Begin typing your search above and press return to search.

చైనాను వదిలి వచ్చేయండి... మైక్రోసాఫ్ట్ రిక్వస్ట్ కి కారణం ఇదేనా?

చైనాను విడిచి రావాలంటూ అక్కడున్న తమ సంస్థ ఉద్యోగులను మైక్రోసాఫ్ట్ కోరింది

By:  Tupaki Desk   |   16 May 2024 11:55 AM GMT
చైనాను వదిలి వచ్చేయండి... మైక్రోసాఫ్ట్ రిక్వస్ట్ కి కారణం ఇదేనా?
X

చైనాను విడిచి రావాలంటూ అక్కడున్న తమ సంస్థ ఉద్యోగులను మైక్రోసాఫ్ట్ కోరింది. ఈ కోరిక ఒకెత్తు అయితే.. అందుకు గల కారణాలు ఆసక్తిగా మారాయి. జో బిడెన్ పరిపాలన చైనా దిగుమతుల యొక్క అనేక రంగాలపై ఆంక్షలు విధించడంతో, యూఎస్-చైనా ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ అభ్యర్థన చేయబడిందని తెలుస్తుంది. దీంతో మేటర్ మరింత సీరియస్ గా మారిందని అంటున్నారు.

అవును... మైక్రోసాఫ్ట్ తన చైనా ఆధారిత ఉద్యోగులలో సుమారు 700 నుండి 800 మందిని, ప్రధానంగా చైనీస్ జాతీయతకు చెందిన ఇంజనీర్లను ఇతర దేశాలకు మారడాన్ని పరిశీలించమని అభ్యర్థించినట్లు తెలుస్తుంది. టెక్నాలజీపైనా యూఎస్ - చైనా మధ్య ఆంక్షలు మొదలయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ ఈ ప్రకటన చేసినట్లు తెలుస్తుంది.

ఈ ఉద్యోగులు అంతా ప్రధానంగా యూఎస్, ఆస్ట్రేలియా, ఐర్లాండ్, న్యూజిలాండ్‌ తో సహా పలు దేశాలకు మారాలని ఆప్షన్స్ ఇచ్చింది. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ మంగళవారం వివిధ చైనా దిగుమతులపై గణనీయమైన సుంకాలను పెంచుతున్నట్లు ప్రకటించారు. ప్రభావిత ఉత్పత్తులలో ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీలు, సెమీకండక్టర్లు, ఫేస్ మాస్క్‌ లు, మెడికల్ గ్లోవ్‌ లు, సిరంజిలు, సూదులు వంటి అనేక రకాల వైద్య పరికరాలు ఉన్నాయని అంటున్నారు.

కాగా... అమెరికన్ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సుమారు 20 సంవత్సరాలకు పైగా చైనాలో తమ ఉనికిని కలిగి ఉంది. ఇదే సమయంలో 1992లో మార్కెట్లోకి ప్రవేశించిన మైక్రోసాఫ్ట్... యూఎస్ వెలుపల అతిపెద్ద ఆర్ & డీ కేంద్రం చైనాలో ఉంది. మరోపక్క చైనా నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ సాఫ్ట్ వేర్ ఎగుమతిపై ఆంక్షలు విధించాలని యూఎస్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.