Begin typing your search above and press return to search.

నారాయణ తీరుపై జనసేన సీరియస్... కారణం ఇదే!

అయితే... కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ - జనసేన నేతల మధ్య సఖ్యత ఉండటం లేదని అంటున్నారు.

By:  Tupaki Desk   |   9 March 2024 7:13 AM GMT
నారాయణ తీరుపై జనసేన సీరియస్... కారణం  ఇదే!
X

వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సత్తాచాటాలని భావించిన చంద్రబాబు... పవన్ కల్యాణ్ తో కలిసి బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే "జెండా" అంటూ ఉమ్మడి బహిరంగ సభ నిర్వహించారు. ఇకపై వరుసగా ఉమ్మడి సభలు ఉంటాయని చెబుతున్నారు. ఉమ్మడి మేనిఫెస్టోపైనా ఇప్పటికే ఒక క్లారిటీకి వచ్చారని చెబుతున్నారు. అయితే... కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ - జనసేన నేతల మధ్య సఖ్యత ఉండటం లేదని అంటున్నారు. ఈ క్రమంలో ప్రధానంగా నెల్లూరు పేరు తెరపైకి వచ్చింది.

అవును... రాష్ట్రంలో టీడీపీ - జనసేన ల మధ్య పొత్తు కుదిరినప్పటికీ నెల్లూరు సిటీ నియోజకవర్గంలో మాత్రం ఆ రెండు పార్టీల కలయికకు టీడీపీ నేతలు ససేమిరా అంటున్నారని తెలుస్తుంది. ఇందులో భాగంగా రానున్న ఎలక్షన్స్ లో జనసైనికులతో కలిసి ప్రయాణించడానికి టీడీపీ నెల్లూరు సిటీ అభ్యర్థి నారాయణ ఇష్టపడటం లేదని అంటున్నారు. ఇందులో భాగంగా... ప్రచారానికి వెళ్తున్నప్పుడు టీడీపీ జెండాలతో మాత్రమే వెళ్తున్నారని తెలుస్తుంది.

ఇదే సమయంలో చెబుతున్న మాటలు, చేస్తున్న చేష్టలు అన్నీ ఏకపక్షంగానే ఉంటున్నాయని.. జనసైనికులను కలుపుకుపోయే విషయంలో మాజీమంత్రి నారాయణ ఏమాత్రం సుముఖత వ్యక్తం చేయడం లేదని అంటున్నారు.

వాస్తవానికి పొత్తులో భాగంగా నెల్లూరు సిటీ సీటు తమకే కావాలని జనసైనికులు బలంగా కోరినట్లు చెబుతుంటారు. ఇందులో భాగంగా టీడీపీతో పొత్తు కుదిరితే నెల్లూరు సిటీ సీటు తమకే వస్తుందని జనసేన నేత మనుక్రాంత్ రెడ్డి ఎంతగానో ఆశపడినట్లు చెబుతారు. అయితే అందుకు చంద్రబాబు ఏమాత్రం అంగీకరించలేదని.. నారాయణను కాదని ఆ సీటు జనసేనకు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారని అంటారు.

ఇలా నెల్లూరు సిటీ సీటు తమకు దక్కలేదనే బాదలో ఉన్న జనసైనికులను నారాయణ దూరం పెడుతున్నారని.. కలుపుకుపోవడం లేదని.. కార్యక్రమాలను పిలవడం లేదని.. జనసేన నేతలకు సముచిత స్థానం ఇవ్వడం లేదని.. తాను టీడీపీ - జనసేన ఉమ్మడి అభ్యర్థి అనే విషయం మరిచిపోయి.. ఒంటెద్దుపోకడలకు పోతున్నారని జనసైనికులు వాపోతున్నారని అంటున్నారు. దీంతో... నారాయణ తీరుపై జనసైనికులు గుర్రుగా ఉన్నారని తెలుస్తుంది.

ఇలా తాను టీడీపీ - జనసేన ఉమ్మడి అభ్యర్థి అనే విషయం మరిచిపోయినట్లుగా నారాయణ ప్రవర్తిస్తున్నారని వాపోతున్న జనసైనికులు... పోలింగ్ రోజు సహకరిస్తారా.. లేక, అప్పుడు వారి తడాఖా చూపించి కొంప ముంచుతారా అనేది వేచి చూడాలి.