Begin typing your search above and press return to search.

మన కాపులు...జగన్ మార్క్ మాస్టర్ స్టెప్!

By:  Tupaki Desk   |   12 Oct 2023 5:30 PM GMT
మన కాపులు...జగన్ మార్క్  మాస్టర్ స్టెప్!
X

ఏపీలో కాపులకు కావాల్సింది ఏమిటి అంటే రాజ్యాధికారం. ఇది స్థూలంగా ఎవరైనా చెప్పే మాట. రాజకీయాల మీద సామాజిక పరిస్థితుల మీద అవగాహన ఉన్న వారు ఎవరైనా ఇదే అంటారు. ఏడున్నర దశాబ్దాల తెలుగు రాజకీయాలలో ముఖ్యమంత్రి కుర్చీ కాపులకు అందని పండుగా ఉంది.

ఎవరైనా తమ కులస్థుడు వచ్చి సీఎం అవుతాను అంటే కాపులంతా పూర్తి స్థాయిలో సమర్ధించడానికి సిద్ధం. ఇది 2009లో ప్రజారాజ్యం టైం లో రుజువు అయింది. 2019లో కూడా జనసేనకు కాపులలో ఒక సెక్షన్ గట్టిగా బలపరచబట్టే ఏడు శాతం ఓట్లు వచ్చాయి. కానీ పొత్తుల ఎత్తులతో జనసేన ఉంది.

దాని వల్ల ఈసారి ఏపీకి సీఎం ఎవరు అవుతారు అంటే అయితే జగన్ లేకపోతే చంద్రబాబు అన్నది క్లారిటీ వచ్చింది. మరి కాపుల కోరిక ఏమవుతుంది అంటే అదే వారి ఆవేదనగా ఉంది. పవన్ నెల రోజుల క్రితం టీడీపీతో జనసేన పొత్తు ప్రకటించారు. ఆ తరువాత కాపు సామాజికవర్గంలో అసంతృప్తి ఆవేదన అన్నది బాగా పెరిగింది అంటున్నారు.

ఆ మీదట కాకినాడలో కూడా కాపు నేతలు సమావేశం అయి కాపులకే సీఎం పదవి ఉండాలని గట్టిగా కోరుకున్నారు అని కూడా వార్తలు వచ్చాయి. ఇక ఏపీ ముఖ్యం దేశం ముఖ్యం, సీఎం పదవి అంటే ఎన్నికల తరువాత గెలిచే సీట్లను బట్టి అని పవన్ కళ్యాణ్ ఎంత జాగ్రత్తగా చెప్పినా మ్యాటర్ అయితే కాపు జనాల్లోకి వెళ్ళిపోయింది. అయినా గెలిచే సీట్లను బట్టి సీఎం పదవి అంటే జనసేన టీడీపీలలో టీడీపీయే ఎక్కువ సీట్లకు పోటీ చేస్తుంది ఎక్కువ సీట్లను గెలుస్తుంది కూడా.

ఆ విధంగా చూసుకున్నా సీఎం అయ్యేది చంద్రబాబే అన్నది అర్ధం అవుతోంది కదా పోనీ చంద్రబాబు ఏడున్నర పదుల వయసులో ఉన్నారు. ఆయన ఈసారికి సీఎం పదవి చేస్తే ఆ తరువాత జనసేనదే చాన్స్ అని అనుకోవడానికి అసలు వీలు లేదు. ఆ వెంటనే లోకేష్ రెడీగా ఉన్నారు. ఆయన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఏమీ కాని రోజులలోనే అయిదు కీలక మంత్రిత్వ శాఖలు ఇచ్చి మంత్రిని చేసిన చంద్రబాబు సీఎం ని చేయకుండా ఉంటారా. సో అది కూడా అందరికీ తెలిసిందే.

మరి జనసేన పొత్తుల వల్ల సాధించేది ఏంటి అంటే జగన్ కి అధికారం దక్కకుండా చేయడం. జగన్ ఎందుకు వద్దు బాబు ఎందుకు కావాలీ అంటే దానికి పవన్ దగ్గర జవాబు అవినీతి అరాచకం అని. అదే అవినీతి అరాచకం టీడీపీ ఏలుబడిలోనూ ఉన్నాయి కదా. ఇక చంద్రబాబు తాజాగా అవినీతి కేసుల మీదనే కదా జైలులో ఉంది అన్న ప్రశ్న కూడా జనాల నుంచి వస్తుంది.

ఏతా వాతా తేలేది ఏంటి అంటే జగన్ సీఎం గా వద్దు అన్న పవన్ నినాదం లో లాజిక్ మిస్ అవుతోంది. ఆ రెండు కులాలకేనా సీఎం పదవి దాన్ని ఈసారి కాపులు కూడా తీసుకోవాలని పవన్ గట్టిగా నినదించి ఉంటే కాపులంతా ర్యాలీ అయ్యేవారు. కానీ అలా కాకుండా చంద్రబాబు బెస్ట్ ఆయన అనుభవశాలి. మరో పదేళ్ళూ టీడీపీ జనసేన పొత్తు కొనసాగాల్సిందే అంటూ జనసేనాని చేసే ప్రకటనల వల్ల కాపుల ఆశలు పూర్తిగా నీరుకారుతున్నాయి.

అపుడు వారు న్యూట్రల్ అయిపోతారు. ఏ రాయి అయితేనేంటి పళ్ళూడగొట్టుకోవడానికి అని కూడా డిసైడ్ అవుతారు. ఏపీ అప్పులలో ఉంది, పధకాలు పేరుతో ఖర్చు చేస్తున్నారు. పోలవరం లేదు, ప్రత్యేక హోదా లేదు అన్న విమర్శలు కూడా జనాలకు ఎక్కవు. ఎందుకంట చంద్రబాబు టైం లో కూడా పధకాలు తప్ప అన్నీ ఉన్నవే.

సో అపుడు కాపులతో సహా అంతా తమకు నచ్చిన ఆ ఇద్దరిలో అంటే జగన్ చంద్రబాబులలో ఎవరో ఒకరిని ఎంచుకుంటారు. కాపులలో కూడా అలాంటి ఆలోచనలే మొదలవుతునన్ వేళ జగన్ చాలా వ్యూహాత్మకంగా మన కాపులు అంటూ కాపుల జనాభా ఉన్న సామర్లకోట నుంచి పిలుపు ఇచ్చారు. మన కాపులు అంటూ ఆయన అన్న మాటలు నిజంగా వారిని టచ్ చేసేవే.

నిజానికి ఏపీలో సామాజికవర్గాల సమీకరణలు చూస్తే కాపులు ఎపుడూ ఎక్కువగా కాంగ్రెస్ తోనే పొలిటికల్ ట్రావెల్ చేశారు. టీడీపీకి ఒకటి రెండు సందర్భాలలోనే మద్దతు దక్కింది తప్ప మెజారిటీ చూస్తే అనేక ఎన్నికల్లో కాపులు కాంగ్రెస్ తో కలసి నడిచారు. ఇపుడు ఆ కాంగ్రెస్ ప్లేస్ లో వైసీపీ ఉంది. ఆ పార్టీ కాపులను సమాదరిస్తామని అంటోంది. కళ్ళ ముందు అయిదేళ్ళ పాలన ఉంది.

వైసీపీని ప్రత్యేకంగా ద్వేషించడానికి కాపులకు ఏ బలమైన రీజన్ కూడా లేదు. ఎందుకంటే కాపులను బీసీలలో కలిపేస్తామని బూటకపు హామీలు అయితే జగన్ ఇవ్వలేదు. పైగా కాపు పెద్ద అయిన ముద్రగడ పద్మనాభాన్ని మంచిగానే చూసుకుంటున్నారు. కాపుల మీద తుని గొడవల్లో పెట్టిన కేసులు వైసీపీ ప్రభుత్వం ఎత్తివేసింది. కాపు మంత్రులు ఎమ్మెల్యేలు వైసీపీలో చాలా మంది ఉన్నారు. రాజకీయంగా సామాజికపరంగా వారికి పెద్ద పీట వేస్తోంది.

అందువల్ల కాపులు ఇపుడు ఆలోచించుకుంటున్న సమయంలోనే జగన్ మన కాపులను గుత్తంగా తీసుకుని వెళ్ళి టీడీపీకి అమ్మేయడానికి పవన్ ఆలోచిస్తున్నారు అని విమర్శించారు.ఇది నిజంగా కాపులను తట్టి లేపే విధంగా ఉన్న విషయమే. ఉభయ గోదావరి జిల్లాలలో చూసుకుంటే రాజకీయం ట్రెండ్ మార్చేది వారే. అందువల్ల జగన్ వేసిన ఈ బాణం కచ్చితంగా గురి తప్పకుండా తగులుతుందని, ఈసారి గోదావరి జిల్లాలలో వైసీపీ గత ఎన్నికల మ్యాజిక్ ని రిపీట్ చేస్తుందని అంటున్నారు. మొత్తానికి సరైన సమయం సందర్భం చూసే మన కాపులు అంటూ జగన్ మాట్లాడారు అని అంటున్నారు.