Begin typing your search above and press return to search.

వీడియో.. ఉగ్ర శిబిరాలను భారత్ ఆర్మీ ఎలా కొట్టిందో చూస్తారా?

అవును... గత రెండు రోజులుగా జమ్మూకశ్మీర్, రాజస్థాన్, పంజాబ్ ప్రాంతాల్లో పాకిస్థాన్ చేసిన డ్రోన్లు, క్షిపణులు, ఫైటర్ జట్లను భారత ఆర్మీ సమర్ధంగా ఎదుర్కొంది.

By:  Tupaki Desk   |   10 May 2025 3:43 PM IST
వీడియో.. ఉగ్ర శిబిరాలను భారత్  ఆర్మీ ఎలా కొట్టిందో చూస్తారా?
X

గత రెండు రోజులుగా భారత్ - పాక్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చుతున్న సంగతి తెలిసిందే. ఆపరేషన్ సిందూర్ కి ప్రతీకారంగా అంటూ భారత్ పై వందల సంఖ్యలో డ్రోన్లు, క్షిపణులు, యుద్ధ విమానలతో పాకిస్థాన్ సైన్యం విరుచుకుపడుతుంది. అయితే... ఆ ప్రయత్నాలు అన్నింటినీ భారత గగనతల రక్షణ వ్యవస్థ విజయవంతంగా నాశనం చేస్తోంది.

ఇలా పాక్ ప్రయత్నాలను తిప్పికొడుతూనే.. పాక్ కు చేయాల్సిన డ్యామేజ్ చేసుకుంటూ వస్తోంది. ఇందులో భాగంగా... తాజాగా పాక్ లోని మూడు ప్రధాన వైమానిక స్థావరాలపై భారత్ దాడులు చేసింది. పాక్ సైన్యం హెడ్ క్వార్టర్స్ ఉన్న రావల్పిండి చక్లాలలోని నూర్ ఖాన్.. చక్వాల్ లోని మురీద్, జాంగ్ జిల్లా షోర్కోట్ లో ఉన్న రఫీ వైమానిక స్థావరాల్లో పేలుళ్లు జరిగాయి!

ఇలా పాక్ దుస్సాహసాన్ని తిప్పికొడుతోంది. ఆ డ్రోన్ లను విజయవంతంగా నిర్వీరం చేసింది. మరోవైపు పఠాంకోట్, జైసల్మేర్, ఉధంపుర్, అఖ్నూర్, నగ్రోటా ప్రాంతాలపైకి వచ్చిన 50 పాక్ డ్రోన్లను నిర్వీర్యం చేసింది. ఈ సమయంలో ఇండియన్ ఆర్మీ ఓ ఆసక్తికర వీడియో పోస్ట్ చేసింది. పాక్ ఉగ్రవాద శిబిరాలను ఎలా ధ్వంసం చేసింది చూపించింది.

అవును... గత రెండు రోజులుగా జమ్మూకశ్మీర్, రాజస్థాన్, పంజాబ్ ప్రాంతాల్లో పాకిస్థాన్ చేసిన డ్రోన్లు, క్షిపణులు, ఫైటర్ జట్లను భారత ఆర్మీ సమర్ధంగా ఎదుర్కొంది. గురువారం అయితే సుమారు 400 డ్రోన్లను ఎదుర్కొన్నట్లు రక్షణ శాఖ తెలిపింది. ఆ దాడులకు ప్రతిస్పందనగా ఉగ్రవాద లాంచ్ ప్యాడ్ లపై ఎటాక్ చేసి ధ్వంసం చేసింది.

ఈ సందర్భంగా... భారత సరిహద్దుకు దగ్గరగా ఉన్న ఉగ్రవాద లాంచ్ ప్యాడ్ ల నుంచి గతంలో భారత పౌరులు, భద్రతా దళాలపై దాడులకు ప్రణాళికలు రూపొందించారు.. ఇక్కడ నుంచి దాడులు కూడా చేశారు.. ఇప్పుడు ఈ లాంచ్ ప్యాడ్ ను ధ్వసం చేయడంతో పాటు వారి మౌలిక సదుపాయాలు, సామర్థాలకు భారీ దెబ్బ తగిలింది అని ఆర్మీ వీడియో షేర్ చేస్తూ పొస్టులో తెలిపింది.