Begin typing your search above and press return to search.

బిలియనీర్ల డిన్నర్.. కస్టమర్ల బిల్ మాఫీ..

ఆ రోజు సాయంత్రం హోటల్ కు వచ్చిన వారందరి బిల్లు ముగ్గురు పే చేశారు. వారు ఎవరో కాదు.. ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీల సీఈవోలు.

By:  Tupaki Desk   |   2 Nov 2025 12:00 AM IST
బిలియనీర్ల డిన్నర్.. కస్టమర్ల బిల్ మాఫీ..
X

ఒక సాయంత్రం వేళ ఒక కాస్ట్లీ రెస్టారెంట్ కు ఫ్యామిలీతో వెళ్లి డిన్నర్ చేస్తే ఎలా ఉంటుంది..? ఊహే బాగుంటుంది కదా.. సరే.. కాస్ట్లీ రెస్టారెంట్ కాబట్టి ఫుడ్ కూడా అదే విధంగా ఉంటుంది కదా.. వేలల్లో కాదంటే లక్షల్లో బిల్లు అయ్యిందంటే ఎలా కట్టాలని గుండె పట్టుకుంటాం కదా.. కట్టనవసరం లేదంటే..? ఆ.. అదేదో హోటల్ ఓపినింగ్ కాదు.. ఎవరూ దాతలుగా లేరు.. ఇక్కడో విచిత్రం జరిగింది. ఆ రోజు సాయంత్రం హోటల్ కు వచ్చిన వారందరి బిల్లు ముగ్గురు పే చేశారు. వారు ఎవరో కాదు.. ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీల సీఈవోలు.

ఏసీఈసీ సమ్మిట్ కు ముగ్గురు సీఈవోలు..

ప్రపంచ టెక్ రంగంలో అత్యంత ప్రభావవంతమైన ముగ్గురు బిలియనీర్లు ఎన్విడియా సీఈవో జెన్సన్ హువాంగ్, శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ చైర్మన్ లీ జే-యాంగ్, హ్యుందాయ్ మోటార్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్ చుంగ్ యుయి-సన్ – ఒక సాధారణ చికెన్ రెస్టరెంట్‌లో డిన్నర్ చేసి, అందరి బిల్ పే చేసి ఆశ్చర్యాన్ని మాత్రమే కాకుండా, టెక్ డిప్లొమసీకి కొత్త డైమెన్షన్ తీసుకెళ్లారు.

అక్టోబర్ 30, 2025న సియోల్‌లోని గ్యాంగ్నామ్ జిల్లాలోని కాన్బు చికెన్ (Kkanbu Chicken) రెస్టారెంట్ లో జరిగిన ఈ ‘చిమెక్’ (చికెన్+ బీర్)లో ఏపీఈసీ (Asia-Pacific Economic Cooperation (ఆసియా-పసిఫిక్ ఆర్థిక సహకారం) CEO సమ్మిట్ జరిగింది. ఈ సమ్మిట్ లో కలిసిన ముగ్గురి నెట్ వర్త్ $195 బిలియన్. మీట్ తర్వాత వారు అక్కడి కస్టమర్లందరి బిల్ (సుమారు $1,800 (రూ. లక్షా 60వేలు) చెల్లించి వైరల్ స్టార్స్ అయ్యారు. ఈ ఘటన కేవలం ఫన్ మూమెంట్ కాదు. AI, సెమీకండక్టర్, ఆటోమోటివ్ ఇండస్ట్రీల మధ్య భవిష్యత్ భాగస్వామ్యాలకు సూచిక.

15 ఏళ్ల తర్వాత కొరియాకు హువాంగ్..

ఏపీఈసీ సమ్మిట్‌కు (అక్టోబర్ 31-నవంబర్ 2, గ్యాంగ్జు) సియోల్ చేరుకున్న హువాంగ్ 15 సంవత్సరాల తర్వాత కొరియాకు వచ్చాడు. సమ్మిట్ ముందు, లీ, చుంగ్‌తో కలిసి సాధారణ చికెన్ షాప్‌లోకి వెళ్లారు. చీజ్ బాల్స్, స్టిక్స్, బోన్‌లెస్ చికెన్, ఫ్రైడ్ చికెన్, సోమెక్ (సోజు-బీర్ మిక్స్) ఆర్డర్ చేశారు. రెస్టారెంట్ అంతా కస్టమర్లతో కలకలలాడింది. ప్రపంచ బిగ్ కంపెనీల సీఈఓలు రావడంతో ఫోటోగ్రాఫర్లు, ఫ్యాన్స్ పోటీ పడి మరీ కెమెరాలు, సెల్ ఫోన్లకు పని చెప్పారు. హువాంగ్ బయటకు వచ్చి చికెన్, బనానా మిల్క్ పంచారు, ఆటోగ్రాఫ్‌లు, సెల్ఫీలు ఇచ్చారు. బిల్ చెల్లించే సమయంలో, హువాంగ్ ‘గోల్డెన్ బెల్’ రింగ్ చేసి (రెస్టరెంట్ ట్రెడిషన్ – రింగ్ చేస్తే అందరి బిల్ పెయ్) సర్ప్రైజ్ ఇచ్చాడు. కానీ, లీ మెయిన్ బిల్ చెల్లించాడు. చుంగ్ సెకండ్ రౌండ్. హువాంగ్ బహుమతులుగా హకుషు విస్కీ (25 ఇయర్స్, వేలల డాలర్లు), Nvidia DGX స్పార్క్ మినీ కంప్యూటర్ ($4,000 రూ. 355141.40)) ఇచ్చాడు. ఈ మూమెంట్ వీడియోలు X, ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అయ్యాయి.

ఆయా కంపెనీల మధ్య కుదిరిన భారీ డీల్స్..

ఈ డిన్నర్ టెక్ డిప్లొమసీకి ఒక మైలురాయి. ఏపీఈసీ సమ్మిట్‌లో హువాంగ్ సౌత్ కొరియా ప్రెసిడెంట్ లీ జే-మ్యుంగ్‌తో మీట్ అయి, ఎన్ వీడియా 260,000+ GPUs సౌత్ కొరియా కంపెనీలకు (శాంసంగ్, హ్యుందాయ్) సప్లయ్ చేస్తామని ప్రకటించాడు. ఇది ఏఐ చిప్స్, సెమీకండక్టర్, ఆటోమేషన్‌లో కొరియా-అమెరికా పార్ట్‌నర్‌షిప్‌ను బలోపేతం చేస్తుంది. హువాంగ్ ఎన్ వీడియా జీడీఎక్స్ గిఫ్ట్ ఇవ్వడం, టెక్ ఇంటిగ్రేషన్‌కు సంకేతం. ఈ మూగ్గురు ఎన్ వీడియా (AI చిప్స్), శామ్‌సంగ్ (సెమీస్), హ్యుందాయ్ (ఎలక్ట్రిక్ వెహికల్స్) – భవిష్యత్ టెక్ ఎకోసిస్టమ్‌లో కీలకం.

బిలియనీర్ల చికెన్ డిన్నర్ సర్ ప్రైజ్ బిల్, టెక్ పవర్ మానవత్వంతో మిక్స్ అవుతుందని చూపిస్తుంది. ఏపీఈసీ ముందు ఈ ఫ్రెండ్‌షిప్, గ్లోబల్ టెక్ ఫ్యూచర్‌కు ఆశాకిరణం. కానీ, సాధారణ ప్రజలకు ఇది మాత్రమే కాకుండా, వారి జీవితాల్లోనూ ‘హ్యాపీ’ మూమెంట్స్ రావాలి.