Begin typing your search above and press return to search.

లోకేష్ మీటింగ్స్ కి బజ్ లేదా...!?

టీడీపీ యువనేత నారా లోకేష్ శంఖారావం పేరుతో సభలను పెడుతూ ఉత్తరాంధ్రా అంతటా తిరుగుతున్నారు

By:  Tupaki Desk   |   15 Feb 2024 10:29 AM GMT
లోకేష్ మీటింగ్స్ కి బజ్ లేదా...!?
X

టీడీపీ యువనేత నారా లోకేష్ శంఖారావం పేరుతో సభలను పెడుతూ ఉత్తరాంధ్రా అంతటా తిరుగుతున్నారు. గత ఏడాది యువగళం పాదయాత్ర తరువాత రెండు నెలల పాటు గ్యాప్ తీసుకుని మరీ లోకేష్ జనంలోకి వచ్చారు. ఆయన వైసీపీ ప్రభుత్వం మీద సెటైర్లు పేలుస్తున్నారు. జగన్ మీద కూడా ధాటిగానే హాట్ కామెంట్స్ చేస్తున్నారు.

శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి మొదలెట్టిన లోకేష్ శంఖారావం సభలు టీడీపీ నిస్తేజంలో ఉంటే కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. లోకేష్ శ్రీకాకుళం జిల్లాలోని ప్రతీ నియోజకవర్గంలోనూ మీటింగ్స్ పెట్టారు. టీడీపీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నాయి. లోకేష్ సందర్భానుసారం కౌంటర్లు వేస్తున్నారు. అధికార వైసీపీ మీద గట్టిగానే సెటైర్లు వేస్తున్నారు.

అయితే లోకేష్ శంఖారావం సభలకు అనుకున్న బజ్ అయితే మీడియాలో రావడంలేదు అని అంటున్నారు. ముఖ్యంగా టీడీపీ అనుకూల మీడియా అయితే పూర్తి స్థాయిలో లోకేష్ బాబు మీటింగ్స్ మీద హైప్ క్రియేట్ చేయడం లేదు అని అంటున్నారు. ఇదే చంద్రబాబు రా కదలిరా సభల విషయం తీసుకుంటే ఒక రేంజిలో హైప్ క్రియేట్ చేస్తూ భారీ కవరేజ్ చేస్తూ వచ్చింది.

యువ నేత లోకేష్ విషయంలో మాత్రం అంత ఎందుకు లేదు అన్న చర్చ వస్తోంది. ఒక విధంగా చూస్తే లోకేష్ కి టీడీపీ అనుకూల మీడియా అనుకున్నంతగా ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదా అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి. చంద్రబాబుతో పోల్చుకుంటే లోకేష్ బాబుకు టీడీపీ అనుకూల మీడియాలో బజ్ తక్కువే అని కూడా అంటున్నారు.

వాస్తవానికి ఉత్తరాంధ్రాలో ఇటీవల కాలంలో తెలుగుదేశం అగ్ర నేతలు పెద్దగా పర్యటించినది లేదు. చంద్రబాబు అక్కడక్కడ సభలు తప్ప ఉత్తరాంధ్రా మీద టీడీపీ ఫోకస్ పెట్టి సుడిగాలి పర్యటనలు చేసినది లేదు. లోకేష్ యువగళం పాదయాత్ర కూడా విశాఖను దాటి ముందుకు వెళ్లలేదు.

ఈ సమయంలో లోకేష్ రంగంలోకి దిగిపోయారు. ఆయన మొత్తం 30కి పైగా సభలను ఉత్తరాంధ్రా అంతటా నిర్వహించేందుకు భారీ యాక్షన్ ప్లాన్ ని కూడా పెట్టుకున్నారు. రోజుకు మూడు సభలు అంటే మాటలు కాదు. అలా ఉత్తరాంధ్రాలో గ్రౌండ్ లెవెల్ కి వెళ్లి మరీ జనాలతో మమేకం అవుతున్నారు.

ఒక విధంగా చూస్తే ఉత్తరాంధ్రాలో టీడీపీకి ఒకనాడు కంచుకోటలు ఉండేవి. కమిటెడ్ క్యాడర్ లీడర్లు ఇక్కడ ఉన్నారు. అయితే వారులో ఒక రకమైన స్తబ్దత నెలకొంది. ఇపుడు లోకేష్ టూర్ వల్ల అదంతా తొలగిపోతోంది. ఎక్కడికక్కడ క్యాడర్ ఉత్సాహంగా ముందుకు వస్తోంది.

ఎన్నికల వేళ ఇంతలా ప్రతీ చోటా మీటింగ్స్ పెట్టడం ద్వారా సైకిల్ కి జోరెత్తించారు. టీడీపీకి కొత్త హుషార్ తెచ్చారు లోకేష్ అని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇక లోకేష్ స్పీచ్ కూడా మారిందని, ఆయన పంచులు ఒక లెవెల్ లో ఉంటున్నాయని అంటున్నారు.

మరి ఇంతలా లోకేష్ తిరుగుతూంటే ఆయనకు టీడీపీ అనుకూల మీడియాలో ఎందుకు బజ్ లేదు అన్నదే ఇక్కడ చర్చగా ఉంది. చంద్రబాబు విషయంలో ఉన్న ఫోకస్ లోకేష్ మీద ఎందుకు పెట్టడం లేదు అని కూడా అంటున్నారు.

అయితే లోకేష్ ని ఈ ఎన్నికల్లో ముందుకు తీసుకుని రాకూడదు అన్నది ఒక వ్యూహమని చెబుతున్నారు. చంద్రబాబే కనిపించాలి అని కూడా అంటున్నారు. అందులో భాగంగానే లోకేష్ మీద కొంత మేరకే ఫోకస్ పెడుతున్నారు అని అంటున్నారు. ఉత్తరాంధ్రా వరకూ చూస్తే లోకల్ గా ఇవ్వాల్సిన ప్రయారిటీ ఇస్తున్నారు. ఆయన పర్యటనలు పూర్తిగా టీడీపీని మళ్ళీ రీ యాక్టివ్ చేసేందుకే అని అంటున్నారు. ఆ దిశగా అనుకున్న విధంగా లోకేష్ చేస్తున్నారు. అందుకే అంతవరకే పరిమితం చేస్తున్నారు అని టాక్ కూడా ఉంది.