Begin typing your search above and press return to search.

లోకేష్ కోసం ఢిల్లీ వెళ్ళిన సీఐడీ

నారా లోకేష్ కొద్ది రోజులుగా ఢిల్లీలో ఉంటున్నారు. తన తండ్రి టీడీపీ అధినేత చంద్రబాబు ఏ తప్పూ చేయలేదని ఆయన అంటున్నారు

By:  Tupaki Desk   |   18 Sep 2023 3:57 AM GMT
లోకేష్ కోసం ఢిల్లీ వెళ్ళిన సీఐడీ
X

నారా లోకేష్ కొద్ది రోజులుగా ఢిల్లీలో ఉంటున్నారు. తన తండ్రి టీడీపీ అధినేత చంద్రబాబు ఏ తప్పూ చేయలేదని ఆయన అంటున్నారు. అంతే కాదు స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ వల్ల లక్షలాది మంది విద్యార్ధులకు శిక్షణ ఇచ్చామని చెబుతున్నారు.

ఇలా అన్నీ కలగాపులగం చేసి మాట్లాడడం ద్వారా ఏపీ సీఐడీ పెట్టిన కేసు తప్పు అంటున్నారు. మరి జాతీయ మీడియాకు ఇంటర్వ్యూలు వరసబెట్టి ఇస్తూ లోకేష్ చేస్తున్న హడావుడితో ఏపీ సీఐడీ కూడా ఆయన కోసం ఆయన ఉన్న చోటకే అంటే ఢిల్లీకే వెళ్ళింది.

ఢిల్లీలో జాతీయ మీడియాను ఫోకస్ చేస్తూ ఏపీ సీఐడి అసలు వాస్తవాలను బయటపెట్టింది. స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ స్కాం కి ప్రధాన సూత్రధారి పాత్రధారి సర్వం సహా చంద్రబాబే అంటూ ఏపీ సీఐడీ చీఫ్ ఎన్ సంజయ్ మరోసారి గట్టిగానే చెప్పారు. ఢిల్లీ మీడియాతో ఆయన మాట్లాడుతూ ఈ స్కాం అంతా బాబు కనుసన్నల్లోనే జరిగింది అని చెప్పారు.

స్కాం జరిగింది 201, 2015-2016 సంవత్సరంలో అని, 371 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని సంజయ్ చెప్పుకొచ్చారు. అధికారుల మీద వత్తిడి పెట్టి మరీ నాటి సీఎం చంద్రబాబు సీమెన్స్ సంస్థ పేరిట సొమ్ములు రిలీజ్ చేయించారు అని అన్నారు.

పూర్తి ఆధారాలు ఉన్నాయని, పక్కగా స్కాం జరిగితే లోకేష్ ఢిల్లీలో అబద్దాలు చెబుతున్నారని సంజయ్ మండిపడ్డారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ ద్వారా విద్యార్ధులు లక్షలాది మంది విద్యార్ధులు చదువుకున్నారని చెప్పడం మీద ఆయన మండిపడ్డారు.

ఈ రెండింటినీ లోకేష్ కలుపుతున్న తీరు అభ్యంతరం అన్నారు. ఆ తరువాత నాలుగేళ్ల కాలంలో ప్రభుత్వం 700 కోట్లకు పైగా స్కిల్ డెవలప్మెంట్ కోసం వెచ్చించిదని అది వేరే మ్యాటర్ అని అన్నారు. అంటే ప్రభుత్వం వేరేగా విడుదల చేసిన మొత్తంతో విద్యార్ధులు శిక్షణ పొందితే దాన్ని దీన్ని ముడిపెట్టి లోకేష్ స్కాం ఎక్కడ ఉంది అంటూ తప్పుదోవ పూర్తిగా పట్టిస్తున్నారనని సంజయ్ ఘాటుగా విమర్శించారు.

ఇక ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కూడా ప్రభుత్వ సొమ్ము రూ. 241 కోట్లను అనుమానాస్పద రీతిలో స్వాహా చేసినట్లుగా అక్రమాస్తులను గుర్తించారుని ఆయన వెల్లడించారు. . డిజైన్‌టెక్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు అలాగే స్కిల్లర్ ఎంటర్‌ప్రైజెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా ఆ తర్వాత షెల్ కంపెనీల వెబ్ ద్వారా నిధులను విడుదల చేయడం ద్వారా డబ్బు స్వాహా అవుతోందని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గుర్తించిందని ఆయన చెప్పారు.

ఈ స్కాం చాలా వ్యూహాత్మకంగా జరిగిందని, ఇదంతా మ్యానిపులేట్ చేసి చేశారని మాస్టర్ మైండ్స్ దీని వెనక పనిచేశాయని సంజయ్ చెప్పడం విశేషం. మొత్తానికి గత నాలుగు రోజులుగా ఢిల్లీలో లోకేష్ జాతీయ మీడియాకు చెబుతున్నదంతా శుద్ధ అబద్ధమని ఏపీ సీఐడీ ఢిల్లీకి వచ్చి మరీ అదే మీడియా సాక్షిగా ఖండించింది అన్న మాట.