కొత్త ఉగాది జోస్యం : పవన్ కి రాజయోగమట !
పవనిజం ఏంటో చూపించి సినీ నటుడికి మించిన ఫాలోయింగ్ సంపాదించుకున్నారు.
By: Tupaki Desk | 29 March 2025 1:00 AM ISTజనసేన అధినేత ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జాతకం ఎలా ఉంది అంటే బ్రహ్మాండం అని ఆయన గురించిన ఏ వివరాలూ తీసుకోకుండానే ఇట్టే చెప్పేయొచ్చు. పవన్ సినీ రంగంలో మెగాస్టార్ తమ్ముడిగా ఎంట్రీ ఇచ్చినా అతి తక్కువ సమయంలోనే పవర్ స్టార్ గా ఎదిగారు. తనకంటూ సొంత ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నారు. పవనిజం ఏంటో చూపించి సినీ నటుడికి మించిన ఫాలోయింగ్ సంపాదించుకున్నారు.
అదే ఆయనను రాజకీయాల్లోకి సైతం నడిపించింది. పవన్ రాజకీయాల్లోకి వచ్చారు అంటే ఆయనను అమితంగా అభిమానించే యువత మహిళలు ఉండబట్టే. వారు ఆయనను నీరాజనాలు పరిచారు. అయితే రాజకీయాల్లో ఈక్వేషన్స్ తెలియక పవన్ కి 2019లో పరాజయం ఎదురైంది. కానీ 2024లో మాత్రం పవన్ అన్ని రకాలైన వ్యూహాలతో రంగంలోకి దిగారు
దాంతో 21 అసెంబ్లీ సీట్లతో పాటు 2 ఎంపీ సీట్లను గెలుచుకుని నూరు శాతం స్ట్రైకింగ్ రేట్ ని సాధించారు. దాంతో జనసేనాని బలం ఏంటో తెలిసివచ్చింది. ఇక చంద్రబాబు పక్కనే ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ అధికార వైభవాన్ని చూస్తున్నారు ప్రతీ ప్రభుత్వ ఆఫీసులో సీఎం ఫోటో పక్కన డిప్యూటీ సీఎం ఫోటో ఉండడం ఒక్క పవన్ విషయంలోనే జరిగింది. అది ఆయనకు గొప్ప గౌరవాన్ని ఇచ్చింది.
ఇంకో వైపు చూస్తే ప్రభుత్వ కార్యక్రమాలలో ఫ్లెక్సీలలో ప్రధాని మోడీ బాబు ఫోటోలతో పాటు తప్పనిసరిగా పవన్ ఫోటో ఉంటోంది. ఈ నేపధ్యంలో పవన్ నిజంగా రాజయోగాన్నే అనుభవిస్తున్నారు అయితే పవన్ జాతకంలో ఏడేళ్ళ పాటు ఏలినాటి శని ప్రభావం నడచింది అని జ్యోతీష్య పండితులు చెబుతున్నారు.
అది 2018 నుంచి మొదలైంది. 2025 ఉగాదితో ముగుస్తోంది. దాంతో పవన్ కి వచ్చేది మహా రాజయోగమే అని అంటున్నారు. ప్రస్తుతం ఉన్న రాజకీయ దశ నుంచి ఆయన మరింత ఉన్నతంగా వెళ్తారని అంటున్నారు మరి ఇప్పటికే ఉప ముఖ్యమంత్రిగా కీలకమైన స్థానంలోనే పవన్ ఉన్నారు. మరి ఇంతకు మించి ఏమి ఉంటుంది అన్నదే అంతా చర్చిస్తున్నారు.
ఇవన్నీ ఇలా ఉంటే ఏపీ రాజకీయాల్లో పవన్ ప్లేస్ అత్యంత ప్రభావంతంగా ఉంది. ఆయన ఒక కీలకమైన పాత్రను కూటమిలో పోషిస్తున్నారు. ఇటు చంద్రబాబుకు అటు నరేంద్ర మోడీకి కూడా పవనే ముఖ్యంగా మారారు. మరి ఇంతకంటే ఆయనకు వేరే రాజయోగం ఉంటుందా అన్న చర్చ కూడా సాగుతోంది.
ఏపీలో వైసీపీని రాజకీయంగా ఇరకాట పరిస్థితి కల్పించి అధికారానికి దూరం పెట్టిన ఘనత కూడా పవన్ ఖాతాలోనే ఉంది. ఇంతలా రాజకీయ ప్రాముఖ్యత కలిగిన పవన్ కళ్యాణ్ ఈ ఉగాది తరువాత ఏపీ రాజకీయాలలో ఇంకా ఉన్నత స్థానానికి చేరుకుంటారు అని జోస్యాలు చెబుతున్నారు పండితులు. మరి ఆ వార్తలు అయితే ఆయన అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాయి. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ జాతకం మాత్రం అద్భుతం అనే అంతా అంటున్నారు
