'మేడ్ ఫర్ ది వరల్డ్'.. మా పాలసీ: నారా లోకేష్
``మా ప్రభుత్వానికి ప్రత్యేకమైన పాలసీ ఉంది. అది.. మేడ్ ఫర్‌ది వరల్డ్.`` అని మంత్రి నారా లోకేష్ వ్యా ఖ్యానించారు.
By: Tupaki Desk | 8 May 2025 9:30 PM``మా ప్రభుత్వానికి ప్రత్యేకమైన పాలసీ ఉంది. అది.. మేడ్ ఫర్‌ది వరల్డ్.`` అని మంత్రి నారా లోకేష్ వ్యా ఖ్యానించారు. మేకిన్ ఇండియా మాదిరిగా.. తమ కూటమి ప్రభుత్వం కూడా.. మేకిన్ ఆంధ్ర పాలసీని అమ లు చేస్తోందని.. అయితే, భవిష్యత్తులో దీనిని `మేడ్ ఫర్ ది వరల్డ్` స్థాయికి తీసుకువెళ్తామని నారా లోకేష్ చెప్పారు. దీనికి గాను భవిష్యత్తు పారిశ్రామిక ఆకాంక్షలకు పెద్ద పీట వేయనున్నట్టు తెలిపారు. ``ఆకర్షణ-పెట్టుబడి.. ఈ రెండు కలిస్తే.. కొత్త ఫ్యూచర్ సాకారం అవుతుంది`` అని వెల్లడించారు.
తాజాగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని శ్రీసిటీలో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ యూనిట్‌కు శ్రీకారం చుట్టారు. ఈ సంద ర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ.. భవిష్యత్తును ఆవిష్కరించారు. ఏపీని భవిష్యత్తులో ఎలక్ట్రానిక్స్ పవర్ హబ్‌గా తీర్చిదిద్దనున్నట్టు తెలిపారు. ప్రతి పెట్టుబడి నుంచి వందల వుద్యోగాలు లభించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ``ఒక్కొక్క పెట్టుబడి.. ఒక్కొక్క పునాదిగా ముందుకు సాగుతున్నాం. ఎల్జీ పరిశ్రమ అతి పెద్దది. దీని వల్ల సీమ ప్రాంతంలో భారీ ఎత్తున ఉద్యోగాలు లభించనున్నాయి.`` అని మంత్రి చెప్పుకొచ్చారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. పెట్టుబడులకు ప్రాధాన్యం పెంచుతున్నట్టు నారా లోకేష్ తెలిపారు. దీనిలో ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్(ఎఫ్‌డీఐ)లలో ఎల్జీ 5 వేల కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టిందని మంత్రి చెప్పుకొచ్చారు. ఇదే ఇప్పటి వరకు రాష్ట్రంలో తొలి భారీ ఎఫ్‌డీఐగా పేర్కొన్నారు. ఎల్జీ రావడానికి కారణం.. సీఎం చంద్రబాబు దార్శనికతేనని చెప్పుకొచ్చారు. ఈ పెట్టుబడి ద్వారా.. ఎలక్ట్రానిక్ ఉపకరణాలను ఎల్జీ సంస్థ అందించనుంది. కాగా.. ఈ ఒప్పందం.,. ద్వారా 2 వేల మంది వరకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందనున్నారు.