బాబు పక్కనే పవన్...ఇక ఇదే రూల్ !
ఏపీలో కూటమి ప్రభుత్వంలో జనసేన పాత్ర ఏమిటి ఎంత అంటే అది అందరికీ తెలిసిన విషయమే.
By: Tupaki Desk | 9 May 2025 2:30 AMఏపీలో కూటమి ప్రభుత్వంలో జనసేన పాత్ర ఏమిటి ఎంత అంటే అది అందరికీ తెలిసిన విషయమే. అత్యంత కీలకమైన భూమికను జనసేన పోషిస్తోంది జనసేనకు 21 మంది ఎమ్మెల్యేలు కదా ఉన్నారు అని ఎవరూ అనుకోవడానికి వీలు లేదు. అసలు ఈ సంఖ్య అన్నది ప్రమాణం కానే కాదు.
నైతిక మద్దతు అన్నది ఒకటి ఉంటుంది అదే కొండంత బలం అలా కూటమిలో పవన్ స్థానం ఆయనకు ఇస్తున్న ప్రాధాన్యత అన్నీ అందరికీ తెలిసిందే. అయితే ఇటీవల అమరావతి రాజధానిలో అభివృద్ధి పనులను పునర్ నిర్మాణం చేయడానికి మోడీ ముఖ్య అతిథిగా దేశ ప్రధాని హోదాలో వచ్చి శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా లక్షలాది మంది ప్రజానీకం ఈ సభకు హాజరయ్యారు. ఇక వేదిక మీద మోడీ చంద్రబాబు పవన్ లోకేష్ కేంద్ర రాష్ట్ర మంత్రులు అంతా కూర్చున్నారు. రెండున్నర గంటల పాటు సాగిన ఈ సభ నభూతో నభవిష్యత్తు అన్నట్లుగా జరిగింది
అయితే ఎవరైనా గమనించారో లేదో కానీ ఈ సభలో మోడీ పక్కన బాబు ఉన్నారు, ఆయన పక్కన పవన్ లేరు, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఉన్నారు. ఆయూన పక్కన పవన్, పవన్ పక్కన నాదెండ్ల మనోహర్ ఇలా వరస ఉంది. మరి ఈ ప్రోటోకాల్ ఎవరు చెప్పారో అధికారులు ఎలా అమలు చేశారో తెలియదు కానీ పవన్ సీటు మోడీకి బాబుకు దూరంగా జరిగింది.
దీని మీద ఆనాటి సభలోనే అంతా చర్చించుకున్నారు. అంతే కాదు పవన్ ప్రాధాన్యత కూటమిలో తగ్గుతోందా అన్న చర్చను సోషల్ మీడియా వేదికగా కొంతమంది లేవనెత్తారు. అయితే ఈ విషయంలో అధికారులు తడబాటూ పొరపాటే తప్ప కూటమి పెద్దలది ఏ మాత్రం జోక్యం లేదని అంటున్నారు
పవన్ కి ఎంతోగానో విలువ గౌరవం చంద్రబాబు ఇస్తున్నారు అన్నది అందరికీ తెలుసు అని అంటున్నారు. మరో వైపు చూతే ముఖ్యమంత్రిగా బాబు ఫోటో ప్రభుత్వ ఆఫీసులలో ఉంటే ఉప ముఖ్యమంత్రిగా పవన్ ఫోటోని కూడా పెట్టిస్తూ మొదట్లోనే ఆదేశాలు జారీ చేశారు. ఇక పవన్ కే ఎక్కడైనా పెద్ద పీట వేస్తున్నారు. కానీ ఈ సభలో మాత్రం పవన్ సీటు దూరంగా జరగడం పట్ల సర్వత్రా చర్చ అయితే సాగింది.
దానికి ముగింపు పలికలా గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో అధికారులకు చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో కచ్చితమైన ఆదేశాలు ఇచ్చారని అంటున్నారు. ప్రధాని సభలో ఇక మీదట కేంద్ర మంత్రులను ఒకవైపు రాష్ట్ర మంత్రులను మరోవైపు కూర్చోబెట్టేలా ప్రోటోకాల్ జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు.
అమరావతి రాజధాని సభలో జరిగిన పొరపాట్లు ఇక మీదట పునరావృత్తం కారాదని బాబు చాలా గట్టిగానే అధికారులకు చెప్పారని అంటున్నారు. తన పక్కన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసీనులయ్యేలా ఆయనకు సీతుజ్ ఏర్పాట్లు చేయాలని బాబు ఆదేశించారు. భవిష్యత్తులో ఇటువంటి ఇబ్బందులు మళ్ళీ జరగరాదని ఆయన పేర్కొన్నారు.
మొత్తానికి అధికారులు చేసిన పొరపాట్ల వల్ల పవన్ సీటు బాబు పక్కన కాకుండా దూరం జరిగింది. అయితే బాబు మాత్రం ప్రోటోకాల్ మీద కచ్చితమైన రూలింగ్ ఇవ్వడంతో ఇక ఎప్పటికీ బాబు పక్కనే పవన్ కి చోటూ సీటూ ఉంటుందని అంటున్నారు. ఇది జనసైనికులకు హుషార్ ఇచ్చే వార్తగానే చూడాలని అంటున్నారు.