవ చేయాలని తలంపుతో రాజకీయాల్లోకి వచ్చిన వారు అందువల్ల ఆయన భిన్నంగానే ఆలోచిస్తారు సగటు మనిషిగానే ఆయన ఆలోచనలు ఉంటాయి. మరో వైపు చూస్తే ఆయన నిక్కచ్చిగా వ్యవహరిస్తారు. అందులో తర తమ బేధాలు కూడా చూసుకోరని చెబుతారు. తప్పు చేస్తే తన పార్టీ వారిని అయినా వదిలించుకునేందుకు పవన్ సిద్ధంగా ఉంటారని అంటారు. ఇపుడు చూస్తే ఏపీలో అదే జరగబోతోందా అన్న చర్చ హాట్ హాట్ గా జనసేనలో సాగుతోంది.

జాబితా సిద్ధమేనా :

జనసేనలో ఉంటూ సొంత పార్టీ వారి మీదనే కత్తులు దూస్తూ మీడియాకి లీకులు ఇస్తున్న లీకు వీరులు పార్టీ లైన్ దాటిన వారి జాబితా అయితే జనసేన రెడీ చేసి పెట్టింది అని అంటున్నారు. ఈ జాబితాలో నంబర్ కనుక చూస్తే ఏకంగా 15 నుంచి 20 మంది దాకా ఉన్నట్లు చెబుతున్నారు. ఇందులో సీనియర్లు జిల్లా స్థాయి నేతలు కూడా ఉన్నారని అంటున్నారు. ఇలాంటి వారిని పెట్టుకుని పార్టీని ముందుకు తీసుకుని వెళ్ళడం సాధ్యం కాదని పవన్ భావిస్తున్నారు అని అంటున్నారు. అంతే కాదు ఈ నేతల పోకడల పట్ల కూడా ఆయన అసహనంగా ఉన్నారని అంటున్నారు. వీలైనంత తొందరగా వీరిని వదిలించుకోవడమే బెటర్ అన్న నిర్ణయానికి అయితే జనసేన పెద్దలు వచారని చెబుతున్నారు

స్థానిక ఎన్నికలకు ముందే :

మరో నాలుగు నెలలలో స్థానిక సంస్థల ఎన్నికలు ఏపీలో జరగనున్నాయి. దాని కంటే ముందే ఈ విధంగా పార్టీ పరువుని బజారున వేస్తున్న నేతలు, సొంత పార్టీలో విభీషణులు, పార్టీని ధిక్కరిస్తున్న వారిని సాగనంపాలని గట్టిగానే జనసేన డిసైడ్ అయింది అని అంటున్నారు. వీరి విషయంలో పవన్ అయితే సీరియస్ గానే ఉన్నారని అంటున్నారు. పార్టీ అధినాయకత్వం చెప్పినట్లుగా మసలుకునే వారు కావాలని పార్టీని ఇబ్బందుల్లో నెట్టి సొంత నేతల మీదనే కత్తులు దూసే వారు వద్దే వద్దు అన్నది జనసేన అధినాయకత్వం తీసుకున్న కఠినమైన నిర్ణయం అని అంటున్నారు మొత్తం మీద చూస్తే తొందరలోనే జనసేన నుంచి ఒక బాంబు లాంటి డెసిషన్ రావడం ఖాయమని అపుడు తుళ్ళిపోయే సైనికులు ఎవరు అన్నది తెలుస్తుందని అంటున్నారు సో అలాంటి న్యూస్ కోసం అంతా వెయిట్ చేస్తున్నారు.