Begin typing your search above and press return to search.

100 శాతం స్ట్ర‌యిక్ రేట్.. కోటంరెడ్డి ఆశ‌లు నెర‌వేరుతాయా?!

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నట్లు సంకేతాలు ఇచ్చారు. తన నియోజకవర్గంలో టీడీపీ కూటమి అభ్యర్థుల విజయాన్ని ప్రస్తావిస్తూ, గతంలోనూ వ్యక్తం చేసిన ఆకాంక్షను మరోసారి బయటపెట్టారు. చంద్రబాబు నిర్ణయంపై ఆసక్తి నెలకొంది.

By:  Tupaki Desk   |   9 Nov 2026 4:08 PM IST
100 శాతం స్ట్ర‌యిక్ రేట్.. కోటంరెడ్డి ఆశ‌లు నెర‌వేరుతాయా?!
X

నెల్లూరు రూర‌ల్ ఎమ్మెల్యే కోటిరెడ్డి శ్రీధ‌ర్‌ రెడ్డి కి మంత్రి పీఠంపై ఆశ ఉంది. గ‌త వైసీపీ హ‌యాంలో ఆయ‌న మంత్రి పీఠం ద‌క్కించు కునేందుకు శ‌త విధాల ప్ర‌య‌త్నించారు. కానీ, జ‌గ‌న్ అవ‌కాశం ఇవ్వ‌లేదు. సామాజిక న్యాయం పేరుతో ఆయ‌న కొత్త‌గా ఎన్నికైన వారికి.. అప్ప‌టిక‌ప్పుడు పార్టీ తీర్థం పుచ్చు కున్న‌వారికి అవ‌కాశం ఇచ్చారు. ఇదే చాలా మంది నాయ‌కుల‌కు ఆగ్ర‌హం తెప్పించింది. ఫ‌లితంగా వారంతా బ‌య‌ట‌కు వ‌చ్చారు. ఇలా వ‌చ్చిన నెల్లూరు రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి టీడీపీ కండువా క‌ప్పుకొన్నారు.

వాస్త‌వానికి కోటంరెడ్డి రాజ‌కీయ ప్ర‌వేశం చేసిన నాటి నుంచి .. అంటే, కాంగ్రెస్‌లో చేరినప్ప‌టి నుంచి కూడా టీడీపీకి వ్య‌తిరేకంగానే రాజ‌కీయాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ త‌ర్వాత ఆయ‌న వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ క్ర‌మంలోనే 2019-24 మ‌ధ్య వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే.. త‌న‌కు మంత్రి ప‌ద‌వి కావాలంటూ.. మీడియా ముందే చెప్పారు. అయినా.. జ‌గ‌న్ విన‌లేదు. ఆ త‌ర్వాత రెండున్న‌రేళ్ల‌కు మంత్రి వ‌ర్గ ప్ర‌క్షాళ‌న చేశారు. అప్పుడైనా త‌న‌కు మంత్రివ‌ర్గంలో చోటు ఇవ్వాల‌ని కోరారు. అప్పుడు కూడా ఛాన్స్ చిక్క‌లేదు.

ఈ కార‌ణంగానే కోటంరెడ్డి వైసీపీని వీడి బ‌య‌ట‌కు వ‌చ్చారు. ఇక‌, ఆ త‌ర్వాత‌.. టీడీపీ టికెట్‌పై నెల్లూరు రూర‌ల్ స్థానం నుంచే గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించు కున్నారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు, మంత్రి లోకేష్ క‌నుస‌న్న‌ల్లో ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకు వెళ్ల‌డంలోనూ.. ప్ర‌భుత్వం త‌ర‌ఫున అభివృద్ధి కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌డం లోనూ ముందున్నాన‌ని ఆయ‌న చెబుతున్నారు. ఇక‌, స్థానికంగా ఎలాంటి ఆర్భాటాల‌కు పోకుండా.. ప్ర‌జ‌ల‌ను క‌లుసుకుంటూ.. వారి స‌మ‌స్య‌లు కూడా వింటున్నారు.

క‌ట్ చేస్తే..

తాజాగా జ‌రిగిన ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ ఎన్నిక‌ల్లో టీడీపీ కూట‌మి అభ్య‌ర్థుల‌ను పూర్తిస్థాయిలో గెలిపించిన‌ట్టు తాజాగా కోటంరెడ్డి చెప్పుకొచ్చారు. నెల్లూరు రూర‌ల్ నియోజ‌క‌ వ‌ర్గంలోని అన్ని ఎంపీటీసీలు, జ‌డ్పీటీసీలు పూర్తిగా టీడీపీ వ‌శ‌ మ‌య్యాయ‌న్నారు. త‌న నియోజ‌క‌వ‌ర్గం పూర్తిగా టీడీపీకి కంచుకోట‌గా మారింద‌న్నారు. ప్రెస్‌మీట్ అనంత‌రం.. ఆఫ్‌ది రికార్డుగా మీడియా మిత్రులు.. ``మీరు ఏం ఆశిస్తున్నారు?`` అని ప్ర‌శ్నించ‌గా.. తాను కొత్త‌గా చెప్పేది లేదంటూ..గ‌తంలో త‌న మ‌న‌సులో ఉన్న విష‌యాన్నే ఆయ‌న చెప్పుకొచ్చారు. సో.. కోటంరెడ్డి మంత్రి ప‌ద‌విని ఆశిస్తున్నార‌న్న‌ది స్ప‌ష్ట‌మైంది. మ‌రి చంద్ర‌బాబు ఏం చేస్తారో చూడాలి. కానీ, ప్ర‌స్తుతం మంత్రి వ‌ర్గంలో నెల్లూరు జిల్లా నుంచి ఆనం రామ‌ నారాయ‌ణ‌రెడ్డి, పొంగూరు నారాయ‌ణ‌లు ఉన్నారు.