Begin typing your search above and press return to search.

చంద్ర‌బాబు అరెస్టును అడ్డుకోండి... కేంద్రానికి ఎంపీ లేఖ‌లు!

ఈ క్ర‌మంలో విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నాని కేంద్రానికి లేఖలు సంధించారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కు ఆయ‌న లేఖ రాశారు.

By:  Tupaki Desk   |   9 Sep 2023 7:28 AM GMT
చంద్ర‌బాబు అరెస్టును అడ్డుకోండి... కేంద్రానికి ఎంపీ లేఖ‌లు!
X

టీడీపీ అధినేత చంద్ర‌బాబును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేయ‌డం ప‌ట్ల రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నాయ కులు, శ్రేణులు తీవ్ర‌స్థాయిలో నిర‌స‌న తెలుపుతున్నారు. ఈ క్ర‌మంలో విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నాని కేంద్రానికి లేఖలు సంధించారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కు ఆయ‌న లేఖ రాశారు. అదేవిధంగా రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ముకు సైతం ఎంపీ నాని లేఖ రాశారు. చంద్ర‌బాబు అక్ర‌మ అరెస్టును నిలువ‌రించేలా ఆదేశాలు జారీ చేయాల‌ని ఆయ‌న అభ్య‌ర్థించారు.

''45 ఏళ్లుగా రాష్ట్ర రాజ‌కీయాల్లోనే కాకుండా.. దేశ‌వ్యాప్తంగా రాజ‌కీయాల్లో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌త‌ను సంత‌రిం చుకున్న చంద్ర‌బాబు నాయుడును ఏపీ సీఐడీ పోలీసులు అక్ర‌మంగా అరెస్టు చేశారు. 45 ఏళ్లుగా ఆయ‌నపై ఎలాంటి అవినీతి మ‌ర‌క‌లు లేవు. కానీ, రాష్ట్రంలోని వైసీపీ ప్ర‌భుత్వం ఉద్దేశ పూర్వ‌కంగా, క‌క్ష సాధింపు చ‌ర్య‌ల్లో భాగంగా చంద్ర‌బాబుపై కేసులు న‌మోదు చేసింది. ఈ చ‌ర్య‌ల‌ను నిలువ‌రించి, చంద్ర‌బాబు అరెస్టును అడ్డుకోండి'' అని ఎంపీ నాని త‌న లేఖ‌లో విన్న‌వించారు.

ఇదిలావుంటే, జగన్ ప్రభుత్వ పైశాచిక ఆనందం కోసమే పోలీసులు చంద్రబాబును అరెస్టు చేశారని మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ అన్నారు. అవనిగడ్డలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇది చీకటి రోజు అన్నారు. ఎఫ్ఐఆర్ లో పేరు లేకుండా, కనీసం ఏ కేసు చెప్పకుండా చంద్రబాబును అరెస్టు చేశారన్నారు.

రెండు లక్షల మంది యువతకు ఉపాధి కల్పించిన స్కిల్ డెవలప్మెంటులో అవినీతి జరిగిపోయిందంటూ ఐదేళ్లుగా దుష్ప్రచారం చేస్తున్న వైసీపీ అధికారంలోకి వచ్చి నాలుగున్నర్ర ఏళ్లలో నిరూపించలేక, అధికారులను వేధించి చంద్రబాబుకు వ్యతిరేకంగా సాక్ష్యాలు సృష్టించే కుట్రలు చేశారన్నారు.

ఇది న్యాయపరంగా నిలిచే కేసు కాదన్నారు. చంద్రబాబును అరెస్టు చేసి, ఆర్టీసీ బస్సులు ఆపేసి, ప్రయాణికులను ఇబ్బంది పెట్టి ఏం సాధించారని ప్రశ్నించారు. ఈ వైసీపీ ప్రభుత్వంలో కనీవినీ ఎరుగని స్థాయిలో సహజ వనరుల దోపిడీ సాగుతుంటే ప్రశ్నించిన తమను అరెస్టు చేశారన్నారు. ఈ దుర్మార్గపు, దుష్ట, దోపిడీ పాలనను వచ్చే ఎన్నికల్లో తరిమి కొట్టాలని బుద్ధప్రసాద్ విజ్ఞప్తి చేశారు. రాబోయే ఎన్నికలు తెలుగు వారి విచక్షణ జ్ఞానానికి, చైతన్యానికి ప్రతీక కావాలన్నారు.