Begin typing your search above and press return to search.

వీడియో వైరల్...వైసీపీ మహిళా ఎమ్మెల్యే క్లారిటీ...!

అది వీర లెవెల్ లో హైలెట్ కావడంతో సదరు ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి ఘాటుగానే రియాక్ట్ అయ్యారు. ఇదంతా టీడీపీ నేతలు చేస్తున్న దిగజారుడు రాజకీయం అని పుష్ప శ్రీవాణి ఫైర్ అయ్యారు.

By:  Tupaki Desk   |   16 Dec 2023 4:37 PM GMT
వీడియో వైరల్...వైసీపీ మహిళా ఎమ్మెల్యే క్లారిటీ...!
X

ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ రాజకీయాలు ముదురుతున్నాయి. ఆధునిక సాంకేతికతను అసరా చేసుకుని కొత్త రకం వ్యూహాలకు తెర లేపుతున్నారు. దాంతో ఈ ఆర్టిఫీషియల్ టాలెంట్ తో ప్రత్యర్ధులకు గురి పెడుతున్నారు. అయితే తాము కానివి అనలేనివి ఇలా కృత్రిమంగా చేసి తమను బదనాం చేస్తున్నారు అని బాధితులు మండిపడుతున్నారు.

ఉమ్మడి విజయనగరం జిల్లా కురుపాం ఎమ్మెల్యే, మాజీ ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి మీద సోషల్ మీడియాలో టీడీపీ వైరల్ చేస్తున్న వీడియో ఒకటి ఇపుడు చక్కర్లు కొడుతోంది. ఆ వీడియొలో పుష్ప శ్రీవాణి ఈ ప్రభుత్వంలో ఎమ్మెల్యే అయినందుకు చనిపోవాలని ఉంది అని కామెంట్స్ చేశారు. దీంతో వైసీపీ ప్రభుత్వం మీద సొంత పార్టీ ఎమ్మెల్యేనే ఇంత పెద్ద ఎత్తున అసంతృప్తితో ఉన్నారని టీడీపీ ప్రచారం చేస్తోంది.

అది వీర లెవెల్ లో హైలెట్ కావడంతో సదరు ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి ఘాటుగానే రియాక్ట్ అయ్యారు. ఇదంతా టీడీపీ నేతలు చేస్తున్న దిగజారుడు రాజకీయం అని పుష్ప శ్రీవాణి ఫైర్ అయ్యారు. తాను 2018లో ఈ వ్యాఖ్యలు చేశాను అని ఆమె చెప్పుకొచ్చారు. అంటే ఆనాడు టీడీపీ ప్రభుత్వం మీద చంద్రబాబు మీద తాను చేసిన కామెంట్స్ అని ట్విస్ట్ చేసి వైసీపీ ప్రభుత్వం మీద జగన్ మీద తాను అన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు అని పుష్ప శ్రీవాణి తీవ్రంగా ఖండించారు.

ఇటువంటి దుష్ప్రచారానికి పాల్పడుతూ టీడీపీ రాక్షస ఆనందం పొందుతోంది అని ఆమె ఘాటుగానే రియాక్ట్ అయ్యారు. తాను జగన్ ప్రభుత్వం మీద ఎట్టి పరిస్థితుల్లోనూ విమర్శలు చేయలేదని చేయబోను అని ఆమె అంటున్నారు.

ఇదిలా ఉంటే పుష్ప శ్రీవాణికి ఈసారి టికెట్ దక్కదని కూడా ఒక వైపు ప్రచారం జరుగుతోంది. అది కూడా టీడీపీ అనుకూల మీడియా లోనే వస్తోంది. ఆమె వైసీపీలో ఉన్న బలమైన నాయకురాలు. కురుపాం నుంచి 2014, 2019లలో రెండు సార్లు గెలిచారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆమెకు మరోసారి టికెట్ ఇస్తారని అంటున్న నేపధ్యం ఉంది.

అయినా సరే ఆమెకు టికెట్ రాదు అని ప్రచారం చేయడంతో పాటు ఆమె అనని మాటలను వైరల్ చేయడం వెనక భారీ కుట్ర దాగుందని పుష్ప శ్రీవాణి వర్గీయులు అంటున్నారు. ఇక కురుపాంలో టీడీపీకి బలమైన నేత అయితే లేరు. వచ్చే ఎన్నికల్లో సమర్ధుడైన నేతను పోటీకి పెట్టకపోతే ఓటమి ఖాయమని అంటున్నారు. తమ బలహీనతలను కప్పిపుచ్చుకొవడానికే ఇలా బురద జల్లుతున్నారని పుష్ప శ్రీవాణి వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.