Begin typing your search above and press return to search.

బాబుని సీఎం చేయమని మోడీ ఎందుకు అడగలేదు...!?

ఆ మాట ఎవరైతే అంటే శంఖంలో పోస్తే తీర్ధం అవుతుందో అలాంటి పెద్ద మనిషి దేశ ప్రధాని నరేంద్ర మోడీ అని ఉంటే జనాలకు ఎలా ఉండేదో

By:  Tupaki Desk   |   18 March 2024 9:16 AM GMT
బాబుని సీఎం చేయమని మోడీ ఎందుకు అడగలేదు...!?
X

పాయింటే మరి. అంత పెద్ద మీటింగ్ పెట్టి మరీ మోడీని రప్పించింది ఆయన్ని ఒళ్ళూ మనసూ తెలియకుండా చంద్రబాబు పొగిడింది దేనికోసం. చంద్రబాబుని సీఎం చేయండి అన్న ఒక్క మాట కోసం. ఆ మాట ఎవరైతే అంటే శంఖంలో పోస్తే తీర్ధం అవుతుందో అలాంటి పెద్ద మనిషి దేశ ప్రధాని నరేంద్ర మోడీ అని ఉంటే జనాలకు ఎలా ఉండేదో. ఏ రకమైన రియాక్షన్ వచ్చేదో.

కానీ నరేంద్ర మోడీ నలభై నిముషాలకు పైగా చేసిన చిలకలూరిపేట స్పీచ్ లో బాబు సీఎం ఈ రెండు మాటలు అంటేనా. ఒట్టు పెట్టుకున్నట్లుగా మోడీ ఆ ఊసే తలవలేదు. ఎంతసేపూ డబుల్ ఇంజన్ సర్కార్ అన్నారు. ఎన్డీయేని గెలిపించమన్నారు. కేంద్ర ప్రభుత్వం విజయాలను ఏకరువు పెట్టారు. అంతే తప్ప చంద్రబాబుని ఏపీ సీఎం గా చేయమని అసలు ఎక్కడా కోరలేదు.

అంతే కాదు చంద్రబాబు అనుభవం గురించి మూడు సార్లు ఆయన ఏపీకి సీఎం గా చేసిన సేవల గురించి చెప్పలేదు. అదే విధంగా చంద్రబాబు అవసరం ఏపీకి ఎంత ఉందో కూడా ఒకటి రెండు మాటలు అయినా చెప్పలేదు దాంతో తీవ్ర నిరాశలో టీడీపీ శ్రేణులు మునిగిపోయాయని అంటున్నారు.

ఒక వైపు జగన్ ని పదునైన మాటలతో విమర్శించలేదు. మరో వైపు ఏపీకి కాబోయే సీఎం చంద్రబాబే అని గట్టిగా చెప్పలేదు. ఎంతో శ్రమకోర్చి నిర్వహించిన చిలకలూరిపేట సభలో మోడీ వ్యవహరించి తీరు పట్ల తమ్ముళ్ళు అయితే కొంత ఆవేదనతోనే ఉన్నారని అంటున్నారు.

ఎన్డీయే ప్రభుత్వం ఏపీలో వస్తుంది అని అనవచ్చు ఎన్డీయేలో టీడీపీ కూడా ఉంది కాబట్టి సరిపెట్టుకోవచ్చు. కానీ ఏపీకి చంద్రబాబు వంటి అనుభవశాలి నాయకత్వం అవసరం అని మోడీ లాంటి బిగ్ షాట్ అని ఉంటే అది జనాలలోకి ఎంతో కొంత పాజిటివ్ గా వెళ్లేది అని అంటున్నారు.

కానీ కేంద్రంలో ఎన్డీయే ఏపీలో ఎన్డీయే అంటూ మోడీ మాట్లాడారు, బాబు పవన్ ఊసు పెద్దగా తలవలేదు, ఏపీలో కూడా ఎన్డీయే వస్తే డబుల్ ఇంజన్ సర్కార్ అవుతుంది అని మోడీ జనాలకు చెప్పారు. అపుడు అభివృద్ధి సాధ్యపడుతుందని అన్నారు. అంటే కేంద్రంలో బీజేపీ ఏపీలో బీజేపీ భాగస్వామ్యంతో ఎన్డీయే రావాలి అని ఆయన చెప్పారు అన్న మాట.

ఒకవేళ ఎన్డీయే ఏపీలో వస్తే సీఎం ఎవరు అవుతారు అన్నది మాత్రం ఇప్పటి నుంచే జనాలకు చెప్పడం ఎందుకు అన్నది కూడా మోడీ స్ట్రాటజీగా ఉందా అన్న డౌట్లు వస్తున్నాయి. అసలు ఇంతకీ మోడీ మనసులో ఎవరు ఉన్నారు అన్నది కూడా చర్చగా ఉంది, మిత్రపక్షంగా ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నారా అన్నది కూడా కొంతమంది సందేహం వ్యక్తం చేస్తున్నారు.

ఏపీలో హోరా హోరీ పోరు సాగుతోంది. టీడీపీ చూస్తే 144 సీట్లలో పోటీ చేస్తోంది. అందులో నుంచి 88 సీట్ల మ్యాజిక్ ఫిగర్ సాధించడం కొంత వరకూ కష్టసాధ్యమైనది . అపుడు జనసేనకు బీజేపీకి ఎంత తక్కువ సీట్లు వచ్చినా వారిదే ప్రముఖ స్థానం అవుతుంది. ఆ నేపధ్యంలో అధికారంలో వాటా కోరవచ్చు అన్న ఉద్దేశ్యం ఏదో బీజేపీ పెద్దలకు ఉండొచ్చు అని కూడా అంటున్నారు.

అందుకే మోడీ బాబుని ప్రమోట్ చేయకుండా చిలకలూరిపేట ప్రసంగం ముగించారు అని అంటున్నారు. ఏది ఏమైనా ఇది 2024 అని అంటున్నారు. 2014 ఎప్పటికీ కానే కాదు అని అంటున్నాబు. బాబు బాగా తగ్గిపోయారు అని దాన్ని బీజేపీ క్యాష్ చేసుకోవడానికే పొత్తు కలిపింది అని అంటున్నారు. బీజేపీ లేకపోతే బాబు ఓడారు అని అమిత్ షా ఇండియా టుడే కాంక్లేవ్ లో అన్న తరువాత ఇక బాబుని మేమే గెలిపిస్తున్నామని బీజేపీ భావిస్తున్న తరువాత ఏపీకి కాబోయే సీఎం పదవి విషయంలోనూ బీజేపీ పెత్తనం ఉంటుందని అంటున్నారు.