Begin typing your search above and press return to search.

ఒంగోలు న్యాయవాది మర్డర్.. యాక్సిడెంట్ గా కలరింగ్

ఒంగోలుకు చెందిన యువ లాయర్ శ్రీరామ హరిప్రసాద్ (37) దారుణ హత్యకు గురయ్యారు.

By:  Garuda Media   |   11 April 2026 4:19 PM IST
ఒంగోలు న్యాయవాది మర్డర్.. యాక్సిడెంట్ గా కలరింగ్
X

ఒంగోలుకు చెందిన యువ లాయర్ శ్రీరామ హరిప్రసాద్ (37) దారుణ హత్యకు గురయ్యారు. పక్కాగా ప్లాన్ చేసి హత్య చేసిన అనంతరం.. దాన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేయటం గమనార్హం. అయితే.. పోలీసుల విచారణలో ఇది రోడ్డు ప్రమాదం ఎంతమాత్రంకాదని.. హత్యగా గుర్తించారు. చిలకలూరిపేట మండల పరిధిలో హత్యకు గురయ్యారు. ఒంగోలుకు చెందిన హరిప్రసాద్ జిల్లా కోర్టులో లాయర్ గా ప్రాక్టీస్ చేస్తున్నారు. గురువారం హైకోర్టుకు వెళుతున్నట్లు ఇంట్లో చెప్పి ఊరి నుంచి బయలుదేరాడు. అదే రోజు రాత్రి 8.43 గంటల సమయంలో ఇంట్లో వారితో ఫోన్ చేసి మాట్లాడాడు. అయితే.. తెల్లారేసరికి అతను ప్రాణాలు కోల్పోయినట్లుగా గుర్తించారు.

చూసినంతనే రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినట్లుగా కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. స్కూటీ రోడ్డు పక్కన పడిపోయి ఉండటం.. దాని కింద హరిప్రసాద్ నిర్జీవంగా పడి ఉన్నారు.తలపై బలంగా కొట్టిన గాయం ఉంది. క్లూస్ టీం.. ఫోరెన్సిక్ టీంలతో పాటు పోలీసు జాగిలాలను ఘటనా స్థలానికి రప్పించారు. ఒంగోలు నుంచి బయలుదేరిన హరిప్రసాద్ నరసరావుపేటలో బంధువులకు రాత్రి వేళలో కనిపించినట్లు చెబుతున్నారు.

అతను ప్రయాణిస్తున్న స్కూటీని మరో టూ వీలర్ ఫాలో అయినట్లుగా తెలుస్తోంది. ఇందుకు తగ్గ ఆధారాల్ని పోలీసులు సీసీ కెమేరా ఫుటేజ్ ద్వారా గుర్తించారు. హరిప్రసాద్ కు భార్య.. కొడుకు..కుమార్తె ఉన్నారు.హరిప్రసాద్ తల్లి ఇచ్చిన ఫిరర్యాదు ఆధారంగా హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు కారణం ఏమై ఉంటుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. స్థానికులు.. హరిప్రసాద్ కు సన్నిహితుల అంచనా ప్రకానం ఒంగోలులోని ఒక భూవివాదమే ప్రాణాలు పోయేలా చేసిందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల విచారణలో అసలు వాస్తవాలు వెలుగు చూసే వీలుందని చెబుతున్నారు.