అమ్మాయితో అసభ్య వీడియోలు.. అందుకే పాకిస్తాన్ దౌత్యవేత్త ఎస్కేప్
బంగ్లాదేశ్‌లోని పాకిస్థాన్ హైకమిషనర్ సయ్యద్ అహ్మద్ మరూఫ్ తీవ్రమైన హనీట్రాప్ వివాదంలో చిక్కుకున్నారు. ఓ బంగ్లాదేశీ యువతితో ఆయనకు సంబంధించిన అశ్లీల వీడియోలు, ఫొటోలు ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమవడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
By: Tupaki Desk | 14 May 2025 1:04 PM ISTబంగ్లాదేశ్‌లోని పాకిస్థాన్ హైకమిషనర్ సయ్యద్ అహ్మద్ మరూఫ్ తీవ్రమైన హనీట్రాప్ వివాదంలో చిక్కుకున్నారు. ఓ బంగ్లాదేశీ యువతితో ఆయనకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమవడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో అప్రమత్తమైన పాక్ విదేశాంగ శాఖ ఆయన్ను సెలవుపై వెనక్కి పిలిపించినట్లు స్థానిక మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.
వివాదంలో చిక్కుకున్న అహ్మద్ మరూఫ్ మే 11వ తేదీనే ఢాకా నుంచి దుబాయ్ మీదుగా ఇస్లామాబాద్ వెళ్లినట్లు సమాచారం. ఆయన సెలవుపై వెళ్లినట్లు పాకిస్థాన్ హైకమిషన్ బంగ్లాదేశ్ విదేశాంగ శాఖకు అధికారికంగా సమాచారం ఇచ్చినా, ఎందుకు వెళ్లారు, ఎంతకాలం సెలవులో ఉంటారనే వివరాలను మాత్రం వెల్లడించలేదు. మరోవైపు, పాక్ విదేశాంగ శాఖ సైతం దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయకపోవడం గమనార్హం. మరూఫ్ స్థానంలో పాక్ డిప్యూటీ హైకమిషనర్ ఆసిఫ్ తాత్కాలికంగా హైకమిషనర్ బాధ్యతలు చేపట్టారు.
-అసలేం జరిగింది?
ఇటీవల కాలంలో సయ్యద్ అహ్మద్ మరూఫ్‌కు సంబంధించిన కొన్ని సన్నిహిత వీడియోలు, ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఓ బంగ్లాదేశీ యువతితో ఆయన అసభ్యకరంగా ఉన్న దృశ్యాలు అందులో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం బయటకు రావడంతో ఆయన హనీట్రాప్‌లో చిక్కుకున్నారనే ప్రచారం బలంగా జరుగుతోంది. పాక్ దౌత్యవేత్తగా ఉన్న మరూఫ్ ఏదైనా సున్నితమైన నిఘా సమాచారాన్ని ఆ యువతితో పంచుకుని ఉంటారనే తీవ్ర అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
-పాకిస్థాన్‌కు కొత్త తలనొప్పి
భారత్‌తో ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో, ఇతర దేశాల సాయం కోసం పాకిస్థాన్ ప్రయత్నిస్తున్న కీలక సమయంలో ఇలాంటి ఘటనలు ఆ దేశ ప్రతిష్టను మరింత దెబ్బతీస్తున్నాయి. ఇప్పటికే, గూఢచర్య ఆరోపణలపై దిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్ అధికారి ఒకరిని భారత్ బహిష్కరించి, అవాంఛిత వ్యక్తి (పర్సనా నాన్‌గ్రేటా)గా ప్రకటించి దేశం విడిచి వెళ్లాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌లో తమ హైకమిషనర్ హనీట్రాప్ వివాదంలో చిక్కుకోవడం పాకిస్థాన్‌కు కొత్త తలనొప్పిగా మారింది. ఈ మొత్తం వ్యవహారంపై పాకిస్థాన్ అంతర్గతంగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
