Begin typing your search above and press return to search.

పాలిటిక్స్ లోకి రాకుండా ఆపేది ఎవరు అంటున్న హీరో !

ఇక నారా రోహిత్ తండి నారా రామ్మూర్తినాయుడు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన చంద్రబాబుకు విధేయుడు అయిన తమ్ముడిగా ఉంటూ వచ్చారు.

By:  Tupaki Desk   |   24 Aug 2025 9:00 PM IST
పాలిటిక్స్ లోకి రాకుండా ఆపేది ఎవరు అంటున్న హీరో !
X

తాను అనుకుంటే రాజకీయాల్లోకి వచ్చి తీరుతాను అంటున్నారు టాలీవుడ్ హీరో నారా రోహిత్. తనకు ఎపుడు అనుకుంటే అపుడు రాజకీయాల్లోకి వస్తాను అని పక్కాగా చెబుతున్నారు. తన రాజకీయ దారి రహదారి అని కూడా అంటున్నారు. తాను రాజకీయాలోకి నిజంగా రావాలీ అనుకుంటే ఎవరూ అసలు ఆపలేరని కూడా ఒక భారీ స్టేట్మెంట్ ఇచ్చారు.

రాజకీయం ఇంట్లోనే :

తనకు రాజకీయం ఇంట్లోనూ ఒంట్లోనూ ఉందని నారా రోహిత్ చెబుతున్నారు. తాను రాజకీయ కుటుంబం నుంచే వచ్చాను అని ఆయన ప్రకటించారు. అవును ఆయన పెదనాన్న చంద్రబాబు ఏపీకి నాలుగవసారి సీఎం. ఆయనది యాభై ఏళ్ళ రాజకీయ జీవితం. జాతీయ రాజకీయాల్లో బాబు అత్యున్నత నాయకులలో ఒకరిగా నిలిచారు. అలా నారా రోహిత్ కి రాజకీయ స్పూర్తిగా దిగ్గజ నేత చంద్రబాబు స్పూర్తి ఇంట్లోనే ఉంది.

తండ్రి సైతం ఎమ్మెల్యే :

ఇక నారా రోహిత్ తండి నారా రామ్మూర్తినాయుడు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన చంద్రబాబుకు విధేయుడు అయిన తమ్ముడిగా ఉంటూ వచ్చారు. బాబు సీఎం గా ఉంటే గ్రౌండ్ లెవెల్ లో రాజకీయాలను ఆయనే దగ్గరుండి చూసుకునేవారు. అలా నారా రోహిత్ కి తండ్రి నుంచి కూడా రాజకీయ వారసత్వం వస్తోంది. అందువల్లనే తన కుటుంబమే రాజకీయ కుటుంబం అని ధీమాగా ఆయన ప్రకటించారు.

రాజకీయాల్లోకి వస్తే చెప్తా-

ఇక నారా లోకేష్ స్వయాన రోహిత్ కి అన్నయ్య. ఇద్దరి మధ్య మంచి అన్నదమ్ముల బాండింగ్ ఉంది. నారా రోహిత్ తమ్ముడు ఓకే అనాలే కానీ నారా లోకేష్ అన్నయ్య సరేనని అంటారు. గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. ఇలా అన్నీ కుదురుతున్నాయి. అందుకే నారా రోహిత్ రాజకీయ రంగ ప్రవేశం మీద చాలా కాలంగా ఊహాగానాలు వినిపిస్తూ వస్తున్నాయి. ఆయన కూడా హీరోగా అనేక సినిమాలు చేశారు అందులో సమాజానికి సంబంధించిన సందేశాత్మకమైనవి కూడా ఉన్నాయి. అలా చూస్తే కనుక ఆయన సమాజం మీద ఒక సంపూర్ణ అవగాహన రాజకీయాల పట్ల ఆసక్తి ఉందని అర్ధం అవుతోంది అంటున్నారు.

చంద్రగిరి కోట చుట్టూ :

చంద్రగిరి కోట చుట్టూ తన రాజకీయ బాట వేసుకోవాలని నారా రోహిత్ చూస్తున్నారు అని కధనాలు సైతం వస్తున్నాయి. చంద్రగిరి నుంచే చంద్రబాబు గెలిచి కాంగ్రెస్ లో మంత్రి కూడా అయ్యారు. ఇదే చంద్రగిరి నుంచి తండ్రి రామ్మూర్తినాయుడు సైతం ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన కూడా తన ప్రభావాన్ని అక్కడ చాటారు. నారా వారి సొంత నియోజకవర్గంలో ఆ కుటుంబం వారే ప్రాతినిధ్యం వహిస్తే బాగుంటుంది అన్న ఆలోచన కూడా టీడీపీ అభిమానులలో ఉంది.

రాజకీయ అరంగేట్రం అపుడే :

అయితే మూడు దశాబ్దాలుగా అక్కడ కాంగ్రెస్ వైసీపీ గెలుస్తూ వస్తున్నాయి. మధ్యలో టీడీపీ గెలిచినా కూడ వేరే వారు వస్తున్నారు. దాంతో 2029 ఎన్నికల్లో పక్కాగా నారా రోహిత్ బరిలోకి దిగుతారు అని అంటున్నారు. ఆ విధంగా ఆయన చంద్రగిరిలో వైసీపీ ఆధిపత్యానికి బ్రేక్ వేయడమే కాకుండా నారా వారి ఫ్యామిలీలో మరో తరానికి నాందీ ప్రస్తావన రాజకీయంగా చేస్తారు అని అంటున్నారు. దానికి సూచనగా రాజమండ్రి తాజాగా వచ్చిన నారా రోహిత్ నోటి వెంట ఈ రాజకీయ వ్యాఖ్యలు వచ్చాయని అంటున్నారు. చూడాలి మరి తమ్ముడు నారా రోహిత్ ఎపుడు రాజకీయ అరంగేట్రం ప్రకటన చేస్తారో.