Begin typing your search above and press return to search.

కొత్త చర్చ... జూ. ఎన్టీఆర్ తో ఎవరు సన్నిహిత్యంగా ఉంటారు?

ఈ సమయంలో ఎన్టీఆర్ తో ఎవరికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే చర్చ మొదలైంది.

By:  Tupaki Desk   |   20 Jan 2024 12:12 PM GMT
కొత్త చర్చ... జూ. ఎన్టీఆర్  తో ఎవరు సన్నిహిత్యంగా ఉంటారు?
X

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా "ఎన్టీఆర్ ఘాట్" వద్ద జరిగిన సంఘటన సోషల్ మీడియాలో లైవ్ లోనే ఉంది. ఘాట్ వద్ద అభిమానులు ఏర్పాటు చేసిన తారక్ ఫ్లెక్సీలను తొలగించమంటూ బాలయ్య జారీ చేసిన హుకుంకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ సమయంలో ఎన్టీఆర్ తో ఎవరికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే చర్చ మొదలైంది.

అవును... జూనియర్ ఎన్టీఅర్ ఫ్లెక్సీల విషయంలో బాలకృష్ణ చేష్టలు, వైఖరి పట్ల చంద్రబాబు కూడా అసహనం వ్యక్తం చేశారని సోషల్ మీడియలో చర్చ నడుస్తుంది. ఇది ఎన్నికల సమయం అని నొక్కి వక్కానించినట్లు చెబుతున్నారు. ఈ సమయంలో ఒక టీవీ ఛానల్ లో జరిగిన డిబేట్ లో జూనియర్ ఎన్టీఆర్ తో ఎవరు సాన్నిహిత్యంగా ఉంటారు... కుటుంబ సభ్యులా, వైసీపీలో ఉన్న నేతలా అన్నట్లుగా చర్చ తెరపైకి వచ్చింది.

ఈ విషయాలపై స్పందించిన కొలికిపూడి శ్రీనివాస రావు... "మన ఇంట్లో మహిళల గురించి ఎవరో వాగితే... మౌనంగా ఉంటారా అని ప్రశ్నించిన కొలికపూడి... ముమ్మాటికీ నాడు జూనియర్ ఎన్టీఆర్ మౌనం తప్పు" అని నొక్కి చెప్పారు. ఇదే సమయంలో... "ఆ విమర్శలు చేసిన వారికి మద్దతిచ్చినట్లుగానే ఎన్టీఆర్ వైఖరి ఉంది" అని తనదైన విశ్లేషణ చేశారు!

ఇదే సమయంలో చంద్రబాబు టీం ఒకవైపు ఉందని.. కొడాలి నాని, వల్లభనేని వంశీ ఒకవైపు ఉన్నారని... వీరిలో ఎవరితో జూనియర్ ఎన్టీఆర్ టచ్ లో ఉన్నారనేది తెలిసిపోయిందని చెప్పుకొచ్చారు! ఇదే సమయంలో తన అక్క కూకట్ పల్లిలో పోటీచేసినప్పుడు తారక్ వచ్చి ప్రచారం చేసి ఉంటే తప్పకుండా గెలిచేవారని కొలికపూడి స్పష్టం చేశారు. కాగా... నాడు బాలకృష్ణతో సహా కీలక వ్యక్తులంతా కూకట్ పల్లిలో సుహాసిని తరుపున ప్రచారం చేసిన సంగతి తెలిసిందే!

ఆ సంగతి అలా ఉంటే... కొడాలి నాని & కో తో ఎన్టీఅర్ సాన్నిహిత్యంగా ఉంటారనే వ్యాఖ్యలను ఆయన అభిమానులు పూర్తిగా అంగీకరించడం లేదు. తారక్ ను చిన్నప్పుడు గార్డియన్ గా ఉంటూ కొడాలి ఒక పెద్దన్నగా తోడున్నారని.. వారిది అంత ఈజీగా విడిపోయే బంధం కాదని.. అయితే... రాజకీయాలు వేరు, వ్యక్తిగత సంబంధాలు వేరని అంటున్నారు. ఒకవేళ కలిసి ఉంటే మాత్రం తప్పేంటని నిలదీస్తున్నారు.. అమ్మ పెట్టా పెట్టదు, అడుక్కు తిన్నా తిన్నవద్దన్నట్లుగా ఉంది వ్యవహారం అని మండిపడుతున్నారు.

మరోపక్క... జూనియర్ ఎన్టీఆర్ విషయంలో టీడీపీ నేతలు, ఆ పార్టీ సానుభూతిపరులు ఎంత తక్కువ మాట్లాడితే.. ఎంతగా ఆ విషయం త్వరగా మరుగున పడిపోయేలా నడుచుకుంటే అంత మంచిదని.. అలా కాకుండా ఎన్టీఆర్ క్యారెక్టర్ ని అసాసినేషన్ చేయాలని ప్రయత్నిస్తే, ఈ విషయాన్ని తెగేదాకా లాగాలని ఆత్రపడితే జరిగే నష్టం అంచనాలకు అందకుండా ఉండే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెబుతున్నారు పరిశీలకులు.