Begin typing your search above and press return to search.

లోకేష్ పోటీ: మంగళగిరితో పాటు మరిన్ని ఆప్షన్లు...?

లోకేష్ టీం ఇతర సీట్లను ఆప్షన్ గా పెట్టుకుని ముందుకు వస్తోందని అంటున్నారు. క్రిష్ణా జిల్లాలో పెనమలూరు, అలాగే విజయవాడ ఈస్ట్ సీట్లను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారుట.

By:  Tupaki Desk   |   17 Oct 2023 4:16 AM GMT
లోకేష్ పోటీ:  మంగళగిరితో పాటు మరిన్ని ఆప్షన్లు...?
X

టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేస్తారా అంటే మరోమారు డౌట్లు వస్తున్నాయట. నిజానికి 2019లో మంగళగిరి నుంచి పోటీ చేసి మంత్రిగా ఉంటూ లోకేష్ ఓటమి పాలు అయ్యారు. ఈసారి అలాంటి పరిస్థితి రాకూడదని, ఎట్టి పరిస్థితుల్లోనూ తాను అసెంబ్లీలోకి అడుగుపెట్టాలని లోకేష్ భావిస్తున్నారని అంటున్నారు.

ఇక ఇటు తెలుగుదేశం పార్టీ కో అర్డినేషన్ కమిటీని ఒకటి ఏర్పాటు చేసింది. అలాగే జనసేన నుంచి కూడా కమిటీ ఉంది. ఈ రెండూ కూర్చుని ఏ పార్టీ ఎక్కడ బలంగా ఉంది. పొత్తుల లెక్కలేంటి అన్నవి చూస్తారని అంటున్నారు. దాంతో లోకేష్ మంగళగిరి సీటుతో పాటు ఇతర సీట్లను పరిశీలిస్తున్నారు అని ప్రచారం సాగుతోంది.

లోకేష్ టీం ఇతర సీట్లను ఆప్షన్ గా పెట్టుకుని ముందుకు వస్తోందని అంటున్నారు. క్రిష్ణా జిల్లాలో పెనమలూరు, అలాగే విజయవాడ ఈస్ట్ సీట్లను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారుట. ఇక్కడ లోకేష్ సామాజికవర్గం ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. అయితే పెనమలూరులో సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీ నేత పార్ధసారధి బలంగా ఉన్నారని అంటున్నారు. ఆ గ్రాఫ్ కూడా బాగుందని అంటున్నారు.

మరో వైపు చూస్తే విజయవాడ ఈస్ట్ నుంచి గద్దే రామ్మోహన్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అక్కడ పార్టీ బలంగానే ఉంది. దాని మీద లోకేష్ టీం చూపు ఉందని అంటున్నారు. గుడివాడ నుంచి పోటీ చేయమని మరో ప్రతిపాదన ఉన్నా కొడాలి నాని సీట్లో పోటీ చేస్తే గెలుపు అన్నది ఒక సవాల్ గా మారుతుంది అన్నది ఆలోచిస్తున్నారుట.

ఇక వీటికి మించి ట్విస్ట్ ఏంటి అంటే హిందూపురం సీటు. ఇక్కడ రెండు సార్లు బాలక్రిష్ణ ఎమ్మెల్యేగా నెగ్గారు. 2019లో జగన్ వేవ్ లో సైతం హిందూపురం నుంచి గెలిచారు. దాంతో ఈ సీటు మీద లోకేష్ మక్కువ కనబరుస్తున్నారు అని అంటున్నారు. అయితే బాలయ్య మాత్రం తాను 2024 ఎన్నికల్లో మరోసారి పోటీ చేసి గెలుస్తాను అని చెబుతున్నారుట.

దాంతో బాలయ్య సీటు వదులుకోకపోతే లోకేష్ టచ్ చేస్తారా అన్నది ఒక ప్రశ్నగా ఉంది. ఏది ఏమైనా లోకేష్ ఈసారి పోటీ చేయబోయే సీటు ఇప్పటిదాకా మంగళగిరి అని అనుకుంటే ఇపుడు కొత్తగా మరో నాలుగు ఆప్షన్లు ముందుకు వస్తున్నాయి. అయితే జనసేన టీడీపీ బలంగా ఉన్న మరిన్ని సీట్లను కూడా లోకేష్ టీం పరిశీలిస్తోంది అని అంటున్నారు.

ఇక టీడీపీ సీనియర్లతో కూడిన కో ఆర్డినేషన్ కమిటీ లోకేష్ పోటీ చేసే సీటు మీద ఏమైనా తేల్చుతుందా ఏ రకమైన సూచనలు ఇస్తుంది అన్నది కూడా చూడాల్సి ఉంది. ఈసారి ఎన్నికల్లో సులువుగా గెలిచే సీటు ఎంచుకుంటే ఎన్నికల్లో ప్రచారాన్ని విస్తృతంగా చేయవచ్చు అన్నది లోకేష్ ఆలోచనగా చెబుతున్నారు