Begin typing your search above and press return to search.

పురంధేశ్వరి ప్లేస్ లో కిరణ్ కుమార్ రెడ్డి....!?

గతంలో పార్టీలో ఎంతో కొంత చురుకుగా ఉన్న వారు సైతం ఇపుడు సైలెంట్ అయిపోగా చాలా మంది వేరే పార్టీలోకి వెళ్తున్నారు

By:  Tupaki Desk   |   23 Dec 2023 8:30 AM GMT
పురంధేశ్వరి ప్లేస్ లో కిరణ్ కుమార్ రెడ్డి....!?
X

బీజేపీ ఏపీ మీద ఫుల్ ఫోకస్ పెట్టనుంది అని అంటున్నారు. ఏపీలో పొత్తుల విషయం సంగతి పక్కన పెడితే ముందు పార్టీని గట్టిగా కదిలించే నాయకత్వం కోసం ఆ పార్టీ సెర్చ్ చేస్తోంది అని అంటున్నారు. ఏపీ బీజేపీకి దగ్గుబాటి పురంధేశ్వరి ఈ ఏడాది జూలైలో నియమితులయ్యారు. అయితే ఆమె గడచిన ఆరు నెలల కాలంలో పార్టీని ఎంతవరకూ పటిష్టం చేశారు అన్నది చూసే అగ్ర నాయకత్వానికి నిరాశగానే ఉంది అని అంటున్నారు.

గతంలో పార్టీలో ఎంతో కొంత చురుకుగా ఉన్న వారు సైతం ఇపుడు సైలెంట్ అయిపోగా చాలా మంది వేరే పార్టీలోకి వెళ్తున్నారు. మరి కొంతమంది సిద్ధంగా ఉన్నారు. కోస్తా జిల్లాలకు చెందిన పురంధేశ్వరి బలమైన సామాజికవర్గానికి చెందిన వారు ప్రత్యేకించి ఎన్టీఆర్ బ్లడ్ అని ఆమెకి అందలం అప్పగించారు అని అంటున్నారు.

అయితే ఆమె టీడీపీ నుంచి బీజేపీలోకి నేతలను తీసుకుని వస్తారని భావించారు. అలాగే బలమైన కమ్మ సామాజికవర్గాన్ని ఆకట్టుకుంటారని కూడా అంచనా వేశారు. కానీ ఇవేమీ జరగకపోగా ఆమె టీడీపీకి ప్రో గా మారారాని విమర్శలు అయితే సొంత పార్టీ నేతల నుంచే వచ్చాయని అంటున్నారు.

దీంతో ఎన్నికల వేళ బీజేపీ కీలకమైన నిర్ణయం తీసుకోబోతోంది అని అంటున్నారు. ఉమ్మడి ఏపీకి మూడేళ్ళ పాటు సీఎం గా వ్యవహరించి సమైక్య ఆంధ్ర నినాదం కోసం తన సీఎం పదవికి రాజీనామా చేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి ఏపీ బీజేపీ పగ్గాలు అప్పగించాలని ఆ పార్టీ ఆలోచిస్తోంది అని అంటున్నారు.

దీని వల్ల మరో బలమైన రెడ్డి సామాజికవర్గం నుంచి ఆదరణ ఉంటుందని బీజేపీ భావిస్తోందిట. అంటే టీడీపీ నుంచి చిన్నమ్మ వలసలు తేలేకపోయిందని, ఇపుడు వైసీపీ నుంచి కిరణ్ కుమార్ రెడ్డి వలసలు తేగలరు అని భావిస్తోంది అంటున్నారు. వైసీపీలో బలమైన సామాజిక వర్గం నేతలు టికెట్ దక్కని వారు ఉంటే వారిని ఈ వైపుగా తీసుకుని రావాలంటే సీనియర్ మోస్ట్ నేత గత కాంగ్రెస్ లో అందరూ నాయకుల పరిచయం ఉన్న నేతగా కిరణ్ కుమార్ రెడ్డి సరైన వారు అని భావిస్తున్నారు.

అలాగే రాయలసీమలో పార్టీకి కొంత అండగా ఆయన ఉంటారని కూడా లెక్కలేస్తున్నారుట. కిరణ్ కుమార్ రెడ్డికి జాతీయ కార్యవర్గంలో మెంబర్ గా ఇచ్చారు. ఆయన ఆరేడు నెలల క్రితం పార్టీలో చేరారు. తెలంగాణా ఎన్నికల వేళ ఆయన సేవలను వాడుకోలేదు. ఆయన సమైక్య వాది అని విమర్శలు వస్తాయనే అలా చేశారు అంటున్నారు. ఇపుడు ఏపీలో ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ ఆయనను ప్రెసిడెంట్ గా నియమిస్తే పార్టీ పుంజుకోవడమే కాదు ఆయననే సీఎం అభ్యర్ధిగా ప్రకటించి ముందుకు సాగాలని కూడా పార్టీ ఆలోచిస్తోంది అని అంటున్నారు.

ఇక పొత్తుల విషయం అయినా ఆయనను ముందు పెట్టి తేల్చుకోవచ్చు అని కూడా భావిస్తున్నారు. మరి కిరణ్ కుమార్ రెడ్డి ఏపీ బీజేపీ పగ్గాలు అందుకుంటారా ఎన్నికల వేళ పార్టీని విజయపధాన నడిపించగలరా. టీడీపీతో పొత్తు కలిపి బీజేపీకి గౌరవప్రదమైన సీట్లు దక్కించగలరా అన్నవి ప్రశ్నలు. అయితే ఏపీ బీజేపీకి కిరణ్ కుమార్ రెడ్డి అంటూ జరుగుతున్న ప్రచారంలో ఎంతమేరకు నిజం ఉందో ముందు ముందు తెలుస్తుంది అని అంటున్నారు.