'బండ' బడ: మళ్లీ 29 రూపాయల పెంపు
తాజా పెంపుతో 14.2 కిలోల గృహ వినియోగ సిలిండర్ ధర రెండు తెలుగు రాష్ట్రాల్లో 980 రూపాయలకు చేరిపోయింది.
By: Tupaki Desk | 7 Jun 2026 11:40 AM ISTపశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు.. ప్రపంచ వ్యాప్తంగా ప్రభావం చూపుతున్నాయి. అయితే.. ఇవి సామాన్యులకు శాపంగా మారడం గమనార్హం. ఇప్పటికే పెట్రోలు, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతుండగా.. తాజాగా ఆదివారం నుంచి దేశంలో గృహ వినియోగ ఎల్‌పీజీ సిలిండర్ ధర పెరిగింది. 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ ధరను 29 రూపాయల మేరకు పెంచుతూ ప్రభుత్వ చమురు సంస్థలు శనివారం నిర్ణయించారు. ఈ పెంపు ఆదివారం నుంచి అమల్లోకి వచ్చింది.
తాజా పెంపుతో 14.2 కిలోల గృహ వినియోగ సిలిండర్ ధర రెండు తెలుగు రాష్ట్రాల్లో 980 రూపాయలకు చేరిపోయింది. ఇక, దేశరాజధాఇ ఢిల్లీలో 9వందల 13 రూపాయల నుంచి 9 వందల 42 రూపాయలకు పెరిగింది. వివిధ రాష్ట్రాల్లో స్థానిక పన్నుల ఆధారంగా ధరలు మారనున్నాయి. ఇళ్లల్లో ఉపయోగించే వంటగ్యాస్ సిలిండర్ ధరను పెంచటం గత మూడు నెలల్లో ఇది రెండోసారి. మార్చి 7వ తేదీన చమురు సంస్థలు సిలిండర్ ధరను 60 రూపాయల మేరకు పెంచాయి. తాజాగా మరో 29 రూపాయల మేరకు పెంచడం గమనార్హం. అంటే.. కేవలం 40 రోజుల గ్యాప్‌లో దాదాపు 90 రూపాయల మేరకు పెంచారు.
ప్రభావం ఏంటి?
వంట గ్యాస్‌ధరలు పెరిగిన నేపథ్యంలో సామాన్యులపై తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతు న్నారు. అదేసమయంలో ఇతర ఆహార పదార్థాలపైనా ప్రభావం చూపనుంది. చాలా వరకు చిన్న చిన్న హోటళ్లు.. కమర్షియల్ సిలిండర్ల స్థానంలో ప్రస్తుతం గృహ వినియోగ వంట గ్యాస్‌నే దొడ్డిదారిలో వాడుతున్నారు. ఇప్పుడు ఈ ధరలు కూడా పెరిగిపోవడంతో సహజంగానే టిపిన్లు, టీ సహా.. ఇతర పదార్థాల ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉంది.
విద్యుత్‌పై ప్రభావం..
వంట గ్యాస్ ధరలు పెరిగిన ప్రతిసారీ ఈ ప్రభావం విద్యుత్ వినియోగంపై పడుతోంది. సిలిండర్లను వాడ డం పక్కన పెడుతున్న మధ్యతరగతి ప్రజలు.. ఎలక్ట్రిక్ స్టౌవ్‌లకు ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉంటోంది. ముఖ్యంగా ఉచిత విద్యుత్ పథకం పరిధిలో ఉన్న కుటుంబాల్లో ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు.
