Begin typing your search above and press return to search.

మోడీ క‌న్నా.. మ‌న్మోహ‌నే న‌యం.. విష‌యం సీరియ‌స్‌!

దీనిపై ఇరాన్‌-అమెరికా ఉడుం ప‌ట్టుప‌ట్టాయి. పంతానికి పోతున్నాయి. ఒక‌వైపు చ‌ర్చ‌లు జ‌రుగుతున్నా కొలిక్కి రావ‌డం లేదు. మ‌రోవైపు అమెరికా ఇరాన్‌పై దాడులు చేస్తోంది.

By:  Tupaki Desk   |   13 Jun 2026 8:00 AM IST
మోడీ క‌న్నా.. మ‌న్మోహ‌నే న‌యం.. విష‌యం సీరియ‌స్‌!
X

ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున వినిపిస్తున్న మాట ఇదే. ఒక్క సోష‌ల్ మీడియాలోనే కాదు.. జాతీయ‌స్తాయి మీడి యాలో జ‌రుగుతున్న‌ చ‌ర్చ‌ల్లోనూ.. ఇదే మాట ప్ర‌ధానంగా వినిపిస్తోంది. ``మోడీ క‌న్నా.. మ‌న్మోహ‌నే న‌యం..`` అంటూ.. కామెంట్లు కురుస్తున్నాయి. గ‌తంలో 10 సంవ‌త్స‌రాలు02004-2014) దేశ ప్ర‌ధానిగా ప‌నిచేసిన మ‌న్మోహ‌న్‌.. మౌన‌మునిగా పేరు తెచ్చుకున్నారు. ఎక్క‌డ ఏంజ‌రిగినా.. ఆయ‌న పెద్ద‌గా నోరువిప్పేవారు కాదు. దీంతో ఆయ‌న‌పై `మౌన ప్ర‌ధాని`గా.. `చ‌ల‌నం లేని ప్ర‌ధాని`గా కూడా ముద్ర వేశారు. కానీ, ప్ర‌స్తుత ప్ర‌ధాని మోడీ విష‌యానికి వ‌స్తే.. మాత్రం ఆయ‌న స్పందిస్తారు. బిగ్గ‌ర‌గా మాట్లాడ‌తారు.

అంతేకాదు.. విష‌యం ఏదైనా.. ఆయ‌న మాటల‌తో ఉక్కిరిబిక్కిరి చేస్తారు. స‌మ‌యానికి త‌గిన విధంగా స్పందించే ప్ర‌ధానిగా కూడా ఆయ‌న పేరు తెచ్చుకున్నారు. మ‌రి అలాంటి నాయ‌కుడు.. ఇప్పుడు ఎందుకు బ్యాడ‌య్యారు. ఒక్క‌సారిగా ఆయ‌నను గ‌త ప్ర‌ధాని మ‌న్మోహ‌న్‌తో పోల్చి ఎందుకు ఎద్దేవా చేస్తున్నారు. జాతీయ‌స్థాయిలో సైతం.. మోడీని ఎందుకు తూర్పార‌బ‌డు తున్నారు? అనేది కీల‌క అంశం. తాజాగా 12 ఏళ్లు వ‌రుస‌గా ప్ర‌ధాని పీఠంపై కూర్చున్న నాయ‌కుడిగా రికార్డు సృష్టించిన మోడీకి ఇప్పుడు ఎందుకు ఇంత వ్య‌తిరేక‌త వ‌చ్చింద‌న్న‌ది ప్ర‌శ్న‌. ప్ర‌స్తుతం మోడీని విమ‌ర్శిస్తున్న వారిలో మాజీ సైనిక అధికారులు కూడా ఉన్నారంటే ఆశ్చ‌ర్యం వేస్తుంది.

ఏం జ‌రిగింది?

ప‌శ్చిమాసియాలో నెల‌కొన్న వివాదం నేప‌థ్యంలో కీల‌క‌మైన హోర్ముజ్ జ‌ల‌సంధిలో నౌక‌ల ర‌వాణా నిలిచిపోయింది. దీనిపై ఇరాన్‌-అమెరికా ఉడుం ప‌ట్టుప‌ట్టాయి. పంతానికి పోతున్నాయి. ఒక‌వైపు చ‌ర్చ‌లు జ‌రుగుతున్నా కొలిక్కి రావ‌డం లేదు. మ‌రోవైపు అమెరికా ఇరాన్‌పై దాడులు చేస్తోంది. ఈ నేప‌థ్యంలో ఇరాన్ మ‌రింత‌గా ఆంక్ష‌లు పెంచి.. హార్ముజ్ జ‌ల‌సంధిని అష్ట‌దిగ్బంధ‌నం చేసింది. దీంతో భార‌త‌దేశానికి చెందిన నౌక‌లు సైతం.. అక్క‌డే ఆగిపోయాయి. ఈ క్ర‌మంలో గ‌త మూడు రోజులుగా ఈ జ‌లాల్లోని నౌక‌ల‌పై అమెరికా సైన్యం విచ‌క్షణార హితంగా దాడులు చేసింది. వాస్త‌వానికి భార‌త్‌కు చెందిన నౌక‌ల‌పై దాడులు జ‌ర‌ప‌బోమ‌ని చెప్పిన 24 గంటల్లోనే భార‌త్‌కే చెందిన నౌక‌ల‌పై అమెరికా దాడులు చేసింది.

ఆయా ఘ‌ట‌న‌ల్లో ముగ్గురు నావికులు స‌ముద్ర జ‌లాల్లోనే ప్రాణాలు కోల్పోయారు. అయితే.. ఇంత జ‌రుగుతున్నా.. ప్ర‌ధాని మోడీ మౌనంగా ఉండ‌డాన్ని విప‌క్షాలు నిల‌దీస్తున్నారు. అమెరికాను ప‌న్నెత్తు మాట కూడా అన‌లేక పోతున్నార‌ని.. దౌత్య ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోలేక పోతున్నార‌ని దుయ్య‌బ‌డుతున్నారు. అమెరికా సైన్యం.. భార‌తదేశంపై దాడి చేసినా.. భ‌ర‌త మాత బిడ్డ‌ల‌నునిలువునా చంపినా.. మోడీ ఇలానే ఉంటారా? అని ప‌లువురు విశ్లేష‌కులు ప్ర‌శ్నిస్తున్నారు. ఇక‌, కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత రాహుల్ గాంధీ అయితే.. నిప్పులు చెరిగారు. ``బ‌ల‌హీన ప్ర‌ధాని.. అస‌మ‌ర్థ ప్ర‌ధాని.. అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్‌తో రాజీ ప‌డ్డ ప్ర‌ధాని`` అంటూ వ్యాఖ్య‌లు చేశారు.

ఇప్పుడే కాదు..

+ అమెరికా విష‌యంలో ప్ర‌ధానిమోడీ ఇంత మౌనంగా వ్య‌వ‌హ‌రించ‌డం ఇప్పుడే కొత్త‌కాదు. గ‌త ఏడాది ఆప‌రేష‌న్ సిందూర్ ప్రారంభించిన‌.. నిలుపుద‌ల చేసిన స‌మ‌యంలో తానే పాక్‌, భార‌త్ మ‌ధ్య యుద్ధం ఆపాన‌ని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ ప్ర‌క‌టించారు. తానే హెచ్చ‌రించ‌డంతో భార‌త్ దారికి వ‌చ్చింద‌ని వాచాల‌త్వం ప్ర‌ద‌ర్శించారు. అప్పుడు కూడా మోడీ మౌనంగానే ఉన్నారు.

+ ఇక‌, ర‌ష్యా నుంచి చ‌మురు కొనుగోళ్ల‌ను ఆపేయ‌క‌పోతే.. భార‌త్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తామ‌ని హెచ్చ‌రించ‌డంతో చ‌మురు కొనుగోళ్లు ఆపింద‌ని గ‌తంలో ట్రంప్ చెప్పారు. దీనిపైనా మోడీ మౌన‌మే ప్ర‌ద‌ర్శించారు.

+ భార‌త దిగుమ‌తుల‌పై ట్రంప్ 100 శాతం సుంకాలు విధించినా.. మోడీ పెద‌వి విప్ప‌లేదు.. పూర్తిగా మౌనం పాటించారు.

+ విశాఖ‌లో నేవీ కార్య‌క్ర‌మానికి వ‌చ్చి తిరిగి వెళ్తున్న ఇరాన్ నావికా సిబ్బందిపై భార‌త ప్రాదేశిక జ‌లాల్లో అమెరికా దాడి చేసి.. నిలువునా.. వారిని చంపేసిన‌ప్పుడు కూడా.. మోడీ మౌనంగానే ఉండిపోయారు. ఇలా.. వ్య‌వ‌హ‌రించ‌డాన్ని.. ఇప్పుడు జాతీయ మీడియా స‌హా.. సోష‌ల్ మీడియా దుయ్య‌బ‌డుతోంది.