Begin typing your search above and press return to search.

బిగ్ బ్రేకింగ్... డ్రగ్స్ కేసులో డైరెక్టర్ క్రిష్!

గత రెండు రోజులుగా రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసు హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   27 Feb 2024 9:11 AM GMT
బిగ్ బ్రేకింగ్... డ్రగ్స్ కేసులో డైరెక్టర్ క్రిష్!
X

గత రెండు రోజులుగా రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసు హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రధానంగా తెలంగాణ బీజేపీ నేత కుమారుడు ఉన్నాడని వార్తలు మొదలైనప్పటి నుంచి.. టాలీవుడ్ లింకుల వరకూ హాట్ టాపిక్ గా మారింది. ఇందులో భాగంగా ఒక నటి పేరు ఎఫ్.ఐ.ఆర్. లో చేర్చినట్లు కథనాలొచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి పేరూ కూడా తెరపైకి వచ్చింది! ఈ విషయాన్ని పోలీసులు నిర్ధారించారని సమాచారం.

అవును... గచ్చిబౌలి లోని రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసు వ్యవహారంలో ఇప్పటికే పలు సంచలనాలు తెరపైకి రాగా.. తాజాగా మరో సంచలనం వెలుగులోకి వచ్చింది! ఇందులో భాగంగా టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ కూడా ఈ డ్రగ్స్ పార్టీలో ఉన్నట్లు పోలీసులు తేల్చారని తెలుస్తుంది! డ్రగ్ పెడ్లర్ అబ్బాస్ ఇచ్చిన స్టేట్ మెంట్ లో క్రిష్ పేరు ప్రస్థావించినట్లు చెబుతున్నారు. ఆ పార్టీ జరిగే సమయంలో వివేకానంద తోనే క్రిష్ ఉన్నట్లు చెబుతున్నారు!

తీగ లాగితే కొకైన్‌ డొంక కదులుతోందని తెలుస్తుంది! తాజాగా అందుతున్న ప్రాథమిక సమాచారం ప్రకారం... గజ్జల వివేకానందకు స్నేహితుడిగా ఉన్న క్రిష్.. తాజాగా ఆయన ఇచ్చిన పార్టీకి వచ్చినట్లుగా పోలీసులు గుర్తించారని తెలుస్తుంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకూ 10మందిపై కేసులు నమోదైనట్లు తెలుస్తుండగా... ఇందులో ఎనిమిదో పేరుగా క్రిష్ జాగర్లమూడిని చేర్చినట్లు చెబుతున్నారు.

అయితే ప్రస్తుతానికి క్రిష్ కోసం పోలీసులు చూస్తున్నారని.. ఆయన అందుబాటులోకి రాగానే నోటీసులు ఇవ్వనున్నారని చెబుతున్నారు. ఈ సమయంలో ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచిన పోలీసులు.. మిగిలిన 7గురి కోసం గాలిస్తున్నారని తెలుస్తుంది. అందులో భాగంగా క్రిష్ పేరు కూడా తెరపైకి వచ్చింది!

కాగా... ఆదివారం అర్ధరాత్రి రాడిసన్ హోటల్‌ పై సైబరాబాద్ పోలీసులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయలో కొకైన్ సేవించేందుకు ఉపయోగించిన ప్లాస్టిక్ కవర్ రోల్స్ స్వాధీనం చేసుకున్న పోలీసులు... నిందితులు అప్పటికే డ్రగ్స్ తీసుకున్నట్లు గుర్తించారని తెలుస్తుంది. అనంతరం వివేకాతో పాటు మరో ఇద్దరిని టెస్ట్ చేయగా.. వారు డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ అయ్యిందని అంటున్నారు.