Begin typing your search above and press return to search.

ఏపీ మంత్రివ‌ర్యుల 'వెంట్రుక‌' వ్యాఖ్య‌లు.. పొలిటిక‌ల్ ర‌చ్చ‌!

పవన్ కళ్యాణ్‌కు ప్రజాబలం ఉంటే నిలబడిన రెండు చోట్ల ఎందుకు ఓడిపోతాడు" అని నారాయణస్వామి ప్రశ్నించారు.

By:  Tupaki Desk   |   15 Sep 2023 1:30 AM GMT
ఏపీ మంత్రివ‌ర్యుల వెంట్రుక‌ వ్యాఖ్య‌లు.. పొలిటిక‌ల్ ర‌చ్చ‌!
X

ఏపీ ఉప ముఖ్యమంత్రి, వైసీపీ సీనియ‌ర్ నేత‌, ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కుడు కిళ‌త్తూరు నారాయణస్వా మి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఎవ‌రు ఎన్నిపార్టీల‌తో జ‌త క‌ట్టినా వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ వెంట్రుక కూడా పీక‌లేర‌ని మంత్రి అన్నారు. అంతేకాదు.. ప్ర‌స్తుతం రిమాండ్ ఖైదీగా రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైల్లో ఉన్న చంద్ర‌బాబుపైనా ఆయ‌న తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. ఇక‌, చంద్ర‌బాబు బ‌య‌ట‌కు వ‌చ్చే ప్ర‌స‌క్తే లేద‌ని వ్యాఖ్యానించారు.

''కేసు త‌ర్వాత కేసు.. ఆయ‌న‌ను చుట్టుముడుతుంటే.. చంద్ర‌బాబు ఇక‌, బ‌య‌ట‌కు వ‌చ్చేది లేదు. పోయే ది లేదు. అక్క‌డే ఆయ‌న జీవిత‌మంతా గ‌డిచిపోతుంది'' అని మంత్రి నారాయ‌ణ‌స్వామి వ్యాఖ్యానించారు.

అంతేకాదు, ''టీడీపీని నడిపించే వారెవరూ లేరు. ఆ పార్టీ ప‌ని అయిపోయింది. సముద్రంలో కలిసిపోయినట్టే'' అంటూ.. త‌న‌దైన శైలిలో మంత్రి స్పందించారు. దేశం అంతా ఒక్కటి అయినా, పార్టీల‌న్నీ క‌ట్ట‌గ‌ట్టుకుని వ‌చ్చి పోటీ చేసినా.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో సీఎం జగన్‌ని కదిలించలేరని, ఆయన వెంట్రుక కూడా పీకలేరని వ్యాఖ్యానించారు.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ కులాలను రెచ్చగొడుతున్నార‌ని మంత్రి అన్నారు. కాపుల‌కు ఒక్క మంచి ప‌ని అయినా చేశాడా? సినిమాలో యాక్ట్ చేసినంత ఈజీ కాదు రాజకీయం చేయడమంటే అని అన్నారు. ''బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ ఇద్దరు సినిమా యాక్టర్లు.. వీరికి ప్రజాబలం లేదు. పవన్ కళ్యాణ్‌కు ప్రజాబలం ఉంటే నిలబడిన రెండు చోట్ల ఎందుకు ఓడిపోతాడు" అని నారాయణస్వామి ప్రశ్నించారు.

రాజ‌కీయ ర‌చ్చ‌! కాగా, మంత్రి నారాయ‌ణ స్వామి చేసిన వెంట్రుక వ్యాఖ్య‌ల‌పై రాజ‌కీయ ర‌చ్చ రాజుకుంది. సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం ఉన్న నారాయ‌ణ స్వామి ఇలాగేనా మాట్లాడేది? అంటూ.. ప‌లువురు ఇత‌ర‌ పార్టీల నాయ‌కులు దుమ్మెత్తి పోశారు. అంతేకాదు, చంద్ర‌బాబును శాస్వ‌తంగా జైల్లో ఉంచాల‌న్న కుట్ర.. మంత్రి మాట‌లతో నిజం అయింద‌ని.. మంత్రి నారాయ‌ణ స్వామి చేసిన వ్యాఖ్య‌ల‌పై వైసీపీ అధిష్టానం త‌క్ష‌ణం రియాక్ట్ కావాల‌ని, ఆయ‌న చెప్పిన మాట‌లు నిజ‌మో కాదో చెప్పాల‌ని ప‌లువురు టీడీపీ నేత‌లు డిమాండ్ చేశారు.