Begin typing your search above and press return to search.

మోదీ/రాహుల్, జగన్/బాబు.. అందరి ప్రమాణానికి ఆ రోజే ముహూర్తం

దేశంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఐదో దశకు అంతా సిద్ధం అవుతోంది. సోమవారం 49 లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది

By:  Tupaki Desk   |   19 May 2024 10:30 AM GMT
మోదీ/రాహుల్, జగన్/బాబు.. అందరి ప్రమాణానికి ఆ రోజే ముహూర్తం
X

దేశంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఐదో దశకు అంతా సిద్ధం అవుతోంది. సోమవారం 49 లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఏడు దశల ఎన్నికలకు గాను ఈ విడతలోనే అతి తక్కువ సీట్లున్నాయి. సోమవారం పోలింగ్ నేపథ్యంలో శనివారం సాయంత్రంతోనే ప్రచారం గడువు ముగిసింది. ఇక ఓటర్లు తమ హక్కు వినియోగించుకోవడమే తరువాయి. ఈ నెల 26న ఆరో, జూన్ 1న ఏడో దశ ముగిస్తే సార్వత్రిక ఎన్నికల పోలింగ్ పూర్తయినట్లే.

అందరి చూపు ఆ తేదీపై

జూన్ 4న ఉదయం 12 గంటల కల్లా దేశవ్యాప్తంగా ఎన్నికల ట్రెండ్ తెలిసిపోతుంది. అత్యంత హోరాహోరీగా జరిగిన ఏపీలో అధికారం ఎవరిదో కూడా..? వాస్తవానికి దేశంలో ఏపీతో పాటు అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిశా అసెంబ్లీలకూ ఎన్నికలు జరిగాయి. కానీ, వాటిని ఎవరూ పట్టించుకోలేదు. ఏపీ మాత్రమే హాట్ టాపిక్ అయింది. మరి ఇక్కడ అధికారం వైసీపీదా? లేక టీడీపీ కూటమిదా? అనేది 4న తేలనుంది.

ప్రమాణం ఆ రోజేనా?

కేంద్రంలో మోదీ లేదా రాహుల్ గాంధీ ఎవరు ప్రధాని అయినా, ఏపీలో జగన్ లేదా చంద్రబాబు ఎవరు గెలిచినా సీఎంగా ప్రమాణం చేసేది ఏ రోజు అనేదానిపై ఉత్కంఠ నెలకొంది. అయితే, వీరంతా తమ ప్రమాణ స్వీకారానికి జూన్ 9వ తేదీని ఎంచుకున్నట్లు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా జగన్ అయితే జూన్ 9న విశాఖపట్నంలో రెండోసారి సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తారని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. కేంద్రంలో ఇండియా కూటమి మెజారిటీ సాధిస్తే రాహుల్ ప్రమాణం కూడా జూన్ 9నే అని అంటున్నారు. ఇక చంద్రబాబు 2014లో జూన్ 8వ తేదీన ప్రమాణం చేశారు. అయితే, నాడు చంద్రబాబు పాలన తీవ్ర విమర్శలపాలైంది. ఈసారి 9వ తేదీని ఎంచుకుంటారేమో?

లక్కీ నంబరు కావడంతో..

అంకెల్లో అందరూ 9ని లక్కీ నంబరుగా భావిస్తారు. చాలామంది తమ వాహన నంబర్లు 9 వచ్చేలా చూసుకుంటారు. ఏ పనులైనా 9వ తేదీన ప్రారంభిస్తారు. ఇక నాయకులకూ ఈ సెంటిమెంట్లు ఎక్కువే. అందుకనే జూన్ 9ని ప్రమాణ స్వీకార తేదీగా ఎంచుకుంటారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి వీటిలో నిజమయ్యేదెంతో?