నక్క జిత్తుల పాక్ కాళ్ళ బేరం...ప్రపంచాన్ని మభ్యపెట్టేలా !
భారత్ దాడులు ఆపేస్తే తామూ ఆపేస్తామన్నది ఆ ప్రతిపాదన. భారత్ పాక్ ల మధ్య ఉద్రిక్తల తగ్గింపునకు తాము సిద్ధమని కూడా ప్రకటించింది.
By: Tupaki Desk | 10 May 2025 3:22 PM ISTనక్క జిత్తుల పాక్ కి శతకోటి భయంకర ముఖాలు. ఒక్కో ముఖంలో ఎన్నో వికృత వేషాలు. ఒక వైపు మానవత్వం మరచి భారత్ లోని జనవాసాలు ఆసుపత్రులు, విద్యా సంస్థల మీద విచ్చల విడిగా విచక్షణా రహితంగా దాడులు చేస్తున్న పాక్ భారత్ ముందు ఒక కొత్త ప్రతిపాదన పెట్టింది. ఇది భారత్ కోసం కాదు ప్రపంచ దేశాల మెప్పు కోసం.
భారత్ దాడులు ఆపేస్తే తామూ ఆపేస్తామన్నది ఆ ప్రతిపాదన. భారత్ పాక్ ల మధ్య ఉద్రిక్తల తగ్గింపునకు తాము సిద్ధమని కూడా ప్రకటించింది. ఈ ప్రకటనను పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ చేశారు. అయితే ఒక వైపు ఈ రోజుకీ ఈ ఘడియకూ సరిహద్దుల వద్ద కవ్వితూ రెచ్చిపోతున్న ఉన్మాది పాక్ నోటితో మాత్రం ఉద్రిక్తలు తగ్గిస్తామని నీతులు చెబుతోంది. ఇది అమెరికా సహా ప్రపంచ దేశాల వద్ద మెప్పు కోసమే అని అంటున్నారు. భారత్ తో రెండు రోజుల యుద్ధమే సరిగ్గా చేయలేక చేతులెత్తేసిన పాక్ ఇపుడు మళ్ళీ బలం సమకూర్చుకోవడానికే ఈ విరామం కోరుతున్నట్లుగా ఉంది అని అంటున్నారు.
అమెరికా విదేశాంగ మంత్రి రుబియా ఈ రోజు పాక్ ఆర్మీ చీఫ్ కి ఫోన్ చేసి మాట్లాడిన తరువాతనే పాక్ విదేశాంగ మంత్రి నోట ఈ ప్రతిపాదన వచ్చింది అని అంటున్నారు. సరే ఇంత మంచిగా ప్రతిపాదించిన పాక్ సరిహద్దులలో ఏమి చేస్తుందో అందరికీ తెలిసిందే. అన్ని నియమాలను ఉల్లంఘించి భారత్ వైపుగా చొచ్చుకుని వస్తున్న పాక్ మూకలను మొదట కట్టడి చేసి ఆ మీదట పాక్ ఈ ప్రకటన చేసి ఉంటే ఎంతో కొంత అర్ధం ఉండేది. కానీ అమెరికా చెప్పిందని తాము శాంతి కాముకులమని లోకానికి చాటడానికి అన్నట్లుగా ఈ ప్రకటన చేసిందని అంటున్నారు.
భారత్ లోని సరిహద్దు ప్రాంతాలను టార్గెట్ చేస్తూ భద్రతా బలగాలను రెచ్చగొడుతున్న పాక్ కి ఇపుడు ఉద్రిక్తతలు తగ్గించుకోవాలి అనిపించడం అంటే పక్కాగా నక్క జిత్తులే అని అంటున్నారు పాక్ నోటితో మాట్లాడి నొసటితో వెక్కిరించే ఈ ధోరణిని భారత్ అసలు నమ్మకూడదని అంటున్నారు.
అయిందేదో అయింది. ఇక ముందుకు వెళ్ళి మరీ పాక్ అన్న పీడను శాశ్వతంగా వదిలించుకోవడానికి ఎంత చేయాలో అంతా చేయాలని దేశ ప్రజలు అయితే కోరుతున్నారు. ఇక భారత్ ఆర్మీ కూడా అసలు తగ్గేది లేదని అంటోంది. ఇక భారత రాజకీయ నాయకత్వం కూడా పాక్ పని పట్టాలనే పట్టుదలతో ఉంది.
ఉగ్ర క్యాంపుల మీద భారత్ దాడులు చేస్తే పాక్ రెచ్చిపోవడాన్ని సుద్దులు చెప్పే పెద్ద దేశాలు ఎలా చూస్తాయన్న ప్రశ్న కూడా నెటిజన్ల నుంచి వస్తోంది. తాము మాత్రమే యుద్ధం చేయాలి తమవి మాత్రమే దేశాలు తమ ప్రజలవే ప్రాణాలు అన్నట్లుగా కొన్ని అగ్ర దేశాలు వ్యవహరిస్తూ ప్రపంచానికి పెద్దన్నగా ఫోజులు కొడుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
అమాయక పర్యాటకులను మీ మతమేంటి అని అడిగి అత్యంత దారుణంగా పహిల్గాం లో ఉగ్ర మూకలు చంపేసిన తరువాత కూడా భారత్ పాక్ తో చర్చలు జరపాలా అని అంటున్నారు. భారత్ ధాటి ముందు తట్టుకోలేక అసలుకే ఎసరు వస్తుందని బెదిరి బెంబేలెత్తిపోతున్న పాక్ ఇపుడు ప్రపంచ దేశాలను ఆశ్రయించి భారత్ ని చర్చలకు ఒప్పించాలని చూస్తోంది.
అంటే దెబ్బ కొట్టిందీ పాకే ఇపుడు అదేం లేదని అంతా మరచిపోవాలని మొక్కుబడి చర్చలకు రెడీ అంటోంది పాకే. మరి మండిపోతోంది ఎవరికి అన్నదే ప్రశ్న. భారత్ తనకు గిల్లి గిచ్చిన తరువాత కూడా తగ్గుతూ పోతే మరిన్ని దశాబ్దాల పాటు పాక్ పీడ చీడ ఇలా భావి తరాల వారిని వెంటాడుతూనే ఉంటుంది.
అందువల చర్చలు లేవు ఏమీ లేవు పాక్ భరతం పట్టడమే భారత్ లక్ష్యం కావాలని అంతా కోరుతున్నారు. అసలు పాక్ ని ఈ ప్రపంచ పటం మీద లేకుండా చేయాలని కూడా భారత్ జనాలు కోరుతున్నారు. అతి చిన్న దేశంగా ఉంటూ భారత్ వంటి పెద్ద దేశాన్ని నరకం చూపించాలని చూస్తే ఎదురయ్యే పర్యవశానాలు ఏమిటో ఇప్పటికైనా పాక్ చవి చూడాలని అంటున్నారు. పాక్ జిత్తుల మారి ఎత్తులకు చిత్తు అయ్యే వారు భారత్ లో ఎవరూ లేరని చాటి చెప్పాలని కోరుతున్నారు.
