Begin typing your search above and press return to search.

సభలో బాలకృష్ణ రచ్చ రచ్చ...స్పీకర్‌ & మేటర్ సీరియస్‌!

అనంతరం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ఈ సమయంలో మరోసారి టీడీపీ సభ్యుల నినాదాలు మొదలుపెట్టారు

By:  Tupaki Desk   |   22 Sep 2023 6:01 AM GMT
సభలో బాలకృష్ణ రచ్చ రచ్చ...స్పీకర్‌ & మేటర్ సీరియస్‌!
X

ఏపీ అసెంబ్లీ రెండో రోజు సమావేశాలు శుక్రవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన అంబటి రాంబాబు... స్కిల్ డెవలప్ మెంట్ స్కాం పై ఎప్పుడైనా, ఎక్కడైనా చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో టీడీపీ కచ్చితంంగా చర్చలో పాల్గొనాలని కోరారు.. పారిపోవద్దని సూచించారు.

అనంతరం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ఈ సమయంలో మరోసారి టీడీపీ సభ్యుల నినాదాలు మొదలుపెట్టారు. అనంతరం స్పీకర్‌ పోడియంను చుట్టుముట్టారు. ఈ సమయంలో... టీడీపీ సభ్యులు ఇప్పటికైనా తమ తీరును మార్చుకోవాలని, కావాలనే సభకు అంతరాయం కలిగిస్తున్నారని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

అయినప్పటికీ టీడీపీ సభ్యుల నినాదాలు ఆగలేదు, తగ్గలేదు. దీంతో ఈసారి సభలో అంబటి రాంబాబు మైకందుకున్నారు. ఇది సభ అనే విషయం టీడీపీ సభ్యులు గుర్తించాలని, ఇది వారి ఆఫీసు అని భావించొద్దని తెలిపారు. ఇదే సమయంలో సీఎంను ఉద్దేశించి అసహ్యంగా మాట్లాడితే ఊరుకొనేది లేదని హెచ్చరించారు. ఇక, ఈ రోజు స్కిల్ స్కాం పై చర్చ ఉందని, సభ్యులు పాల్గొనాలని సూచించారు.

ఈ సమయంలో స్పీకర్ పోడియంను చుట్టిముట్టిన టీడీపీ సభ్యులు... ఆయనపై పేపర్లు విసిరారు. అనంతరం... అసెంబ్లీని 10 నిమిషాలు వాయిదా వేశారు స్పీకర్‌ తమ్మినేని. ఈ సమయంలో నిన్నటి సంఘటనతో ముందుజాగ్రత్త చర్యలు చేపట్టిన స్పీకర్ ఇందులో భాగంగా... మార్షల్ ను అలర్ట్ చేశారు.

10 నిమిషాల వాయిదా అనంతరం సభ తిరిగి ప్రారంభమైంది. ఈ సమయంలో మంత్రి జోగి రమేష్ మైకందుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో సైకో పాలన ఎప్పుడో పోయిందని, టీడీపీ నినాదాలకు కౌంటర్స్ వేశారు. ఆ సమయంలో అచ్చెన్నాయుడు, అశోక్ ల నినాదాలు హోరెత్తాయి. దీంతో స్పీకర్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఇందులో భాగంగా... ఈ సెషన్‌ మొత్తం సభ నుంచి కింజురపు అచ్చెన్నాయుడు, బెందాళం అశోక్‌ లను సస్పెండ్ చేశారు. మొదటి రోజు... కోంటం రెడ్డి శ్రీధర్ రెడ్డి, అనగాని సత్యప్రసాద్‌, పయ్యావుల కేశవ్‌ లను ఈ సమావేశాలు పూర్తయ్యే వరకూ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.

ఈ సమయంలో ఇద్దరు టీడీపీ సభ్యుల సస్పెన్షన్‌ తో బాలకృష్ణ విజిల్స్ వేశారు. అనంతరం... బాలకృష్ణకు మద్దతిస్తూ టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ కూడా ఆయనతో కలిసి విజిల్స్‌ వేశారు. విజిల్స్ ఆపాలని స్పీకర్ చెప్పినా టీడీపీ సభ్యులు పట్టించుకోలేదు. దీంతో విజిల్స్ తీ సుకోవాలని స్పీకర్ ఆదేశించడంతో టీడీపీ సభ్యుల వద్దకు వెల్లిన మార్షల్స్ తో బాలకృష్ణ దురుసుగా ప్రవర్తించారు.

ఇదే సమయంలో నిమ్మల రామానాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, వెలగపూడి రామకృష్ణలను స్పీకర్ ఒకరోజు పాటు అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు.

కాగా, మొదటిరోజు కూడా సభలో బాలకృష్ణ స్పీకర్‌ పోడియం వద్ద మీసం మెలేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బాలకృష్ణ చేసిన పనిని మొదటి తప్పుగా పరిగణిస్తూ స్పీకర్‌ ఆయనకు వార్నింగ్‌ ఇచ్చి వదిలారు. రీపీట్ కావొద్దని హెచ్చరించారు! ఈ క్రమంలో ఈ రోజు విజిల్స్ వేశారు బాలకృష్ణ!

మరోవైపు శాసన మండలిలోనూ సేం సీన్ రిపీట్ అయ్యింది. సభ ప్రారంభం కాగానే టీడీపీ సభ్యులు ఫ్లకార్డులతో నిరసనకు దిగారు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో మండలి చైర్మన్ ఐదు నిమిషాల పాటు సభను వాయిదా వేశారు. వాయిదా అనంతరం తిరిగి సభ ప్రారంభమైంది.