Begin typing your search above and press return to search.

లోకేష్ 'రెడ్ బుక్' లో ఆర్జీవీ ఉన్నాడా...!?

ఆర్జీవీ అంటేనే సెన్సేషన్ గా చెబుతారు. ఆయన ఎపుడూ తనదైన చర్యలతో సంచలనాలు సృష్టిస్తూ ఉంటారు

By:  Tupaki Desk   |   24 Feb 2024 6:14 AM GMT
లోకేష్ రెడ్ బుక్ లో ఆర్జీవీ ఉన్నాడా...!?
X

టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీ ఉరవ్ రాం గోపాల్ వర్మ గురించి ఎపుడూ సోషల్ మీడియాలో చర్చ సాగుతూనే ఉంటుంది. ఆర్జీవీ అంటేనే సెన్సేషన్ గా చెబుతారు. ఆయన ఎపుడూ తనదైన చర్యలతో సంచలనాలు సృష్టిస్తూ ఉంటారు.

అయితే ఆర్జీవీ అన్ని రకాల జానర్లలో సినిమాలు తీశారు. కానీ ఎందుకో ఆయన పొలిటికల్ మూవీస్ వద్ద స్టక్ అయిపోయారు. అవి కూడా బయోపిక్స్ తో మొదలెట్టి ఇపుడు సమాంతర రాజకీయాన్ని వెండి తెరపైకి ఎక్కించేందుకు సైతం ఉత్సాహపడుతున్నారు.

ప్రపంచం సినిమా చరిత్రలో చూస్తే సమాంతర రాజకీయాన్ని అప్పటికపుడు వెండితెర పైన చూపించే ప్రయత్నం అయితే ఎక్కడా జరిగినట్లుగా లేదు. దానికి ఆర్జీవీయే తొలి పునాది వేశారు. అలా ఆయన వ్యూహం, శపధం చిత్రాలను తనదైన పొలిటికల్ మసాలాతో రిలీజ్ కి సిద్ధం చేశారు.

సరే సినిమాలు తీయడం వరకూ ఓకే అనుకున్నా ఆర్జీవీ డైరెక్ట్ పాలిటిక్స్ లోకి కూడా ఎంట్రీ ఇస్తూ ఎప్పటికపుడు హాట్ కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఆయన చంద్రబాబు తెలుగుదేశం పార్టీ అంటే వ్యతిరేకిస్తారు. అది తన ఇష్టం అని బాహాటంగా చెబుతూ ఉంటారు.

తనకు జగన్ ఓదార్పు యాత్రతో బాగా రిజిష్టర్ అయ్యారని, అలాగే చంద్రబాబు ఎన్టీఆర్‌ కి వెన్నుపోటు పొడిచిన తరువాత రిజిష్టర్ అయ్యారని బోల్డ్ గా చెప్పే ఆర్జీవీ మీద టీడీపీ ఎంతో మంటగా ఉంటోంది. ప్రత్యేకించి చినబాబు లోకేష్ అయితే ఆయన తాజా చిత్రాలు వ్యూహం, శపధం వంటివి రిలీజ్ కాకుండా న్యాయ పోరాటమే చేశారు.

ఈ నేపధ్యంలో చినబాబు వర్సెస్ ఆర్జీవీగా కూడా చాలా సార్లు రాజకీయ తెరమైన ఒక చిన్నపాటి సమరమే కనిపించింది. ఇక లోకేష్ గురించి చూస్తే ఇటీవల కాలంలో ఆయన రాజకీయంగా ఫుల్ బిజీ అయ్యారు. ఆయన తరచూ జనంలోకి వెళ్తున్నారు. లోకేష్ యువగళం పూర్తి చేశారు. కొంత విరామం తీసుకుని మరీ ఆయన శంఖారావం సభలలో పాల్గొన్నారు.

అయితే ఆయన యువగళం పాదయాత్ర చేసినా లేక శంఖారావం సభలు నిర్వహించినా ఒక్కటే విషయం కామన్ గా ఉంది. ఆయన చేతిలో ఎపుడూ రెడ్ బుక్ బాగా అందరినీ ఆకట్టుకుంది. అందరి జాతకాలు రెడ్ బుక్ లో ఉంటాయి టీడీపీ ప్రభుత్వం రాగానే వారి సంగతి చూస్తామంటూ ఆయన బహిరంగానే హెచ్చరికలు చేస్తూ వస్తున్నారు. అలా చూస్తే కనుక రెడ్ బుక్ అన్నది ఇపుడు ఏపీ రాజకీయాల్లోనే ప్రత్యేకత సంతరించుకుంది.

ఇదిలా ఉంటే ఈ రెడ్ బుక్ విషయంలో ఏపీ సీఐడీ కూడా నారా లోకేష్ కి నోటీసులు జారీ చేసిన సంగతి విధితమే. రెడ్ బుక్ అని పేరు చెబుతూ లోకేష్ అందరినీ బెదిరిస్తున్నారు అని సీఐడీ ఆరోపించింది. రెడ్ బుక్ అంటే అందులో అయిదేళ్ల పాటు వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ నేతలను వేధించిన వారి పేర్లు ఉంటాయని అంటున్నారు.

అలా టీడీపీని ఆ పార్టీ నేతలను గట్టిగా టార్గెట్ చేసే అధికారులు, పోలీసుల పేర్లు ఉన్నాయని కూడా చెబుతున్నారు. అందుకే వీరి పేర్లు అన్నీ నమోదు చేసి టీడీపీ అధికారంలోకి వచ్చాక రెడ్ బుక్ లో ఉన్న వారందరికీ రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని కూడా లోకేష్ చెప్పారు.

టీడీపీని ఇబ్బంది పెడుతున్న వారిలో రాం గోపాల వర్మ కూడా ఉన్నారా అన్నది ఒక డౌట్. అందుకే ఆయన పేరు కూడా రెడ్ బుక్ కి ఎక్కిందా అన్నది మరో డౌట్. ఎండుకంటే ఈ వివాదాస్పద దర్శకుడు తనదైన శైలిలో చిత్రీకరించే రాజకీయ సినిమాలతో టీడీపీని ఆ పార్టీ నేతలను బాగానే ఇబ్బంది పెడుతున్నారు అని అంటున్నారు.

అప్పట్లో ఆర్జీవీ లక్ష్మీస్ ఎన్టీఆర్‌ అన్న సినిమాలో మొత్తానికి మొత్తం చంద్రబాబు నాయుడునే ప్రధానమైన మెయిన్ విలన్‌గా చూపించేశారు. ఇక ఇపుడు రాబోతున్న వ్యుహం ట్రైలర్‌లో చూస్తే కనుక చంద్రబాబు పాత్ర పూర్తిగా యాంటీగానే ఉంటోదని అంటున్నారు.

కేవలం సినిమాలలోనే కాకుండా బయట మీడియాతో మాట్లాడినపుడు కూడా టీడీపీలో కీలకమైన నాయకుల మీద ఆర్జీవీ వేసే పంచులు సెటైర్లు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. సో అలా కనుక చూసుకుంటే లోకేష్ లెక్క ప్రకారం ఆర్జీవీ పేరు కూడా రెడ్ బుక్ లో ఉండాల్సిందే అంటున్నారు.

సినీ దర్శకుడిగా ఉన్నా కూడా రాజకీయ ఆసక్తిని చూపించే ఆర్జీవీ వైసీపీని పక్కన పెట్టి కేవలం టీడీపీ మీద చంద్రబాబు మీద విమర్శలు చేస్తూ టార్గెట్ చేస్తున్నారని టీడీపీ అభిమానులలో ఒక వర్గం భావిస్తోంది. మరి ఇవన్నీ కనుక ఆలోచిస్తే మాత్రం ఆర్జీవీ ఎపరు రెడ్ బుక్ లో ఉండి తీరాల్సిందే అని టీడీపీ ఫ్యాన్స్ అంటున్నారు. మరి నారా లోకేష్ కి ఆర్జీవీ మీద ఎలాంటి అభిప్రాయం ఉందో ఆయన్ని కూడా పొలిటికల్ లీడర్ల లిస్ట్ లో కలిపేస్తారా లేక వదిలేస్తారా అంటే రెడ్ బుక్ మొత్తం చూడాల్సిందే. అది ఎపుడూ అంటే ఎన్నికల తరువాతనే అంటున్నారు.