Begin typing your search above and press return to search.

ఈగిల్ ఆపరేషన్: తెనాలిలో డ్రగ్స్ పట్టివేత.. అందరూ కుర్రాళ్లే

తాజాగా డ్రగ్స్ కేసులో పట్టుబడిన వారంతా యువకులే కావటం గమనార్హం. వీరి కుటుంబాలకు ఎలాంటి నేర చరిత్ర లేనివే కాదు..

By:  Garuda Media   |   16 April 2026 11:05 AM IST
ఈగిల్ ఆపరేషన్: తెనాలిలో డ్రగ్స్ పట్టివేత.. అందరూ కుర్రాళ్లే
X

ఇప్పటివరకు నగరాలు.. పెద్ద పట్టణాల్లో మాత్రమే వెలుగు చూసే డ్రగ్స్.. తాజాగా తెనాలి లాంటి టైర్ 2 పట్టణాల్లోనూ చూడటం ఇప్పుడు అందరిని షాక్ కు గురి చేసేలా చేసింది. తాజాగా డ్రగ్స్ కేసులో పట్టుబడిన వారంతా యువకులే కావటం గమనార్హం. వీరి కుటుంబాలకు ఎలాంటి నేర చరిత్ర లేనివే కాదు.. బయటకు పెద్దగా రారన్న పేరుంది. తమ పని మాత్రం తాము చేసుకోయే తీరుకు భిన్నంగా ఈగిల్ అధికారుల దాడుల్లో ఐదు గ్రాముల డ్రగ్స్ కొరియర్ పాకెట్ ను స్వాధీనం చేసుకున్నారు.

విశ్వసనీయ సమాచారం ఆధారంగా అధికారులు వల పన్నారు. ఈ విషయం గురించి అవగాహన లేని వారంతా.. పార్సిల్ ఆఫీసుకు చేరుకున్నారు. డ్రగ్స్ పార్సిల్ ను తీసుకున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. కర్ణాటక రాజధాని బెంగళూరు నుంచి తెనాలికి డ్రగ్స్ తెప్పిస్తున్నట్లుగా సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు మంగళవారం రాత్రి సుల్తానాబాద్ వద్ద కాపు కాశారు. ఒక వ్యక్తి ఇచ్చిన చిన్న పార్సిల్ ను తీసుకుంటున్న ముగ్గురిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

సదరు పార్సిల్ లో ఐదు గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తమకు గతంలో డ్రగ్స్ తీసుకున్న అనుభవం ఉందని.. తమ అవసరాల కోసం తెప్పించినట్లుగా పోలీసుల విచారణలో తెలిపినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు బెంగళూరుకు చెందిన వ్యక్తికి రూ.14వేలు ఫోన్ పే చేసినట్లుగా తెలుస్తోంది. ఇక.. నిందితుల వివరాల్లోకి వెళితే..తెనాలిలోని మారీసుపేటకు చెందిన సంతోష్ హోటల్ మేనేజ్ మెంట్ కోర్సు చేస్తూ నందివెలుగులో హోటల్ నిర్వహిస్తున్నాడు. సంతోష్ తో పాటు తెనాలికి చెందిన అజయ్ కుమార్.. కొత్తపేటకు చెందిన బీటెక్ స్టూడెంట్ దత్తసాయి మహంత్ మరికొందరు కలిసి బెంగలూరు నుంచి డ్రగ్స్ తెప్పిస్తున్నట్లు గుర్తించారు. అంతేకాదు.. వీరి నివాసానికి చుట్టపక్కల వారిని ఆరా తీస్తున్నారు. మొత్తంగా చెప్పాలంటే తెనాలి లాంటి ఊళ్లో ఇలా డ్రగ్స్ ను స్వాధీనం చేసుకోవటం షాకింగ్ గా మారింది.