Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ పాటకు ఫిదా అయిన ప్రపంచ సుందరీమణులు..'దేవర' డ్యాన్స్ హైలైట్

ఈ క్రమంలోనే గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో స్పోర్ట్స్ ఫైనల్ ఈవెంట్‌ను నిర్వహించారు.

By:  Tupaki Desk   |   17 May 2025 5:54 PM IST
ఎన్టీఆర్ పాటకు ఫిదా అయిన ప్రపంచ సుందరీమణులు..దేవర డ్యాన్స్ హైలైట్
X

హైదరాబాద్‌లో ప్రస్తుతం ప్రపంచ సుందరీమణుల సందడి నెలకొంది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ పోటీల్లో పలు దేశాల నుంచి వచ్చిన అందగత్తెలు పాల్గొంటున్నారు. గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఈ పోటీల్లో వీరు ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలువురు కాంగ్రెస్ మంత్రులు హాజరవుతున్నారు. ఈ అందగత్తెలను హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లి, అక్కడి విశేషాలను చూపిస్తున్నారు.

ఈ క్రమంలోనే గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో స్పోర్ట్స్ ఫైనల్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. ముఖ్యంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన 'దేవర' సినిమాలోని ఓ మాస్ పాటకు వీరు అదిరిపోయే స్టెప్పులేశారు. అంతేకాదు, తెలంగాణలోని కొన్ని ట్రెండింగ్ డీజే పాటలకు కూడా ఈ సుందరీమణులు డ్యాన్స్ చేసి అలరించారు.

'దేవర' పాటకు వీరు డ్యాన్స్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. స్పోర్ట్స్ ఈవెంట్‌లో తమ శక్తిసామర్థ్యాలను ప్రదర్శించిన ఈ అందగత్తెలు క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకుంటారు. చివరికి ఎవరు విజేతలుగా నిలుస్తారో చూడాలి.

ఇదిలా ఉండగా, ఎన్టీఆర్ ప్రస్తుతం 'వార్ 2' సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత ఆయన 'దేవర 2' సినిమా షూటింగ్‌లో పాల్గొంటారు. 'దేవర' సినిమా మంచి విజయం సాధించడంతో, దీనికి సీక్వెల్‌గా 'దేవర 2'ను తెరకెక్కిస్తున్నారు. మొదటి భాగం సక్సెస్ సాధించడంతో ఈ సీక్వెల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఇందులో ఎన్టీఆర్ హీరోగా నటిస్తుండగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.