Begin typing your search above and press return to search.

భువనేశ్వరిదీ తనదీ ఒకటేకోరికంటున్న రోజా.. కామెంట్స్ వైరల్!

భువనేశ్వరి నిజం గెలవాలని గట్టిగా పూజలు చేసినట్లున్నారు అని స్పందించిన మంత్రి రోజా... తాను కూడా నిజం గెలవాలనే కోరుకుంటున్నట్లు తెలిపారు

By:  Tupaki Desk   |   24 Oct 2023 8:33 AM GMT
భువనేశ్వరిదీ తనదీ ఒకటేకోరికంటున్న రోజా.. కామెంట్స్ వైరల్!
X

ఏపీలో రాజకీయ పరిణామాలు రోజు రోజుకీ ఆసక్తికరంగా మారుతున్నాయి. స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టైన చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటున్న నేపథ్యంలో... ఊహించని విధంగా నారా భువనేశ్వరి తెరమీదకు వచ్చారు. ఇందులో భాగంగా వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఇదే సమయంలో "నిజం గెలవాలి" అని యాత్ర మొదలుపెట్టబోతున్నారు! దీంతో ఈ విషయాలపై మంత్రి రోజా స్పందించారు.

అవును చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి చేపట్టనున్న "నిజం గెలవాలి" యాత్ర బుధవారం నుంచి ప్రారంభం కానుంది. చంద్రగిరి నియోజకవర్గం నుంచి ఈ యాత్రకు ఆమె శ్రీకారం చుట్టనున్నారు. ఈ సమయంలో తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. దీంతో ఈ వ్యవహారంపై మంత్రి ఆర్కే రోజా స్పందించారు. ఇందులో భాగంగా తనదైన శైలిలో కామెంట్స్ చేశారు. నిజంగా భువనేశ్వరి కోరుకున్నదే జరగాలని తానూ కోరుకుంటున్నానని అన్నారు!

భువనేశ్వరి నిజం గెలవాలని గట్టిగా పూజలు చేసినట్లున్నారు అని స్పందించిన మంత్రి రోజా... తాను కూడా నిజం గెలవాలనే కోరుకుంటున్నట్లు తెలిపారు. నిజంగా నిజం గెలిస్తే చంద్రబాబు నాయుడు జీవితాంతం జైల్లోనే ఉంటాడని రోజా అభిప్రాయపడ్డారు. ఆయనతోపాటు లోకేష్, భువనేశ్వరి కూడా లోపలికి వెళ్లే అవకాశాలున్నాయని రోజా తెలిపారు. నిజంగా నిజం గెలవాలని భువనేశ్వరి కి ఉంటే... సీబీఐ ఎంక్వైరీ వేసుకుంటే ఇంకా బాగా గెలుస్తుంది అన్నారు!

ఇదే సమయంలో స్కిల్ డెవలప్ మెంట్ స్కాం మీద సీబీఐ ఎంక్వైరీ వేయించుకుంటే... నిజం తప్పకుండా గెలుస్తుందని తెలియజేశారు. అదేవిధంగా... ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ కేసుపై కూడా సీబీఐ ఎంక్వైరీ వేసుకుంటే... హెరిటేజ్ లో ఉన్న అందరూ జైలుకెళ్లే అవకాశం దొరుకుతుందని, నిజం గెలుస్తుందని మంత్రి రోజా తెలిపారు.

తండ్రి మీద చెప్పులేసినప్పుడే, తండ్రి నుంచి పార్టీని లాక్కున్నప్పుడే తండ్రి చావుకి కారణమైనప్పుడు వీళ్లు హ్యాపీగా ఉన్నారని, ఎక్కడా బాధ అనేది కనిపించలేదని నందమూరి తారకరామారావు సంఘటనను గుర్తుచేశారు రోజా! ఫ్యాషన్ షో లకు వెళ్ళినట్టు, ప్రజల కోసం వీళ్ళు రోడ్డు మీదకు రాలేరని కామెంట్స్ చేశారు. ఇలాంటి వాళ్లు రాష్ట్ర ప్రజల కోసం ఏం కష్టపడగలరు అంటూ రోజా నిలదీశారు.

ఇక, రాజమండ్రిలో పవన్ కల్యాణ్, లోకేష్ లు కలిసి భేటీ అయిన దృశ్యం చూస్తే... పాడుతా తీయగా సెలక్షన్ కి అటొక బ్యాచ్, ఇటొక బ్యాచ్ కూర్చున్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు! అంటే... అర సున్నా, అర సున్నా కూర్చుని లోపలున్న గుండు సున్నా కోసం దిశానిర్ధేశం గురించి మాట్లాడుకుంటుంటే ప్రజలు చాలా ఫన్నీగా ఫీలవుతున్నారని రోజా అన్నారు. కారణం... వీరిద్దరూ కూడా ప్రజలచేత చీత్కరించబడిన వారని రోజా అన్నారు.