Begin typing your search above and press return to search.

లోకేష్ పాదయాత్ర మైలేజ్ ఎంత...!?

మొత్తం మీద చూస్తే టీడీపీ వర్గాలు అందించిన సమాచారం ప్రకారం 226 రోజుల పాటు 3132 కిలోమీటర్ల దూరాన్ని లోకేష్ నడిచారు

By:  Tupaki Desk   |   18 Dec 2023 1:10 PM GMT
లోకేష్ పాదయాత్ర మైలేజ్ ఎంత...!?
X

పాదాలు కదిపారు టీడీపీ యువనేత నారా లోకేష్. ఆయన ఈ ఏడాది మొదట్లో జనవరి 27న చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం నుంచి పాదయాత్ర ఆరంభించారు. మధ్యలో రెండు నెలల పాటు చంద్రబాబు అరెస్ట్ నేపధ్యంలో పాదయాత్ర నిలుపుదల చేశారు. మళ్లీ నవంబర్ నెలలో పాదయాత్ర మొదలెట్టి డిసెంబర్ 20తో ముగిస్తున్నారు.

మొత్తం మీద చూస్తే టీడీపీ వర్గాలు అందించిన సమాచారం ప్రకారం 226 రోజుల పాటు 3132 కిలోమీటర్ల దూరాన్ని లోకేష్ నడిచారు. దీని కనుక సగటున చూస్తే రోజుకు 14 కిలోమీటర్లు నడిచారు అన్న మాట. కుప్పం టూ ఇచ్చాపురం అని లోకేష్ పాదయాత్ర ప్రారంభించినప్పుడు చెప్పారు. అది కాస్తా నాలుగు వేల కిలోమీటర్ల పై దాటి ఉంటుంది అని కూడా లెక్క కట్టారు.

జగన్ నడచిన 3700 కిలోమీటర్లను అధిగమించి సరికొత్త రికార్డు క్రియేట్ చేయాలని కూడా ఆరాటపడ్డారు. అయితే ఇపుడు విశాఖ జిల్లా బోర్డర్ లోనే పాదయాత్ర ముగిస్తున్నారు. దానికి టీడీపీ చెప్పే కారణాలు ఏవైనా లోకేష్ పాదయాత్ర మాత్రం నడిచారు అంటే నడిచారు అన్నట్లుగానే సాగింది అని అంటున్నారు.

ఇక పాదయాత్రలో రోజుకు 14 కిలోమీటర్లు అంటే జనాలతో మమేకం అయినది కూడా తక్కువే అంటున్నారు. ఎందుకంటే ఎక్కడికక్కడ జనాలను పలకరించుకుని వెళ్తే కనుక కచ్చితంగా రోజుకు పది కిలోమీటర్లు దాటి ముందుకు వెళ్లేవారు కాదు.

అంటే నడవాలన్న దాని మీదనే లోకేష్ ఆలోచన ఉంది అని అంటున్నారు. ఇక పాదయాత్ర చంద్రబాబు అరెస్ట్ తరువాత దాదాపుగా ఆగిపోయింది అని అంతా అనుకున్నారు. దాని మీద విమర్శలు కూడా వెల్లువెత్తాయి. దాంతో అనివార్య పరిస్థితులలో పాదయాత్ర మొదలెట్టారా అన్నట్లుగానె తిరిగి సాగింది. దాన్ని కాస్తా విశాఖలో ముగిస్తున్నారు.

అంటే పాదయాత్ర ఎపుడు ముగిద్దామా అన్న ఆలోచనలోనే టీడీపీ ఉందా అన్న చర్చ కూడా సాగుతోంది. మరో వైపు చూస్తే ఈ మొత్తం పాదయాత్ర టీడీపీ రాజకీయ జాతకాన్ని మార్చాల్సి ఉంది. కానీ అలా జరిగిందా అన్నది పెద్ద ప్రశ్న.

ఎందుకు అంటే తెలుగుదేశం పార్టీ ఈసారి కచ్చితంగా అధికారంలోకి వస్తుంది అని పాదయాత్ర ముగుస్తున్న వేళ కూడా గట్టిగా చెప్పలేని పరిస్థితి ఉంది. పైగా జనసేనతో పొత్తులు వైసీపీ నుంచి నేతల కోసం ఎదురుచూపులు బీజేపీ కోసం వేచి చూడడడాలు. ఇలా చాలా సమీకరణలను టీడీపీ ముందు పెట్టుకుంటోంది.

ఇక మరో మూడు నెలలలో ఎన్నికలు ఉన్నాయి అంటే ఇప్పటికే జనాలల్లో పాజిటివ్ వేవ్ అయితే క్రియేట్ కావాలి. వైసీపీకి అలాంటిది 2019లో కనిపించింది. మరి లోకేష్ పాదయాత్ర అలాంటి వేవ్ ని సృష్టించిందా అంటే దాని మీద కూడా చర్చ సాగుతోంది. అలా కనుక చూసుకుంటే పాదయాత్ర తెచ్చిన పొలిటికల్ మైలేజ్ ఎంత అన్న బిగ్ క్వశ్చన్ అయితే ఉంది. ఏది ఎలా చూసుకున్నా కూడా లోకేష్ పాదయాత్ర అలా సాగిపోయింది అని చెప్పాల్సిందే. మరి దీని మీద టీడీపీ ఏ రకమైన మధింపు చేసుకుంటుంది, ఏ రకమైన అంచనాలకు వస్తుంది అన్నది చూడాలి.

ఏది ఏమైనప్పటికీ వైసీపీతో టఫ్ ఫైట్ మాత్రం 2024 ఎన్నికల్లో ఉంది అన్నది టీడీపీ కూడా అంగీకరించే విషయంగా ఉంది అని అంటున్నారు. దీనిని బట్టి చూస్తే టీడీపీ ఇంకా ఎక్కువగా కష్టపడాల్సిందే అని అంటున్నారు. చూడాలి మరి 2024 ఎన్నికలు ఎలా ఉంటాయి. లోకేష్ పాదయాత్ర ప్రభావం ఏపాటిది అన్నది కూడా అపుడే తేలుతుంది.