పాక్ మీద భారత్ యుద్ధం ఎలా ఉండబోతోంది ?
భారత్ కసితో రగులుతోంది. పైగా అక్కడ ఉన్నది మోడీ ప్రభుత్వం. ఇక అంతర్జాతీయ సమాజం మద్దతు కూడా భారత్ కి దండీగానే ఉంది.
By: Tupaki Desk | 27 April 2025 7:00 AM ISTభారత్ కసితో రగులుతోంది. పైగా అక్కడ ఉన్నది మోడీ ప్రభుత్వం. ఇక అంతర్జాతీయ సమాజం మద్దతు కూడా భారత్ కి దండీగానే ఉంది. ఒక విధంగా పాక్ మీద తిరుగులేని ప్రతీకారం తీర్చుకోవడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం.
పాక్ నడ్డి విరిచి మూలన కూర్చోబెట్టేందుకు తగిన సందర్భం. పాక్ కి తన దేశంలో ఏమీ పరిస్థితులు బాగులేవు. ఆకలి. అవినీతితో సతమతమవుతోంది. పౌర సమాజం అక్కడ పాలకులపైన సైనికులపైనా కూడా వ్యతిరేకత వ్యక్తం చేస్తోంది.
ముందు తమ సంగతి చూడాలని భారత్ మీద ఈ ఎగోదోసే ఉగ్రవాదం చర్యలు ఏమిటి జనాలు మండిపడుతున్నారు. పాక్ ప్రజలకు పేదరికాన్ని బహుమతిగా అందించి అక్కడ పాలకులు ఎంతసేపూ మతం మత్తులో వారిని ఉంచుతున్నారని ఒక ఆరోపణ బలంగా ఉంది.
మన దేశం మీద భారత్ దండెత్తుతోంది, భారత్ మనకు శతృవు అని ఉగ్గుపాలతో నూరిపోతూ భారత్ మీద కావాల్సినత వ్యతిరేకతను పోగు చేస్తూ వస్తోంది. దాంతో భారత్ మీద గతంలో పాక్ ప్రజానీకం అత్యధిక శాతం వ్యతిరేకంగా ఉండేవారు. అక్కసు వెదజల్లేవారు.
అయితే రాను రానూ భారత్ పట్ల పాక్ ప్రజలలో వ్యతిరేకత మెల్లగా తగ్గుతోంది. పైగా తమ సొంత పాలకుల మీద ఆగ్రహం వస్తోంది. భారత్ మీద తమ దృష్టిని మరల్చి వారు పబ్బం గడుపుకుంటున్నారు అన్న ఆలోచనలు ఏర్పడుతున్నాయి. ఈ నేపధ్యంలో పాక్ ఇపుడు ఇబ్బందులో ఉంది.
అయినా వర్క బుద్ధి పోనీయదు కాబట్టే తాజగా కాశ్మీర్ లో ఉగ్ర దాడి. ఇక ఈ నేపధ్యంలో భారత్ కి పాక్ లో అంతర్గత పరిస్థితులు కూడా సహకరిస్తున్నాయని చెప్పాల్సి ఉంది. అయితే పాక్ మీద భారత్ దండెత్తి ఏమి చేయాలనుకుంటోంది అన్నది ఒక ప్రశ్న. పాక్ తానుగా ఇప్పటికే చేయాల్సింది అంతా చేసుకుంది. పాక్ తన వినాశనాన్ని తానే చేసుకుంది.
ఇపుడు కొత్తగా యుద్ధం చేయడం వల్ల భారత్ విజయం సాధించినా దాని వల్ల దేశానికి ఒరిగేది ఏముంది అన్నది ఉంది. పాక్ దుష్ట బుద్ధి అయితే మారదు. పైగా పాక్ మారినా దానిని పావుగా మార్చుకుని ఆటలాడుకునే కీలక దేశాలు మళ్ళీ దాని తోక వంకర చేయడానికే చూస్తాయి.
అందువల్ల పాక్ మీద యుద్ధం అంటే దాని నడ్డి విరిగేలా ఉండాలి. ఆ దేశం వల్ల ఏ ఇతర దేశానికీ ఉపయోగం లేకుండా ఉండాలి. ఇవన్నీ భారత్ దౌత్య వేత్తలకు యుద్ధ నిపుణులకూ తెలియనివి కావు. అందువల్ల భారత్ మిలటరీ వ్యూహాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అన్నది ఒక పెద్ద చర్చగా ఉంది.
నేల మీద నీటి మీద గాలిలో ఎక్కడ నుంచి యుద్ధం చేసినా ఇపుడు భారత్ దే విజయం అన్నది ప్రపంచానికి తెలుసు. ఇక దాయాదికి గుణపాఠం చెప్పేందుకు భారత్ కి కూడా ఇదే తగిన సమయం అని కూడా తెలుసు. అయితే ఇపుడు అన్ని చోట్ల నుంచి వినిపిస్తున్న ప్రశ్న పాక్ ఆక్రమిత కాశ్మీర్ ని స్వాధీనం చేసుకోమని.
ఆ విధంగా చేసుకుని అక్కడ ఉన్న ఉగ్ర మూకలను తన్ని తరిమితే పాక్ బలం తగ్గిపోతుంది. రేపటి రోజున ఏ ఇతర దేశాలకూ వక్ర మార్గంలో ఉపయోగపడేలా పాక్ చేసే చిల్లర చేష్టలకూ వీలు ఉండదు. ప్రత్యేకించి కాశ్మీర్ లో తోవ చూసుకుని ఉగ్ర మూకలు తిష్ట వేయడానికీ వీలు ఉండదని అంటున్నారు. అందువల్ల భారత్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ ని జయించడం భారత్ లో విలీనం చేసుకోవడమే ముఖ్యమని అంటున్నారు.
దీని వల్ల భారత్ కి కాశ్మీర్ సమస్యకు ఒక శాశ్వత పరిష్కారం దొరకడమే కాకుండా మధ్య ఆసియాతో నేరుగా కనెక్టివిటీ ఉంటుంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ రక్షణ భద్రతా పరంగా వ్యూహాత్మక ప్రాంతంలో ఉండడం వల్ల భారత్ కి ఎంతో ప్రయోజనం చేకూరుతుందని అంటున్నారు. మరి భారత్ ఈ విషయంలో ఏమి ఆలోచిస్తుందో చూడాల్సి ఉంది.
