Begin typing your search above and press return to search.

"మ‌రి ప‌దేళ్లు ఏం పీకావ్.. కేశ‌వ‌రావ్‌?"

84 ఏళ్ల కేకే.. (కేశ‌వ‌రావు) చేసిన వ్యాఖ్య‌ల‌పై నెటిజ‌న్లు దుమ్మెత్తి పోస్తున్నారు. ''మ‌రి ప‌దేళ్లు ఏం పీకావ్ కేశ‌వ‌రావ్‌?.. ఎప్పుడో 2014లో జ‌రిగిన ఘ‌ట‌న‌ను ఇప్పుడు గుర్తుచేస్తున్నావ్‌.

By:  Tupaki Desk   |   29 March 2024 5:30 PM GMT
మ‌రి ప‌దేళ్లు ఏం పీకావ్.. కేశ‌వ‌రావ్‌?
X

కేసీఆర్ మాట నిల‌బెట్టుకోలేదు. తెలంగాణ వ‌చ్చిన త‌ర్వాత‌.. ఇచ్చిన త‌ర్వాత‌.. అప్ప‌టి టీఆర్ ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తామ‌ని చెప్పిన కేసీఆర్‌.. ఆమాట‌కు క‌ట్టుబ‌డి ఉండ‌క‌పోవ‌డం వల్లే తాను.. బ‌య‌ట‌కు వ‌చ్చాన‌ని తాజాగా బీఆర్ ఎస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన కురువృద్ధ నాయ‌కుడు, 84 ఏళ్ల కేకే.. (కేశ‌వ‌రావు) చేసిన వ్యాఖ్య‌ల‌పై నెటిజ‌న్లు దుమ్మెత్తి పోస్తున్నారు. ''మ‌రి ప‌దేళ్లు ఏం పీకావ్ కేశ‌వ‌రావ్‌?.. ఎప్పుడో 2014లో జ‌రిగిన ఘ‌ట‌న‌ను ఇప్పుడు గుర్తుచేస్తున్నావ్‌. మ‌రి అప్పుడే బ‌య‌ట‌కు రాలేక పోయావా? ఇప్పుడు ప‌దేళ్లు సుభ్రంగా ప‌ద‌వులు అనుభ‌వించి.. ఇప్పుడు పాత సంగ‌తులు గుర్తు చేసుకుంటున్నావా? '' అని నిప్పులు చెరుగుతున్నారు.

ఏం జ‌రిగింది?

బీఆర్ ఎస్‌లో కీల‌క నేత‌గా.. మాజీ సీఎం ఆ పార్టీ హైక‌మాండ్ కేసీఆర్‌కు పెద్ద‌న్న‌గా ఓ వెలుగు వెలిగిన కే. కేశ‌వ‌రావు.. తాజాగా ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. అంతేకాదు.. త‌న‌కుమార్తె, హైద‌రాబాద్ మేయ‌ర్ గ‌ద్వాల్ విజ‌య‌ల‌క్ష్మితో క‌లిసి ఆయ‌న కాంగ్రెస్ గూటికి చేరుకుంటున్నారు. దీనికి సంబంధించి గ్రౌండ్ వ‌ర్క్ కూడా రెడీ చేసుకున్నారు. అయితే.. ఈ నేప‌థ్యంలో కేశ‌వ‌రావు ఎందుకు పార్టీ మారారంటూ పెద్ద ఎత్తున చ‌ర్చ సాగుతోంది. దీనిపై ఓ మీడియా సంస్థ‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో కేశ‌వ‌రావు.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

''బీఆర్ఎస్ పార్టీని ఒక కుటుంబం నడిపిస్తోందనే భావన ప్రజల్లో ఉంది. ఏ పార్టీ అయినా క్యాడర్ ను దూరం చేసుకోకూడదు. ఇదే విష‌యం నేను ప‌దే ప‌దే చెప్పా. సరిచేసుకోవాల్సిన తప్పులను బీఆర్ఎస్ సరిచేసుకోలేదు. కొన్ని పొరపాట్ల వల్ల బీఆర్ఎస్ ఓడిపోయింది. వాటిని కూడా నేను ముందుగానే చెప్పా. నా మాట విన‌లేదు. మ‌రీ ముఖ్యంగా తెలంగాణ ఇస్తే పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తామని కేసీఆర్ చెప్పారు. ఆ మాట కూడా నిలబెట్టుకోలేదు. ఇది నాకు చాలా బాధ క‌లిగించింది(ప‌దేళ్ల త‌ర్వాత చెప్ప‌డం గ‌మ‌నార్హం). అందుకే బ‌య‌ట‌కు వ‌చ్చా. నేనేమీ ఇత‌ర నాయ‌కుల్లాగా కేసీఆర్‌పై విమ‌ర్శ‌లు చేయ‌డం లేదు.(చేసే అవ‌కాశం ఆయ‌న ఇవ్వ‌లేదు.ఎంతో మందిని కాద‌ని నెత్తిన పెట్టుకున్నారు. అప్పాయింట్‌మెంట్ లేకుండా నేరుగా వెళ్లే అవ‌కాశం ఇచ్చారు) ఇండియాలో కాంగ్రెస్ పార్టీనే గొప్ప పార్టీ. అందుకే ఆ పార్టీలో చేరుతున్నా'' అని కేశ‌వ‌రావు అన్నారు. దీనిపైనే నెటిజ‌న్లు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.