Begin typing your search above and press return to search.

ఆపరేషన్ సిందూర్ పై లేటెస్ట్ బ్రీఫింగ్... వీడియో వేరే లెవెల్!

ఈ నేపథ్యంలో సోమవారం మరోసారి ఆర్మీ అధికారులు మీడియా ముందుకు వచ్చారు. ఉగ్రవాదం, ఉగ్రవాదులపైనే తమ పోరు అని అపరేషన్ సిందూర్ పై బ్రీఫింగ్ ఇచ్చారు.

By:  Tupaki Desk   |   12 May 2025 4:11 PM IST
ఆపరేషన్ సిందూర్ పై లేటెస్ట్ బ్రీఫింగ్... వీడియో వేరే లెవెల్!
X

ఆపరేషన్ సిందూర్ పై రక్షణశాఖ అధికారులు వరుసగా బ్రీఫింగ్ ఇస్తున్న సంగతి తెలిసిందే! కారణం ఏదైనప్పటికీ ఆపరేషన్ సిందూర్ కు సంబందించిన ప్రతీ విషయాన్ని వీలైనంత క్షుణ్ణంగా మీడియాకు వివరిస్తున్నారు! ఈ నేపథ్యంలో సోమవారం మరోసారి ఆర్మీ అధికారులు మీడియా ముందుకు వచ్చారు. ఉగ్రవాదం, ఉగ్రవాదులపైనే తమ పోరు అని అపరేషన్ సిందూర్ పై బ్రీఫింగ్ ఇచ్చారు.

అవును... మే7న ఆపరేషన్ సిందూర్ లో భాగంగా జరిపిన దాడుల్లో ఉగ్రస్థావరాలనే లక్ష్యంగా చేసుకున్నట్లు రక్షణశాఖ అధికారులు పునరుధ్గాటించారు. ఈ సందర్భంగా... పాకిస్థాన్ పై దాడుల వీడియోలను రక్షణ శాఖ అధికారులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా... పాక్ సేనలు ఉగ్రవాదులకు అండగా నిలిచాయని.. ఈ పోరాటాన్ని తమ పోరాటంగా మలుచుకున్నాయని పేర్కొన్నారు.

దీంతో.. భారత సైన్యం దీటుగా సమధానం ఇచ్చిందని చెప్పారు. ఇక పాక్ దాడుల సమయంలో ప్రధానంగా భారత గగనతల రక్షణ వ్యవస్థలు శత్రుదుర్భేద్యంగా నిలిచాయని.. వారి ఆటలు సాగనివ్వలేదని అన్నారు. ఈ క్రమంలోనే.. రహీమ్ యూర్ ఖాన్, నూర్ ఖాన్ ఎయిర్ బేస్ లపై ఆర్మీ చేసిన దాడి దృశ్యాలు, అనంతరం ఆ ప్రాంత పరిస్థితులకు సంబంధించిన వీడియోలు చూపించారు.

ఈ సందర్భంగా స్పందించిన ఆర్మీ ఉన్నతాధికారులు.. పాకిస్థాన్, పీవోకే ఉగ్రవాదుల స్థావరాలు ధ్వంసం చేశామని.. ఉగ్రవాదులు, వారి శిబిరాలే లక్ష్యంగా దాడులు చేశామని తెలిపారు. ఇక పాక్ దాడుల విషయంలో... అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థతో పాక్ డ్రోన్లు, క్షిపణులు, యుద్ధ విమానాలను తిప్పికొట్టామని అన్నారు. ఈ క్రమంలో సైన్యానికి, ప్రజలకు పెద్దగా నష్టం రాకుండా చూశామని తెలిపారు.

ఇదే సమయంలో.. పాక్ వినియోగించిన చైనా తయారు చేసిన పీఎల్-15 క్షిపణిని నేలకూల్చామని.. పాకిస్థాన్ చెందిన డ్రోన్లు, మిస్సైళ్లను కూల్చివేశామని భారత ఆర్మీ ఉన్నతాధికారులు తెలిపారు. ఈ క్రమంలో నౌకాదళ అడ్వాన్స్ రాడార్ల ద్వారా పాకిస్థాన్ డ్రోన్లను గుర్తించగలిగామని వెల్లడించారు.