Begin typing your search above and press return to search.

తెంచుకునే సమయం.... భారత్ లో పాక్ 'ఎక్స్' సస్పెండ్!

ఇదే సమయంలో తాజాగా మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా పాక్ అధికారిక ఎక్స్ ఖాతాను భారత్ నిలిపేసింది!

By:  Tupaki Desk   |   24 April 2025 12:06 PM IST
తెంచుకునే సమయం.... భారత్  లో పాక్  ఎక్స్ సస్పెండ్!
X

జమ్ముకశ్మీర్ లోని పహల్గాంలో పర్యాటకులపై భీకర ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడి వెనుక పాక్ ప్రేరేపిత, ప్రోత్సాహిత ఉగ్రవాదుల పనే అని భారత్ నమ్ముతోంది! ఈ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ – పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే భారత్.. పాక్ తో దౌత్య సంబంధాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంది.

ఇందులో భాగంగా... పాకిస్థాన్ ఏమాత్రం ఊహించని విధంగా, గతంలో ఎన్ని దాడులు జరిగినా భారత్ ఆ దిశగా అడుగులు వేయని విధంగా తాజాగా సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపేయాలని ఢిల్లీ నిర్ణయించింది! ఇదే సమయంలో తాజాగా మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా పాక్ అధికారిక ఎక్స్ ఖాతాను భారత్ నిలిపేసింది!

అవును... పాకిస్థాన్ ప్రభుత్వానికి చెందిన అధికారిక ఎక్స్ ఖాతాను భారత్ లో నిలిపేశారు. ఈ మేరకు భారత్ లో ఆ అకౌంట్ ను నిలిపేయాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ.. సోషల్ మీడియా సంస్థ ఎక్స్ ను కోరింది. ఈ అభ్యర్థనను పరిగణలోని తీసుకున్న ‘ఎక్స్’.. పాకిస్థాన్ ప్రభుత్వ అకౌంట్ ను భారత్ లో సస్పెండ్ చేసింది.

కాగా... పెహల్గాం ఉగ్రదాడి వెనుక పాక్ హస్తం ఉందని కేంద్రం బుధవారం పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాక్ పౌరులు తక్షణం భారత్ ను వీడాలను తేల్చి చెప్పింది. ఇదే సమయంలో.. ప్రత్యేక వీసాదారులు 48 గంటల్లో భారత్ ను వీడాలని ఆదేశించింది. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ కార్యదర్శి మిక్రమ్ మిస్త్రీ వెల్లడించారు.

ఇదే సమయంలో.. అట్టారీ - వాఘా ల్యాండ్ క్రాసింగ్ ను తక్షణమే మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్ సిబ్బంది సంఖ్య 55 నుంచి 30కి తగ్గించింది! భారత్ లో పర్యటిస్తున్న పాకిస్థాన్ జాతీయులకు అనుమతులు రద్దు చేసింది. ఈ నేపథ్యంలోనే పాక్ అధికారిక ‘ఎక్స్’ అకౌంట్ ను ఇక్కడ సస్పెండ్ చేసేలా చర్యలు తీసుకుంది.