జన నాయకుడుగా లోకేష్...రూట్ మ్యాప్ రెడీ !
తెలుగుదేశం పార్టీలో నారా లోకేష్ ప్రాధాన్యత అందరికీ తెలిసిందే. ఆయన చంద్రబాబు తరువాత స్థానంలో ఉన్నారు.
By: Satya P | 5 May 2026 9:00 PM ISTతెలుగుదేశం పార్టీలో నారా లోకేష్ ప్రాధాన్యత అందరికీ తెలిసిందే. ఆయన చంద్రబాబు తరువాత స్థానంలో ఉన్నారు. ఈ మధ్యనే ఆయనకు పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని కూడా ఇచ్చారు బాబు ఆయనతో ప్రమాణం చేయించారు. ఇక ప్రభుత్వంలో కీలక శాఖలను చూస్తున్న యువ మంత్రిగా ఉన్నారు. అలా పార్టీ ప్రభుత్వంలో లోకేష్ ప్రాధాన్యతమైన ప్రభావవంతమైన పాత్ర నిర్వహిస్తున్నారు. అయితే ఇది మాత్రమే సరిపోదని జనాలకు పార్టీ జనాలకు లోకేష్ మరింతగా కనెక్ట్ కావాల్సిన అవసరం ఉందని పార్టీ భావిస్తోంది అని అంటున్నారు.
లోకేష్ ప్రభావం :
రాష్ట్రంలో చూస్తే పక్కా మాస్ లీడర్ గా లోకేష్ ని చూపించాలన్న వ్యూహం టీడీపీకి ఉందని అంటున్నారు. లోకేష్ ఇప్పటికే పార్టీ వారిని కలుస్తున్నారు. ప్రభుత్వంలో మంత్రులతో కూడా ఇంటరాక్ట్ అవుతున్నారు. ఎమ్మెల్యేలతో కూడా ఆయన కలసి మెలసి ఉంటున్నారు. క్యాడర్ కి దగ్గరగా ఉండడం చేస్తున్నారు. అయితే ఇది చాలదని అంత కంటే ఎక్కువగా జనంలో ఉండేలా ఒక బృహత్ కార్యక్రమం పార్టీ పెద్దలు డిజైన్ చేస్తున్నారు. అది ఎంతలా అంటే లోకేష్ పేరు జన బాహుళ్యంలో మారు మోగేలా అని అంటున్నారు. లోకేష్ యువగళం పాదయాత్ర సమయంలో తనలోని నాయకత్వ లక్షణాలను బయటపెట్టారు. దాంతో అందరూ ఆయనలోని కొత్త కోణాన్ని చూశారు అలా ఒకేసారి లోకేష్ పది మెట్లు ఎక్కేశారు. అయితే ఇపుడు పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో లోకేష్ మళ్ళీ జనంతో కనెక్ట్ కావాల్సి ఉందని భావిస్తున్నారు.
యువగళం కంటే మిన్నగా
ఇక నారా లోకేష్ విషయం తీసుకుంటే ఆయన 2023లో చేపట్టిన యువగళం పాదయాత్ర సూపర్ సక్సెస్ అయింది అంతకు ముందు ఆ తరువాత అన్నట్లుగా లోకేష్ పాత్రను మార్చేసింది. ఇక ఆ మీదట టీడీపీ కూటమి విజయం సాధించడం లోకేష్ ప్రభుత్వంలో మంత్రిగా ఉండడం గడచిన రెండేళ్ళలో తన సత్తాను తన శాఖలల నిరూపించుకోవడం వంటివి జరుగుతున్నాయి. అయితే ఈసారి అలా కాదు, 2029 ఎన్నికల నేపథ్యంలో లోకేష్ ఇంతకు ఇంత రాజకీయంగా రాటు తేలాలీ అంటే జనంలో నిత్యం ఉండేలా పార్టీ రాష్ట్ర స్థాయి పర్యటనలు కార్యక్రమాలు డిజైన్ చేస్తోంది అని అంటున్నారు.
ఫుల్ ఫోకస్ ఉండేలా :
ఏపీలో చంద్రబాబుకు దిగ్గజ నేతగా పేరుంది. ఆయన వారసుడిగా లోకేష్ కి పార్టీలో ఎదురులేదు, యాక్సెప్టెన్స్ ఉంది. అయితే జనసామాన్యంలో కూడా దానికి బలమైన ఆమోదం అవసరం అన్నదే పార్టీ వ్యూహకర్తల భావనగా ఉంది. చంద్రబాబు తరువాత సిసలైన నాయకుడు పార్టీకే కాదు రాష్ట్రానికి రేపటి రాష్ట్ర భవిష్యత్తుకూ లోకేష్ అని ఏపీలోని ఆరు కోట్ల జనాలు అంతా ఆమోదించేలా ఉండాలీ అంటే లోకేష్ మరింతగా జనంలో ఉంటూ తన సత్తాను నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు. దాని కోసమే పార్టీ ఒక భారీ యాక్షన్ ప్లాన్ ని రూపొందిస్తోంది అని అంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలీ అంటే లోకేష్ మీదనే ఫుల్ ఫోకస్ ఉండేలా టీడీపీ పధక రచన చేస్తోంది అని అంటున్నారు.
రాష్ట్రాన్ని నడిపించే నేతగా :
పార్టీ అధినేత వేరు, మంత్రిగా సామర్థ్యం వేరు, ఆరు కోట్ల మంది ఉన్న ఒక రాష్ట్రాన్ని నడిపించే అధినేతగా ఉండడం వేరు. జనాలకు ఆ భరోసా కల్పించాల్సిన అవసరం ఉందని అంటున్నారు లోకేష్ లో చంద్రబాబుని చూసుకునేలా ఉండాలంటే మరింతగా లోకేష్ జనంలో ఉంటూ కష్టపడాల్సి ఉందని అంటున్నారు. పై స్థాయిలో పార్టీ పరంగా పదవులు అందుకోవడం కాకుండా జనం నుంచే వాటికి తగిన ఆమోద ముద్ర వేయించుకోవాలంటే ప్రజల వద్దకు లోకేష్ వెళ్లడమే ఉత్తమ మార్గం అని పార్టీలో చర్చ సాగుతోంది. దాంతో రానున్న కాలంలో లోకేష్ తో రాష్ట్ర స్థాయిలో పర్యటించేందుకు భారీ కార్యక్రమాలనే డిజైన్ చేయిస్తున్నారు అని అంటున్నారు. అవి ఏ స్థాయిలో ఉంటాయో యువ గళాన్ని మించి ఏ తీరున ఉంటాయో అన్నది వేచి చూడాల్సి ఉంది. ఏది ఏమైనా లోకేష్ జన నాయకుడు అనిపించుకోవాలని చూస్తున్నారు అని అంటున్నారు. సో ఆ దిశగా భారీ కార్యాచరణ అయితే టీడీపీ సిద్ధం చేసి పెడుతోంది అని అంటున్నారు.
