Begin typing your search above and press return to search.

ఎన్టీయార్ భార్యను... రాష్ట్రపతికి లక్ష్మీపార్వతి లేఖ!

అయితే తాను ఎన్టీయార్ సతీమణిని తనను కూడా పిలవాలంటూ తాజాగా లక్ష్మీపార్వతి రాష్ట్రపతికి లేఖ రాయడం చర్చనీయాంశం అయింది.

By:  Tupaki Desk   |   24 Aug 2023 6:27 PM GMT
ఎన్టీయార్ భార్యను... రాష్ట్రపతికి లక్ష్మీపార్వతి లేఖ!
X

తాను దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీయార్ కి సతీమణిని అంటూ లక్ష్మీపార్వతి రాష్ట్రపతికి లేఖ రాశారు ఈ నెల 28న న్యూ ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో ఎన్టీయార్ బొమ్మతో ముద్రించిన వెండి నాణెం ఆవిష్కరణ జరగనుంది. వంద రూపాయల ఈ నాణేన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విడుదల చేస్తారు.

ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఎన్టీయార్ ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు అథిధులు అందరినీ కలిపి వందమంది దాకా ఆహ్వానించింది రాష్ట్రపతి భవన్. అయితే తాను ఎన్టీయార్ సతీమణిని తనను కూడా పిలవాలంటూ తాజాగా లక్ష్మీపార్వతి రాష్ట్రపతికి లేఖ రాయడం చర్చనీయాంశం అయింది.

ఈ కార్యక్రమానికి చంద్రబాబుతో పాటు నారా నందమూరి కుటుంబీకులకు ఆహ్వానాలు వెళ్లాయి. అంతా హాజరయ్యేందుకు సిద్ధమవుతున్నారు. దాంతో తనను పిలవకపోవడం పట్ల లక్ష్మీపార్వతి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తాను ఎన్టీయార్ ను వివాహం చేసుకున్నానని, 1994లో జరిగిన ఎన్నికల ప్రచారంలో తాను ఎన్టీయార్ కలసి పాల్గొన్నామని ఆమె రాష్ట్రపతికి రాసిన లేఖలో వెల్లడించారు.

ఎన్టీఆర్‌తో వివాహం, ఎన్నికల్లో గెలుపు, ఆ తర్వాత జరిగిన పరిణామాలు తదితర అంశాలతో ఆమె ఈ లేఖ రాష్ట్రపతికి రాశారు. కేవలం నారా నందమూరి కుటుంబాలను పిలిచి తనను పక్కన పెట్టడం పట్ల ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తనను కనీసం అతిధుల జాబితాలో అయినా ఆహ్వానించాలని ఆమె కోరారు.

మరి లక్ష్మీపార్వతిని ఆహ్వానిస్తారా అన్నది చూడాలి. ఎందుకంటే ఒక వైపు ఎన్టీయార్ ఫ్యామిలీ నారా కుటుంబీకులు హాజరవుతున్నారు. ఎన్టీయార్ తో పరిచయం ఉన్న వారు సన్నిహితులకు ఆహ్వానాలు వెళ్ళాయి. ఈ నేపధ్యంలో రెండవ భార్యగా గుర్తించి లక్ష్మీపార్వతికి ఆహ్వానం అందాల్సి ఉందని అంటున్నారు

ఆమెను పక్కన పెట్టడం పట్ల చర్చ కూడా జోరుగా సాగుతోంది. బీజేపీకి టీడీపీకి మధ్య పొత్తులు ఉంటాయని వార్తలు వస్తున్నాయి. అలాగే ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ గా దగ్గుబాటి పురంధేశ్వరి ఉన్నారు. చంద్రబాబు టీడీపీ ప్రెసిడెంట్ గా ఉన్నారు. బీజేపీ పెద్దలు అయితే ఏ ఏపీలో ఎన్టీయార్ పేరుని వాడుకోవాలని చూస్తున్నారు. ఈ క్రమంలో లక్ష్మీపార్వతిని పక్కన పెట్టడం వెనక రాజకీయం ఉందా అన్న చర్చ వస్తోంది. ఆమె అయితే వైసీపీలో ఉన్నారు. ఆమె లేఖ మీద రాష్ట్రపతి భవన్ ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాల్సి ఉంది అని అంటున్నారు.