Begin typing your search above and press return to search.

జగన్ బామ్మర్ది లోకేష్ తో భేటీ!

అవును... ఏపీ మంత్రి నారా లోకేష్ తో సమావేశమైనట్లు హీరో మంచు విష్ణు వెల్లడించారు. ఈ సందర్భంగా.. ఇద్దరూ కలిసి ఉన్న ఫోటోను షేర్ చేశారు.

By:  Tupaki Desk   |   30 Nov 2024 8:28 AM GMT
జగన్  బామ్మర్ది లోకేష్  తో భేటీ!
X

ఇటీవల తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందన్న ఆరోపణలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై రాజకీయ నాయకులతో పాటు పలువురు సినీ ప్రముఖులూ వారి వారి స్పందనను తెలియజేశారు. ఈ సందర్భంగా స్పందించిన మోహన్ బాబు.. చంద్రబాబుపై ఆసక్తికర ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.

ఇందులో భాగంగా... వినిపిస్తున్న ఆరోపణలు నిజమైతే నేరస్థులను శిక్షించాలని నా ఆత్మీయుడు, నా మిత్రుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని హృదయపూర్వకంగా కోరుకుంటూ.. ఈ కలియుగ దైవం వేంకటేశ్వర స్వామి ఆశీస్సులు నా మిత్రుడు అందుకుని నూరేళ్లు చల్లాగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

దీంతో... ఏపీ రాజకీయాల్లో ఆ ట్వీట్ వైరల్ గా మారింది. నారా - మంచు కుటుంబాల మధ్య తిరిగి పూర్తిస్థాయి సఖ్యత వచ్చేసినట్లుందనే చర్చా మొదలైంది. ఈ నేపథ్యంలో తాజాగా మంచు విష్ణు.. ఏపీ మంత్రి నారా లోకేష్ ను కలిశారు! దీనికి సంబంధించిన ఫోటోను ఎక్స్ లో పోస్ట్ చేస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అవును... ఏపీ మంత్రి నారా లోకేష్ తో సమావేశమైనట్లు హీరో మంచు విష్ణు వెల్లడించారు. ఈ సందర్భంగా.. ఇద్దరూ కలిసి ఉన్న ఫోటోను షేర్ చేశారు. తన సోదరుడు, డైనమిక్ విద్యాశాఖ మంత్రి లోకేష్ తో సానుకూల వాతావరణంలో పలు అంశాలపై మాట్లాడినట్లు తెలిపారు. లోకేష్ పాజిటివ్ ఎనర్జీ అద్భుతమంటూ మంచు విష్ణు కొనియాడారు.

ఇదే క్రమంలో... నారా లోకేష్ కు దేవుడు మరింత శక్తి ఇవ్వాలని కోరుకుంటున్నట్లు ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఈ పోస్ట్ వైరల్ గా మారింది. నారా లోకేష్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఉండటం.. మంచు విష్ణుకు విద్యాసంస్థలు ఉండటంతో వీరి భేటీపై ఆన్ లైన్ వేదికగా ఆసక్తికర చర్చలు మొదలయ్యాయి.

మరోపక్క... గతంలో మా బావ జగన్ అని, వాళ్ల చెల్లెను తాను వివాహం చేసుకున్నానని గర్వంగా చెప్పుకున్న మంచు విష్ణు.. ఇప్పుడు బావని కాదని లోకేష్ ను కలవడం ఏమిటో అనే కామెంట్లూ మొదలయ్యాయి.