Begin typing your search above and press return to search.

సరికొత్త సాంకేతికత.. ఏమిటీ మివి ఏఐ?

ఇప్పటి వరకు మనం విన్నది ఏఐ గురించే. ఇప్పుడు దాని తర్వాతి లెవల్ పరిచయం చేయటానికి ప్రయత్నించి సక్సెస్ అయ్యిందో హైదరాబాద్ టెక్ సంస్థ.

By:  Tupaki Desk   |   12 April 2025 10:21 AM IST
సరికొత్త సాంకేతికత.. ఏమిటీ మివి ఏఐ?
X

ఇప్పటి వరకు మనం విన్నది ఏఐ గురించే. ఇప్పుడు దాని తర్వాతి లెవల్ పరిచయం చేయటానికి ప్రయత్నించి సక్సెస్ అయ్యిందో హైదరాబాద్ టెక్ సంస్థ. ఏఐకి మీవీ సాంకేతికతను జోడించి సిద్ధం చేసిన టూల్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గడిచిన కొంతకాలంగా రాజ్యమేలుతున్న కృత్రిమ మేధ తర్వాతి తరంగా చెప్పే ఈ సాంకేతికతలోకి వెళితే.. ఏఐ సాంకేతికతతో మనం ప్రశ్నల్ని టైప్ చేస్తే.. వాటికి సమాధానాల్ని ఇస్తుంది. అది కూడా అక్షర రూపంలో. ఇది అందరికి తెలిసిందే.

దీనికి భిన్నంగా ఒక వ్యక్తిలా ఆలోచించి.. సంభాషించేలా సరికొత్త ఏఐని సిద్ధం చేసింది హైదరాబాద్ కు చెందిన ఎలక్ట్రటానిక్ బ్రాండ్ సంస్థ మీవి. దీన్ని ఏఐ మీవీగా ఆ సంస్థ అభివర్ణిస్తోంది. ఈ టెక్నాలజీని డెవలప్ చేసిన సంస్థకు సహ వ్యవస్థాపకులు కం సీఎంఓ మిధులా. ఏఐ రీసెర్చ్.. డెవలప్ మెంట్ లో ఇదో కీలక అడుగుగా పేర్కొంటున్నారు. ఆధునాతన లాంగ్ లాంగ్వేజ్ మోడల్ (ఎల్ఎల్ఎం)తో దీన్ని ఆవిష్కరించినట్లుగా పేర్కొన్నారు.

తాము రూపొందించిన మీవీ ఏఐలో మనిషి భావోద్వేగాల్ని అర్థం చేసుకొని.. అందుకు తగ్గట్లు సమాధానాలు ఇస్తుందని.. ఎన్నో రకాల యాసలకు అనుగుణంగా తమ టూల్ ను సిద్ధం చేసినట్లుగా ఆమె చెబుతున్నారు. అంతేకాదు.. ప్రత్యేకంగా హాయ్ మివి అనే వేక్ వర్డ్ ను రూపొందించినట్లుగా పేర్కొన్నారు. ప్రపంచంలో కొన్ని ప్రముఖ సంస్థలే వేక్ వర్డ్ ను తీసుకొచ్చాయని.. అందుతో తమ సంస్థ చేరినట్లుగా ఆమె చెబుతున్నారు.

తమ సంస్థలో 1500 మందికి పైగా పని చేస్తున్నారని.. మివి ఏఐ కోసం వంద మంది ఇంజనీర్లు పని చేసినట్లుగా పేర్కొన్నారు. దీని కోసం తాము రూ.86 కోట్ల నిధుల్ని ఖర్చు చేసినట్లుగా చెబుతున్న ఆమె.. తాము రూపొందించిన సాంకేతికతో రానున్న రోజుల్లో స్మార్ట్ హోం పరికరాలు.. వినియోగదారుల సేవాకేంద్రాలతో పాటు.. ఇతర ఏఐ ఆధారిత ఉత్పత్తుల్లో వినియోగించే వీలుందని చెబుతున్నారు.