Begin typing your search above and press return to search.

కూటమి ఫస్ట్ మీటింగ్...హిట్టేనా...!?

టీడీపీ జనసేన బీజేపీ జట్టు కట్టిన తరువాత పెట్టిన ఫస్ట్ మీటింగ్ చిలకలూరిపేట బొప్పూడి వద్ద జరిగింది.

By:  Tupaki Desk   |   18 March 2024 3:59 AM GMT
కూటమి ఫస్ట్ మీటింగ్...హిట్టేనా...!?
X

టీడీపీ జనసేన బీజేపీ జట్టు కట్టిన తరువాత పెట్టిన ఫస్ట్ మీటింగ్ చిలకలూరిపేట బొప్పూడి వద్ద జరిగింది. ఈ మీటింగ్ తో అంతా బిగ్ సౌండ్ చేస్తారని దెబ్బకు ఏపీలో పొలిటికల్ వేవ్ క్రియేట్ అవుతుందని కూటమి పెద్దలు భావించారు. కానీ జరిగింది వేరుగా ఉంది. కూటమి మీటింగ్ అనుకున్నంత స్థాయిలో జరగలేదు అని అంటున్నారు.

ఈ మీటింగులో మైకులు మొరాయించడం అతి పెద్ద మైనస్ పాయింట్ గా మారింది. ప్రధాని అంతటి వ్యక్తి సభలో మాట్లాడుతూంటే మైకులు పనిచేయలేదు. దాంతో ఆయన పోడియం ముందు బొమ్మలా నిలబడాల్సి వచ్చింది. ఒక దశలో ప్రధాని అసహనానికి కూడా గురి అయ్యారు. సభలో ఒకసారి కాదు పలు మార్లు ప్రధాని మాట్లాడుతున్నపుడల్లా మైకులు మొరాయించాయి.

పైగా లైవ్ టెలికాస్ట్ అవుతున్నది కాస్తా ఆగిపోయింది. అంతటా ఏమి జరుగుతోందో తెలియని పరిస్థితి. దీంతో మోడీ ముఖంగా ఒకింత కోపం కూడా కనిపించింది. ఇదిలా ఉంటే మోడీ సభను సరిగ్గా జరపలేదు అన్న అసంతృప్తి కూటమి నేతలతో పాటు సభకు వచ్చిన వారిలోనూ కనిపించింది.

సభలో ప్రధాని మాటలు విందామనుకునేవారికి ఏమీ అర్ధం కాని పరిస్థితి. ఇక మోడీ ప్రసంగం కూడా ఏమంత ఉత్తేజపూరితంగా లేదు. దేశంలో మిగిలిన రాష్ట్రాలలో తన స్పీచులతో దూకుడు చేసే మోడీ ఏపీలో మాత్రం ఒక్కటే రాగం ఆలపించారు. ఎన్డీఏని గెలిపించాలి. నాలుగు వందల సీట్లు అని.

ఆయన ఏపీ ప్రభుత్వాన్ని కూడా పెద్దగా విమర్శించలేదు. విమర్శిస్తే చాలా విమర్శలు తిరిగి తమకే తగులుతాయని ఆగారా అన్న చర్చ వస్తోంది. ఏపీకి రాజధాని లేదు అంటే ఆ తప్పు ఎవరిది అని అంటారు, పోలవరం గురించి చెబితే జనాలకు వేరే సందేహాలు వస్తాయి. అసలు ప్రత్యేక హోదా విషయం కూటమిలో ఉన్న టీడీపీ జనసేన నేతలు కూడా కన్వీనియెంట్ గా మరచిపోయారు. మోడీ మాత్రం ఎందుకు మాట్లాడుతారు.

ఇలా చాలా విషయాలలో ఏపీకి సంబంధించి ఇబ్బందులు ఉన్నాయి. ఏపీని కాంగ్రెస్ అడ్డగోలుగా విభజిస్తే కేంద్ర ప్రభుత్వం పదేళ్ళుగా పట్టించుకోలేదు అన్న వేదన జనాలకు ఉంది. అందుకే ఏ హామీలు ఇవ్వకుండా ఏ ఆశలు పెట్టకుండా ప్రధాని మీటింగ్ ముగించేశారు అని అంటున్నారు.

ఇక మోడీ సభతో సూపర్ హిట్ కొట్టాలని చూసిన టీడీపీ జనసేనలకు సభ నిర్వహణ తీరు ఇబ్బందికరంగా మారింది. దానితో పాటు ఈ సభ 2014 మాదిరిగా ఏపీ రాజకీయాన్ని మలుపు తిప్పుతుంది అనుకుంటే ఫర్వాలేదు అనిపించేసింది.

ఇక దీని మీద మాజీ మంత్రి వైసీపీ నేత పేర్ని నాని అయితే హాట్ కామెంట్స్ చేశారు. సభను సరిగ్గా నిర్వహించేలేని వాళ్లు జగన్ తో యుద్ధానికి వస్తారా అని ఎద్దేవా చేసారు. ప్రధానిని సభకు పిలిచి ఆయన మైక్ పనిచేయకుండా పోతే చూస్తూ ఉన్నారని ఇది అవమానం కాదా అని పేర్ని నాని నిలదీశారు. మొత్తానికి కూటమి తొలి సభ మాత్రం హిట్ అవలేదని ప్రత్యర్ధి వైసీపీ బయటకు అంటూంటే టీడీపీ అభిమానులు జనసేన నేతలు కూడా అనుకున్న స్థాయిలో జరగలేదని మధనపడుతున్నారని అంటున్నారు.